AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గాయపడ్డోడికి చోటివ్వడం మూర్ఖత్వమే.. కట్‌చేస్తే.. 131 రోజుల తర్వాత రీఎంట్రీ.. సెంచరీతో గంభీర్‌కు దమ్కీ ఇచ్చిన కేఎల్..

KL Rahul Century: గాయం కారణంగా ఆటకు దూరంగా ఉన్న కేఎల్ రాహుల్ టీమ్ ఇండియాకు తిరిగి రావడానికి సమయం పట్టింది. అందుకే పాకిస్థాన్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో ఆడలేకపోయాడు. సూపర్-4 మ్యాచ్‌లో కూడా అతను ప్లేయింగ్ ఎలెవన్‌లో భాగం కాకపోయినప్పటికీ శ్రేయాస్ అయ్యర్‌కు అకస్మాత్తుగా గాయం కావడంతో రాహుల్ పునరాగమనానికి మార్గం ఓపెన్ అయింది.

గాయపడ్డోడికి చోటివ్వడం మూర్ఖత్వమే.. కట్‌చేస్తే.. 131 రోజుల తర్వాత రీఎంట్రీ.. సెంచరీతో గంభీర్‌కు దమ్కీ ఇచ్చిన కేఎల్..
Kl Rahul Gambhir
Venkata Chari
|

Updated on: Sep 11, 2023 | 8:45 PM

Share

KL Rahul Century: 131 రోజుల తర్వాత తిరిగి వచ్చాడు. వచ్చిన వెంటనే తుఫాన్ ఇన్నింగ్స్‌తో సెంచరీ బాదేశాడు. కేఎల్ రాహుల్ టీమిండియాకు పునరాగమనాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో జరుగుతోన్న సూపర్-4 రౌండ్ మ్యాచ్‌లో చివరి క్షణంలో టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకున్న రాహుల్.. కొలంబోలో ఆడిన ఇన్నింగ్స్, టీమిండియాకు మిడిల్ ఆర్డర్ సమస్యను పరిష్కరించడమే కాకుండా.. ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు కల్పించడాన్ని వ్యతిరేకించిన విమర్వకుల బ్యాండ్ బజాయించాడు. ఈ సెంచరీతో వాళ్ల నోరుమూయించాడు. ఇందులో గౌతమ్ గంభీర్ ఒకరు. ఇషాన్ కిషన్‌ను జట్టులో ఉంచుకోవాలంటూ, కేఎల్ రాహుల్ పనికిరాడంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు.

జట్టులో కేఎల్ రాహుల్ స్థానంపై తాజాగా ఎన్నో ప్రశ్నలు వినిపించాయి. IPL 2023 సమయంలో, ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు తొడ గాయం కారణంగా రాహుల్ సీజన్ మధ్యలో దూరమయ్యాడు. అప్పటి నుంచి జట్టు నుంచి తప్పుకున్నాడు. ఈ సమయంలో జట్టు ఇతర ఆటగాళ్లను ప్రయత్నించింది. కానీ, అందులో పెద్దగా విజయం సాధించలేదు. తాజాగా కేఎల్ రాహుల్ ఫిట్‌గా మారిన వెంటనే జట్టులో చోటు దక్కించుకున్నాడు.

ప్లేయింగ్ 11లో చోటు కల్పించడంపై గంభీర్ ఫైర్..

రీఎంట్రీ తర్వాత ఎన్నో విమర్శలు ఎదుక్కొన్న రాహుల్.. వాటికి తన సెంచరీతోనే సమాధానమిచ్చాడు. రాహుల్ దూరంగా ఉన్న సమయంలో టీమ్ ఇండియా మిడిల్ ఆర్డర్‌లో ఇషాన్ కిషన్‌ను ఆడవలసి వచ్చింది. ఇషాన్ 82 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి తన వాదనను చాటుకున్నాడు. ఐపీఎల్‌లో కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్, గౌతమ్ గంభీర్ రాబోయే మ్యాచ్‌లలో రాహుల్ స్థానంలో ఇషాన్‌కు అవకాశం ఇవ్వాలని చెప్పుకొచ్చాడు. వరుసగా నాలుగు హాఫ్ సెంచరీలు చేసిన ఇషాన్‌ను తొలగించడం సరికాదని, రాహుల్‌ను దూరం పెట్టవచ్చని గంభీర్ పేర్కొన్నాడు.

రాహుల్ తన దాడిని కొనసాగించి 48వ ఓవర్‌లో వన్డే కెరీర్‌లో ఆరో సెంచరీని నమోదు చేశాడు. నసీమ్ షా వేసిన బంతికి రాహుల్ 2 పరుగులు చేసి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పాకిస్థాన్‌పై రాహుల్‌కు ఇదే తొలి సెంచరీ. ఇక్కడికి చేరుకోవడానికి అతను 10 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టాడు. ప్రపంచ కప్‌నకు ముందే టీమిండియా మిడిల్ ఆర్డర్ పూర్తిగా సిద్ధంగా ఉందని అందరికీ సమాధానం ఇచ్చాడు.

పాకిస్తాన్‌పై తొలి సెంచరీ..

పాకిస్థాన్ పై ఈ మిడిలార్డర్ బ్యాటర్ తన తొలి సెంచరీ సాధించాడు. రెండున్నరేళ్ల తర్వాత వన్డే క్రికెట్‌లో శతకం కొట్టేశాడు. రాహుల్ చివరిసారిగా 2021 మార్చి 26న ఇంగ్లండ్‌పై 108 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. పాకిస్థాన్‌తో పాటు ఇంతకుముందు ఇంగ్లండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వేలపై ఒక్కో సెంచరీలు బాదేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..