Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ, 2nd Test, Day 2 Highlights: ముగిసిన రెండో రోజు.. 332 పరుగుల ఆధిక్యంలో భారత్..!

Narender Vaitla

| Edited By: Venkata Chari

Updated on: Dec 04, 2021 | 5:26 PM

IND vs NZ, 2nd Test, Day 2 Highlights: రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 69 పరుగులు చేసింది. దీంతో మొత్తంగా టీమిండియా ఆధిక్యం 332 పరుగులకు చేరింది.

IND vs NZ, 2nd Test, Day 2 Highlights: ముగిసిన రెండో రోజు.. 332 పరుగుల ఆధిక్యంలో భారత్..!
India Vs New Zealand 2nd Test Mumbai

IND vs NZ, 2nd Test, Day 2 Highlights: ముంబై టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 69 పరుగులు చేసింది. దీంతో మొత్తంగా టీమిండియా ఆధిక్యం 332 పరుగులకు చేరింది. పుజరా 29, మయాంక్ అగర్వాల్ 38 పరుగులతో నిలిచారు. అంతకుముందు, న్యూజిలాండ్ కూడా మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 325 పరుగులకు ఆలౌట్ కావడంతో కేవలం 62 పరుగులకే కుప్పకూలింది. సిరీస్‌ కైవసం కోసం జరుగుతోన్న రెండో టెస్ట్‌ మ్యాచ్‌లో రెండో రోజు ప్రారంభమైంది. అంతకు ముందు వర్షం కారణంగా శుక్రవారం మ్యాచ్‌ ఆలస్యంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారత్‌ 70 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయిన భారత్ 221 పరుగులు సాధించింది. నిజానికి టీమిండియా స్కోర్‌ ఇంకా భారీగా ఉండాల్సింది. కానీ వరుసగా వికెట్లు పడడంతో జట్టు స్కోరు తగ్గింది. ఇక ప్రస్తుతం క్రీజులో మయాంక్ అగర్వాల్(120 పరుగులు, 246 బంతులు, 14 ఫోర్లు, 4 సిక్సులు), సాహా(25 పరుగులు, 53 బంతులు, 3 ఫోర్లు, 1 సిక్స్) ఉన్నారు. శుభ్మన్ గిల్ 44, పుజరా 0, విరాట్ కోహ్లీ 0, శ్రేయాస్ అయ్యర్ 18 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. న్యూజిలాండ్ బౌలర్లలో అజాజ్ పటేల్ ఒక్కడే 4 వికెట్లు పడగొట్టాడు.

తొలి రోజు బౌలింగ్‌లో న్యూజిలాండ్‌ పైచేయి చూపించినప్పటికీ, తర్వాత కోలుకున్న టీమిండియా బ్యాట్స్‌మెన్ ఆచితూచి ఆడారు. ముఖ్యంగా మయాంక్‌ అగర్వాల్‌ 120 పరుగులతో రాణించడంతో టీమిండియా మళ్లీ పుంజుకుంది. మరి రెండో రోజు ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.

భారత్‌ వర్సెస్‌ న్యూజిలాండ్‌ టెస్ట్‌ మ్యాచ్‌ లైవ్‌ స్కోర్‌ అప్‌డేట్స్‌..

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 04 Dec 2021 05:24 PM (IST)

    ముగిసిన రెండో రోజు ఆట..

    ముంబై టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 69 పరుగులు చేసింది. దీంతో మొత్తంగా టీమిండియా ఆధిక్యం 332 పరుగులకు చేరింది. పుజరా 29, మయాంక్ అగర్వాల్ 38 పరుగులతో నిలిచారు.

  • 04 Dec 2021 05:12 PM (IST)

    అర్థ సెంచరీ భాగస్వామ్యం..

    భారత సెకండ్ ఇన్నింగ్స్‌లో మయాంక్ అగర్వాల్(29), పుజరా(28) అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు. దీంతో వీరిద్దరి మధ్య హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొంది. దీంతో ప్రస్తుతం కివీస్‌పై టీమిండియా 322 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.

  • 04 Dec 2021 04:40 PM (IST)

    300 దాటిన ఆధిక్యం..

