Hardik Pandya: జాస్మిన్ వాలియాతో కటీఫ్.. కట్ చేస్తే.. మహికా శర్మతో హార్దిక్ పాండ్యా డేటింగ్.. ఎవరో తెలుసా?
Hardik Pandya Dating Rumours With Mahieka Sharma: ఈ ఏడాది ప్రారంభంలో నటి నటాషా స్టాంకోవిక్ నుంచి విడిపోయినట్లు ప్రకటించిన తర్వాత, ఆల్ రౌండర్, మోడల్, నటి మహికా శర్మతో టీమిండియా ప్లేయర్ హార్దిక్ పాండ్యా డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో హాట్ హాట్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Hardik Pandya Dating Rumours With Mahieka Sharma: జులై 2025లో, టీమిండియా ఆల్-రౌండర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషా స్టాంకోవిచ్‌తో విడాకులు తీసుకున్న తర్వాత బ్రిటీష్ గాయని జాస్మిన్ వాలియాతో డేటింగ్ చేస్తున్నాడని వదంతులు వచ్చాయి. అయితే, జాస్మిన్ వాలియా, హార్దిక్ ఇద్దరూ తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. దీంతో వారి బ్రేకప్ గురించి వార్తలు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో, కొన్ని భారతీయ పత్రికలలో మహికా శర్మ అనే నటితో హార్దిక్ పాండ్యా డేటింగ్ చేస్తున్నాడని కథనాలు వచ్చాయి.
హార్దిక్ పాండ్యా, మహికా శర్మ డేటింగ్ వార్తలు..
తాజా నివేదికల ప్రకారం, భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన జీవితంలో మరోసారి ప్రేమలో పడ్డాడని ఊహాగానాలు వచ్చాయి. ఇదివరకే బాలీవుడ్ నటి, మోడల్ నటాషాను పెళ్లి చేసుకున్న పాండ్యా, ఇప్పుడు ఆమె నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత జాస్మిన్ వాలియాతో డేటింగ్ చేస్తున్నాడనే వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు జాస్మిన్ వాలియాతో బ్రేకప్ తర్వాత, అస్సామీ నటి, మోడల్ మహికా శర్మతో హార్దిక్ డేటింగ్ చేస్తున్నాడని సోషల్ మీడియాలో కథనాలు హల్ చల్ చేస్తున్నాయి. కానీ, ఈ వార్తలపై ఇటు హార్దిక్ పాండ్యా గాని, అటు మహికా శర్మ గాని ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ వార్తలు కేవలం రూమర్స్ గానే మిగిలిపోయాయి.
మహికా శర్మ ఎవరు?
మహికా శర్మ అస్సామీ సినిమా నటి, మోడల్. ఆమె అందాల పోటీలలో పాల్గొని మిస్ టీన్ నార్త్‌ఈస్ట్ టైటిల్ గెలుచుకుంది. టీవీ సీరియల్స్, సినిమాలలో కూడా నటించింది. ఆమె సేవా కార్యక్రమాలలో భాగంగా లైంగిక కార్యకర్తల పునరావాసానికి కృషి చేస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








