Watch Video: ముంబై టెస్టులో ఆడించొద్దన్నారు.. ఫాంలో లేడు వద్దన్నారు.. సెంచరీతో ఆన్సర్ ఇచ్చి భారత్‌ను ఆదుకొన్న యంగ్ ప్లేయర్..!
Mayank Agarwal: ముంబై టెస్టు తొలి రోజున టీమ్ ఇండియా 2 ఓవర్లలో వరుసగా 3 వికెట్లు కోల్పోయింది. అయితే స్టార్ ఓపెనర్ ఒక ఎండ్ నుంచి జాగ్రత్తగా బ్యాటింగ్ చేసి సెంచరీ పూర్తి చేయడంతోపాటు..
India Vs New Zealand 2021: ముంబై టెస్టు మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు ఓపెనర్ మయాంక్ అగర్వాల్ అత్యుత్తమ సెంచరీ సాధించాడు. శుక్రవారం డిసెంబర్ 3న న్యూజిలాండ్‌తో ప్రారంభమైన సిరీస్‌లో రెండో మ్యాచ్‌లో మొదటి రోజు, మయాంక్ తన సెంచరీతో పాటు టీమ్ ఇండియా ఇన్నింగ్స్‌ను హ్యాండిల్ చేయడంతో వాంఖడే స్టేడియంలో తొలిరోజును భారత్‌కు అనుకూలంగా నిలిపాడు. మయాంక్‌కు టెస్టు కెరీర్‌లో ఇది నాలుగో సెంచరీ. టెస్ట్ మ్యాచ్ ప్రారంభానికి ముందు ప్లేయింగ్ ఎలెవన్‌లో మయాంక్ అగర్వాల్ స్థానం గురించి కూడా సందేహాలు ఉన్నాయి. అయితే పేలవమైన ఫామ్‌తో పోరాడుతున్న మయాంక్, పోరాట ఇన్నింగ్స్ ఆడి, సెంచరీ చేసి తన ఎంపిక సరైనదని నిరూపించుకున్నాడు. మయాంక్ సెంచరీ సాయంతో భారత జట్టు రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 221 పరుగులు పూర్తి చేసింది.
ముంబై టెస్టు తొలి రోజు చివరి సెషన్‌లో అత్యుత్తమంగా బ్యాటింగ్ చేసిన మయాంక్ సెంచరీకి చేరువయ్యాడు. ఆ తర్వాత 59వ ఓవర్‌లో డారిల్ మిచెల్ వేసిన తొలి బంతికే మయాంక్ అందమైన కవర్ డ్రైవ్ చేయడంతో బంతి బౌండరీలైన్‌కు పరుగులు తీసింది. దీంతో మయాంక్ తన టెస్టు కెరీర్‌లో నాలుగో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ పాయింట్‌ను చేరుకోవడానికి, మయాంక్ 196 బంతులు ఆడాడు. ఇందులో 13 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. మయాంక్ మొదటి వికెట్‌కు శుభ్‌మన్ గిల్‌తో కలిసి 80 పరుగులు, నాల్గో వికెట్‌కు శ్రేయాస్ అగర్వాల్‌తో 80 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
ముంబై టెస్టు నుంచి తప్పుకునే ప్రమాదం నుంచి.. ఈ ఏడాది సిడ్నీ టెస్టులో రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్ రాక తర్వాత ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు కోల్పోయిన మయాంక్ అగర్వాల్‌కు ఈ టెస్టు సిరీస్ చాలా ముఖ్యమైనది. తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ విఫలమయ్యాడు. దీంతో ముంబై టెస్టులో అతడి స్థానానికి ముప్పు ఏర్పడింది. ప్లేయింగ్ XIలో విరాట్ కోహ్లి, అజింక్యా రహానెలను కొనసాగించాలని మయాంక్‌ని తొలగించాలని చాలా మంది మాజీ అనుభవజ్ఞులు సూచించారు. అయితే టీమ్ మేనేజ్‌మెంట్ అతనిపై నమ్మకం ఉంచింది. మయాంక్ ఈ నమ్మకాన్ని సరైనదని నిరూపించి సెంచరీ కొట్టాడు.
16వ టెస్టు ఆడుతున్న మయాంక్ నాలుగోసారి వంద మార్కును దాటాడు. అతని నాలుగు సెంచరీలు సొంతగడ్డపైనే వచ్చాయి. 2019లో విశాఖపట్నంలో దక్షిణాఫ్రికాపై తొలి సెంచరీ సాధించాడు.
అదే సమయంలో ఈ సెంచరీతో సొంతగడ్డపై మయాంక్ టెస్టు సగటు 91.12కి చేరుకుంది. గ్రేట్ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ సర్ డాన్ బ్రాడ్‌మాన్ తర్వాత మయాంక్ సగటు అత్యధికంగా నిలిచింది. బ్రాడ్‌మాన్ తన టెస్ట్ కెరీర్‌లో ఆస్ట్రేలియా గడ్డపై 98.22 సగటుతో పరుగులు సాధించాడు.
That moment when @mayankcricket got to his 4th Test Century ??
Live – https://t.co/KYV5Z1jAEM #INDvNZ @Paytm pic.twitter.com/GFXapG6GQo
— BCCI (@BCCI) December 3, 2021