    న్యూజిలాండ్ ఆలౌట్ అయిన తరువాత సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా ధాటిగానే ఆడుతోంది. బౌండరీలతో దూసుకెళ్తూ ఆధిక్యాన్ని పుజరా(25), మయాంక్ అగర్వాల్(14) ఇద్దరూ కలిసి 300 దాటించారు.

  • 04 Dec 2021 04:33 PM (IST)

    మొదలైన టీమిండియా బ్యాటింగ్..

    న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్స్ భారత బౌలర్ల ధాటికి ఏమాత్రం నిలవలేకపోయారు. టీం మొత్తం కలిసి కేవలం 62 పరుగులే చేశారు. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగుల లీడ్‌ సాధించింది. అశ్విన్ 4, సిరాజ్ 3, అక్షర్ 2, జయంత్ యాదవ్ 1 వికెట్ పడగొట్టారు. అనంతరం భారత్ తన రెండో ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టింది. పుజరా, మయాంక్ అగర్వాల్ క్రీజులోకి వచ్చారు.

  • 04 Dec 2021 03:52 PM (IST)

    భారత్‌లో అత్యల్ప టెస్టు స్కోర్లు..

    62 NZ v IND, ముంబై 2021 75 IND vI, ఢిల్లీ 1987 76 IND v SA, అహ్మదాబాద్ 2008 79 SA v IND, నాగ్‌పూర్ 2015

  • 04 Dec 2021 03:51 PM (IST)

    భారత్‌పై అత్యల్ప టెస్ట్‌ స్కోర్లు..

    62 NZ, ముంబై 2021* 79 SA, నాగ్‌పూర్ 2015 81 ENG, అహ్మదాబాద్ 2021 82 SL, చండీగఢ్ 1990

  • 04 Dec 2021 03:50 PM (IST)

    న్యూజిలాండ్ vs భారత్‌కు అత్యల్ప టెస్టు స్కోర్లు..

    62 ముంబై 2021* హామిల్టన్ 2002లో 94 వెల్లింగ్టన్ 1981లో 100 ఆక్లాండ్ 1968లో 101

  • 04 Dec 2021 03:49 PM (IST)

    వాంఖడేలో అత్యల్ప టెస్టు స్కోర్లు

    62 NZ v IND 2021* 93 AUS v IND 2004 100 IND v ENG 2006 102 ENG v IND 1981 104 IND v AUS 2004

  • 04 Dec 2021 03:44 PM (IST)

    62 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్..

    న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్స్ భారత బౌలర్ల ధాటికి ఏమాత్రం నిలవలేకపోయారు. టీం మొత్తం కలిసి కేవలం 62 పరుగులే చేశారు. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగుల లీడ్‌ సాధించింది. అశ్విన్ 4, సిరాజ్ 3, అక్షర్ 2, జయంత్ యాదవ్ 1 వికెట్ పడగొట్టారు.

  • 04 Dec 2021 03:40 PM (IST)

    అశ్విన్ మాయాజాలం..

    వరుసగా వికెట్లు కోల్పోతూ పీకల్లోతూ కష్టాల్లో పడిన న్యూజిలాండ్‌ను భారత బౌలర్లు ఏదశలోనూ కోలుకోనివ్వడంలేదు. అశ్విన్ దెబ్బకు న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్స్ విలవిల్లాడుతున్నారు. మొత్తం నాలుగు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. టామ్ బ్లండెల్(4), టిమ్ సౌతీ(0), విలియం సొమెర్నిల్(0) లను పెవిలయన్ చేర్చి 4 వికెట్లు దక్కించుకున్నాడు. ప్రస్తుతం కివీస్ టీం 9 వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది. ఇంకా 263 పరుగుల వెనుకంజలోనే నిలిచింది.

  • 04 Dec 2021 03:17 PM (IST)

    ఎనిమిదో వికెట్ డౌన్..

    వరుసగా వికెట్లు కోల్పోతూ పీకల్లోతూ కష్టాల్లో పడిన న్యూజిలాండ్‌ను భారత బౌలర్లు ఏదశలోనూ కోలుకోనివ్వడంలేదు. అశ్విన్ తన ఓవర్‌లో వరుసగా రెండు వికెటలు తీసి మరో దెబ్బ కొట్టాడు. టామ్ బ్లండెల్(4), టిమ్ సౌతీ(0)లను పెవిలయన్ చేర్చి, మూడు వికెట్లు దక్కించుకున్నాడు. ప్రస్తుతం కివీస్ టీం 8 వికెట్లు కోల్పోయి 53 పరుగులు చేసింది. ఇంకా 272 పరుగుల వెనుకంజలోనే నిలిచింది.

