AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: శుభ్మన్ గిల్‌పై ఫైర్ అయిన టీమిండియా ఆటగాళ్లు.. చెంప దెబ్బ కొట్టిన ఇషాన్.. ఎందుకో తెలుసా?

IND vs NZ: శుభమాన్ గిల్ తన సోషల్ మీడియా ద్వారా ఒక వీడియోను పంచుకున్నాడు. ఇందులో యుజ్వేంద్ర చాహల్, ఇషాన్ కిషన్‌తో కలిసి రీల్ చేశారు.

Video: శుభ్మన్ గిల్‌పై ఫైర్ అయిన టీమిండియా ఆటగాళ్లు.. చెంప దెబ్బ కొట్టిన ఇషాన్.. ఎందుకో తెలుసా?
Ishan Kishan Gill Video
Venkata Chari
|

Updated on: Feb 03, 2023 | 9:27 AM

Share

స్వదేశంలో జరిగిన సిరీస్‌లో భారత జట్టు న్యూజిలాండ్‌ను ఓడించింది. వీరిద్దరి మధ్య జరిగిన తొలి వన్డే సిరీస్‌లో భారత జట్టు 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ జరిగింది. ఈ సిరీస్‌లో భారత్ 2-1 తేడాతో కివీస్‌పై విజయం సాధించింది. ఈ సిరీస్‌లో చివరి, నిర్ణయాత్మక మ్యాచ్ అహ్మదాబాద్‌లో జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు స్టార్‌ ఓపెనర్‌ బ్యాట్స్‌మెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ సెంచరీతో అదరగొట్టాడు.

గిల్ 63 బంతుల్లో 126 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్ తర్వాత, గిల్ గురించి చాలా చర్చ జరుగుతోంది. గిల్‌ను భారత జట్టు భవిష్యత్తుగా పిలుస్తున్నారు. విరాట్ కోహ్లీ కూడా గిల్‌ను భారత జట్టు భవిష్యత్తు అని సంబోదిస్తున్నాడు. ఈ ఇన్నింగ్స్ తర్వాత శుభమాన్ గిల్, యుజ్వేంద్ర చాహల్, ఇషాన్ కిషన్ సరదాగా కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోను గిల్ తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు.

ఇవి కూడా చదవండి

గిల్‌ని చెంపదెబ్బ కొట్టిన ఇషాన్..

ఈ వీడియోలో ముగ్గురు ఆటగాళ్లు రియాలిటీ షో రోడీస్‌ను అనుకరిస్తూ కనిపించారు. ఈ వీడియోలో ఇషాన్ కిషన్ గొరిల్లాగా కనిపించి, అటూ ఇటూ ఎగరడం చూడొచ్చు. ఈ క్రమంలో ఇషాన్ కిషన్ గిల్‌ని చేరుకుని గట్టిగా కొట్టాడు. ఈ ముగ్గురి వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోని అభిమానులు ఎంతగానో ఆదరిస్తున్నారు. ఇప్పటి వరకు 6 లక్షల మందికి పైగా లైక్ చేశారు. అదే సమయంలో, సుమారు 8 వేల మంది తమ కామెంట్లను పంచుకున్నారు.

మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన ఆటగాడిగా..

న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 ఇంటర్నేషనల్‌లో సెంచరీ సాధించిన వెంటనే, గిల్ మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. గిల్ కేవలం 23 ఏళ్ల 146 రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు. మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన ఐదో భారత ఆటగాడిగా గిల్ నిలిచాడు. అదే సమయంలో అతను ఈ ఘనత సాధించిన ప్రపంచంలో 22వ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..