Rohit sharma: టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్సీ కూడా ఆ స్టార్ క్రికెటర్‌కే!.. త్వరలోనే బీసీసీఐ అధికారిక ప్రకటన..
రాట్ కోహ్లీ స్థానంలో ఇప్పటికే టీమిండియా టీ-20 పగ్గాలు తీసుకున్న రోహిత్ శర్మ త్వరలోనే టెస్ట్ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడా?.. ప్రస్తుత ఉప సారథి అజింక్యా రహానేకు ఉద్వాసన తప్పదా?
విరాట్ కోహ్లీ స్థానంలో ఇప్పటికే టీమిండియా టీ-20 పగ్గాలు తీసుకున్న రోహిత్ శర్మ త్వరలోనే టెస్ట్ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడా?.. ప్రస్తుత ఉప సారథి అజింక్యా రహానేకు ఉద్వాసన తప్పదా?..అంటే అవుననే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు. రహానేను తప్పించి త్వరలోనే రోహిత్‌కే వైస్ కెప్టెన్సీ పగ్గాలు అప్పగించే యోచనలో బీసీసీఐ ఉందట. వచ్చే వారంలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెల్లడించే అవకాశం ఉందట. కాగా ఇప్పటికే వన్డే జట్టులో చోటు కోల్పోయిన రహానే గత రెండేళ్లుగా టెస్ట్‌ల్లో కూడా దారుణంగా విఫలమవుతున్నాడు. గతేడాది మెల్‌బోర్న్ టెస్ట్‌లో సెంచరీ మినహా ఇటీవల కాలంలో అతను పెద్దగా రాణించిన దాఖలాలు లేవు.
ఇక కాన్పూర్ వేదికగా కివీస్‌తో జరిగిన మొదటి టెస్టులోనూ పేలవ ఫామ్‌ను కొనసాగించాడు రహానే. మొదటి ఇన్సింగ్స్‌లో 35 పరుగులు చేసిన అతను రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 4 పరుగులకే వెనుదిరిగాడు. దీంతో ముంబయి టెస్ట్‌కు కూడా జట్టులో చోటు కోల్పోయాడు. మరో వైపు టెస్ట్ క్రికెట్‌లో అరంగ్రేటం చేసిన శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా రాణిస్తున్నాడు. దీంతో జట్టులో రహానే స్థానం ప్రశ్నార్థకంగా మారింది. ఇక రోహిత్ విషయానికొస్తే.. ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ జట్టును అద్భుతంగా ముందుకు నడిపిస్తున్నాడు. అతని సారథ్యంలో ఆ జట్టు ఐదు సార్లు ఐపీఎల్ విజేతగా నిలవడం విశేషం. తాజాగా టీమిండియా టీ 20 కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకోవడంతో అతని స్థానంలో సారథ్య బాధ్యతలు స్వీకరించాడు. కాగా రోహిత్ కెప్టెన్సీలో టీమిండియా కివీస్‌తో జరిగిన టీ 20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన సంగతి తెలిసిందే.
Also Read:
Ind Vs Nz: ఐపీఎల్‌లో గొడవకి ఆ అంపైర్ ఇప్పుడు పగ తీర్చుకున్నాడా..? లేకపోతే ఇది ఔట్ ఏంటి..?