  • 04 Dec 2021 03:13 PM (IST)

    ఏడో వికెట్ డౌన్..

    పీకల్లోతూ కష్టాల్లో చిక్కుకున్న న్యూజిలాండ్ టీంకు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. ఇప్పటికే ఆరు వికెట్లు కోల్పోయిన కివీస్‌ను టీంను.. అశ్విన్ మరో దెబ్బ కొట్టాడు. టామ్ బ్లండెల్(4)ను పెవిలయన్ చేర్చి, తన రెండో వికెట్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం కివీస్ టీం 7 వికెట్లు కోల్పోయి 53 పరుగులు చేసింది. ఇంకా 272 పరుగుల వెనుకంజలోనే నిలిచింది.

  • 04 Dec 2021 02:53 PM (IST)

    టీ బ్రేక్..

    టీ బ్రేక్ సమయానికి న్యూజిలాండ్ టీం 6 వికెట్లు కోల్పోయి 38 పరుగులు చేసింది. కివీస్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచి వరుసగా వికెట్లు కోల్పోతూ పీకల్లోతూ కష్టాల్లో పడింది. ప్రస్తుతం 287 పరుగుల దూరంలో నిలిచింది. సిరాజ్ 3, అశ్విన్, అక్షర్ చెరో వికెట్ పడగొట్టారు.

  • 04 Dec 2021 02:42 PM (IST)

    జయంత్ యాదవ్‌కు తొలి వికెట్..

    వరుసగా వికెట్లు కోల్పోతున్న న్యూజిలాండ్‌ టీంను జయంత్ యాదవ్ కూడా దెబ్బ తీశాడు. తన తొలి వికెట్‌గా రచిన్ రవీంద్ర(4) ను పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ టీం 6 వికెట్లు కోల్పోయి 38 పరుగులు చేసింది. 287 పరుగులు వెనుకంజలో నిలిచింది.

  • 04 Dec 2021 02:30 PM (IST)

    నికోలస్ ఔట్..

    వరుసగా వికెట్లు కోల్పోతున్న న్యూజిలాండ్‌ టీంను అశ్విన్ మరో దెబ్బ తీశాడు. నికోలస్(7) ను బౌల్ట్ చేసి ఐదో వికెట్‌ను పడగొట్టాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ టీం 5 వికెట్లు కోల్పోయి 31 పరుగులు చేసింది.

  • 04 Dec 2021 01:47 PM (IST)

    రెచ్చిపోతున్న టీమిండియా బౌలర్లు..

    టీమిండియా బౌలర్లు రెచ్చిపోతున్నారు వరుస న్యూజిలాండ్ వికెట్లను పడగొడుతున్నారు. ఈ క్రమంలోనే న్యూజిలాండ్ తాజాగా మూడో వికెట్‌ కోల్పోయింది. సిరాజ్‌ బౌలింగ్‌లో రాజ్‌ టెయిలర్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. ప్రస్తుతం న్యూజిలాండ్‌ స్కోరు 3 వికెట్ల నష్టానికి 17 పరుగుల వద్ద కొనసాగుతోంది.

  • 04 Dec 2021 01:39 PM (IST)

    రెండో వికెట్‌ కోల్పోయిన న్యూజిలాండ్‌..

    ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన కొద్ది సమయంలోనే తొలి వికెట్‌ను కోల్పోయిన న్యూజిలాండ్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. సిరాజ్‌ వేసిన బంతికి షాట్‌కు ప్రయత్నించిన టామ్‌ లాథమ్‌ శ్రేయస్‌ అయ్యర్‌కి క్యాచ్‌ ఇచ్చి వెనుతిరిగాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ స్కోర్ 2 వికెట్ల నష్టానికి 15 పరుగుల వద్ద కొనసాగుతోంది.

  • 04 Dec 2021 01:05 PM (IST)

    టీమిండియా అలవుట్‌..

    న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా అలవుట్‌ అయ్యింది. 325 పరుగులకు టీమిండియా అలవుట్‌ అయ్యింది. అజాజ్‌ పటేల్‌ ఏకంగా పది వికెట్లు తీసుకొని సంచలనం సృస్టించాడు. ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసిన అజాజ్‌.. అనిల్‌ కుంబ్లే రికార్డును సమం చేశాడు.

  • 04 Dec 2021 12:45 PM (IST)

    హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న అక్షర్‌..

    మయాంక్‌ అవుట్‌కాగానే తగ్గిన స్కోర్‌ బోర్డ్‌ను పెంచే పనిలో పడ్డాడు అక్షర్‌ పటేల్‌..ఈ క్రమంలోనే క్రీజులో పాతుకుపోయి ఆడుతున్నాడు. దీంతో అక్షర్‌ హాఫ్‌ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 123 బంతుల్లో 52 పరుగులు చేశాడంటేనే అక్షర్‌ వికెట్‌ కాపాడుకోవడానికి ఎంత కృషి చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం టీమిండియా 7 వికెట్ల నష్టానికి 316 పరుగులు సాధించింది. క్రీజులో జయంత్‌ యాదవ్‌ (7), అక్షర్‌ పటేల్‌ (52) పరుగులతో ఉన్నారు.

  • 04 Dec 2021 12:26 PM (IST)

    భారీ భాగస్వామ్యాన్ని విడతీసిన అజాజ్‌.. మయాంక్‌ అవుట్‌..

    జట్టు స్కోరు పెరుగుతోందని అనుకుంటున్న సమయంలో అజాజ్‌ మరోసారి టీమిండియాను దెబ్బ కొట్టాడు. 150 పరుగులతో దూసుకుపోతున్న మయాంక్‌ అగర్వాల్‌ అవుట్‌ అయ్యాడు. అజాజ్‌ అక్షర్‌ విసిరిన బంతికి వికెట్‌ కీపర్‌కి బ్లండెల్‌కి క్యాచ్‌ ఇచ్చి వెనుతిరిగాడు.

  • 04 Dec 2021 12:20 PM (IST)

    అజాజ్‌ అరుదైన రికార్డు..

    న్యూజిలాండ్‌ స్పిన్నర్‌ అజాజ్‌ పటేల్‌ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. భారత్‌లో టెస్టు మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన తొలి న్యూజిలాండ్ స్పిన్నర్‌గా రికార్డు సృష్టించాడు. ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్‌లో వృద్ధిమాన్ సాహా, ఆర్ అశ్విన్‌లను వరుస బంతుల్లో ఔట్‌ చేయడంతో ఈ ఘనత తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే.

  • 04 Dec 2021 11:39 AM (IST)

    లంచ్‌ బ్రేక్‌ సమయానికి భారత స్కోర్‌ ఎంతంటే..

    రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయేసరికి ఒక్కసారిగా టీమిండియా స్కోరు నెమ్మదించింది. అయితే అనంతరం క్రీజులోకి వచ్చిన అక్షర్‌ పటేల్‌, మయాంక్‌ అగర్వాల్‌కు మంచి భాగస్వామ్యాన్ని అందించాడు. దీంతో టీమిండియా మళ్లీ గాడిలో పడింది. దీంతో లంచ్‌ బ్రేక్‌ సమయానికి టీమిండియా స్కోరు 6 వికెట్ల నష్టానికి 285 పరుగుల వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం క్రీజులో అక్షర్‌ పటేల్‌ (32), మయాంక్‌ అగర్వాల్‌ (146) పరుగుల వద్ద కొనసాగుతున్నాడు.

  • 04 Dec 2021 11:26 AM (IST)

    150కి చేరువలో మయాంక్‌..

    వరుసగా రెండు వికెట్లు కోల్పోయి ఢీలా పడ్డ జట్టును మయాంక్‌ అగర్వాల్‌ ఆదుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఆచితూచి ఆడుతూ జట్టు స్కోరును పెంచుతున్నాడు. అక్షర్‌ పటేల్‌తో మంచి భాగస్వామ్యాన్ని నెలకొలుతున్నాడు. ఈ క్రమంలో 150 పరుగులకు చేరువయ్యాడు. ప్రస్తుతం మయాంక్‌ 145 పరుగుల వద్ద కొనసాగుతున్నాడు.

  • 04 Dec 2021 11:08 AM (IST)

    ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే పనిలో అక్షర్‌, మయాంక్‌..

    రెండో రోజు మ్యాచ్‌ ప్రారంభంలో వరుసగా రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత జట్టును మయాంక్‌ అగర్వాల్‌, అక్షర్‌ పటేల్‌ ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరి పాట్నర్‌షిప్‌లో 45 పరుగులు సాధించారు. ఇక 92 ఓవర్లు ముగిసే సమయానికి అక్షర్‌ పటేల్‌ (23), మయాంక్‌ అగర్వాల్‌ (143) పరుగులతో ఉన్నారు.

  • 04 Dec 2021 09:51 AM (IST)

    ఈ రోజు ఆట షెడ్యూల్..

  • 04 Dec 2021 09:48 AM (IST)

    టీమిండియాకు షాక్‌ ఇచ్చిన అజాజ్‌ పటేల్‌..

    రెండో రోజు టెస్ట్‌ మ్యాచ్‌ ప్రారంభంకాగానే టీమిండియాకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఒకే ఓవర్‌లో అశ్విన్‌, వృద్ధిమాన్‌ సాహా అవుట్‌ అయ్యారు. ఈ రెండు వికెట్లనూ అజాజ్‌ పటేల్‌ తీసుకోవడం విశేషం. తొలి రోజు నాలుగు వికెట్లు తీసుకున్న అజాజ్‌ ఈరోజు రెండు వికెట్లను కూడా పటగొట్టి మొత్తం ఆరు వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు.

Published On - Dec 04,2021 9:39 AM

Follow us
విదేశాల్లో సముద్ర దోసకాయలకు భారీ డిమాండ్ ధర, ఉపయోగం తెలిస్తే షాక్
విదేశాల్లో సముద్ర దోసకాయలకు భారీ డిమాండ్ ధర, ఉపయోగం తెలిస్తే షాక్
ఏం అందం గురూ.. యూత్ లేటెస్ట్ క్రష్ కాయదును చూశారా..
ఏం అందం గురూ.. యూత్ లేటెస్ట్ క్రష్ కాయదును చూశారా..
RCBని గరీబ్ జట్టు అంటూ సెహ్వాగ్ సెటైర్!
RCBని గరీబ్ జట్టు అంటూ సెహ్వాగ్ సెటైర్!
కంచ గచ్చిబౌలి భూముల వివాదం.. కేంద్రానికి బీజేపీ ఫిర్యాదు
కంచ గచ్చిబౌలి భూముల వివాదం.. కేంద్రానికి బీజేపీ ఫిర్యాదు
జంతువులకు కూడా ఆస్తి రాసిచ్చిన రతన్‌ టాటా.. సంపదలో ఎక్కువ భాగం..
జంతువులకు కూడా ఆస్తి రాసిచ్చిన రతన్‌ టాటా.. సంపదలో ఎక్కువ భాగం..
రోహిత్ ఫామ్‌పై అంబానీ సీరియస్! అయోమయంలో MI ఫ్యాన్స్?
రోహిత్ ఫామ్‌పై అంబానీ సీరియస్! అయోమయంలో MI ఫ్యాన్స్?
స్త్రీలకు సౌభాగ్యాన్ని ఇచ్చే కామద ఏకాదశి ఎప్పుడు? పూజా విధానం
స్త్రీలకు సౌభాగ్యాన్ని ఇచ్చే కామద ఏకాదశి ఎప్పుడు? పూజా విధానం
ఏప్రిల్‌ నెలలో వచ్చే సరికొత్త స్మార్ట్‌ ఫోన్లు.. ఫీచర్స్‌ ఇవే..!
ఏప్రిల్‌ నెలలో వచ్చే సరికొత్త స్మార్ట్‌ ఫోన్లు.. ఫీచర్స్‌ ఇవే..!
బాత్రూంలోకి వచ్చిన పాము.. నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు బ్రో..
బాత్రూంలోకి వచ్చిన పాము.. నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు బ్రో..
నీటి అడుగున రైలు మార్గం..ముంబై టూ దుబాయ్‌..కేవలం రెండు గంటల్లోనే!
నీటి అడుగున రైలు మార్గం..ముంబై టూ దుబాయ్‌..కేవలం రెండు గంటల్లోనే!