IND vs ENG: రోహిత్, కోహ్లీలపైనే దృష్టంతా.. నేడు ఇంగ్లండ్‌తో తొలి వన్డే.. ఇక్కడ ఫ్రీగా చూడొచ్చు
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇంగ్లాండ్ జట్టును 1-4 తేడాతో చిత్తుగా ఓడించింది టీమ్ ఇండియా. ఇప్పుడు వన్డే సిరీస్‌లోనూ అదే ప్రదర్శనను కొనసాగించాలని చూస్తోంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సహా చాలా మంది సీనియర్ ఆటగాళ్లు ఈ వన్డే సిరీస్‌లో ఆడుతున్నారు

ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ గురువారం (ఫిబ్రవరి 06) నుంచి ప్రారంభం కానుంది. నాగ్ పూర్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ టీమిండియాకు చాలా కీలకం. పేలవమైన ఫామ్ తో సతమతమవుతోన్న కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు ఈ సిరీస్ చాలా ముఖ్యం. ఛాంపియన్స్ ట్రోఫీ పరంగా ఈ సిరీస్ రెండు జట్లకు చాలా ముఖ్యమైనది. గెలిచి ఆత్మవిశ్వాసంతో కూడగట్టుకోవాలనే ఉద్దేశంతోనే రెండు టీమ్స్ మైదానంలోకి దిగుతున్నాయి. నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ మధ్య తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. అరగంట ముందుగా అంటే మధ్యాహ్నం 1 గంటలకు టాస్ పడనుంది. భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగే తొలి వన్డేను స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారంలో చూడవచ్చు. అలాగే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌నూ ఉచితంగా స్ట్రీమింగ్ సదుపాయం ఉంది.
ఇప్పటికే టీ20 సిరీస్‌ను కోల్పోయిన ఇంగ్లాండ్, వన్డే సిరీస్‌లోనైనా విజయం సాధించాలని చూస్తోంది. టీ20 సిరీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. అలాగే ఈ సిరీస్‌ను గెలుచుకోవడం ద్వారా వారి 41 ఏళ్ల వన్డే సిరీస్ కరువును తీర్చుకోవాలని ప్రయత్నిస్తుంది.
కాగా భారత్ తో తొలి వన్డే కోసం ఇంగ్లండ్ జట్టు ఇప్పటికే తుది జట్టును ప్రకటించింది.
ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11:
బెన్ డకెట్, ఫిల్ సాల్ట్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్, లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, బ్రైడాన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహ్మద్.
కొత్త జెర్సీలతో టీమిండియా ఆటగాళ్లు..
New threads 🧵
…And with that – Bright Smiles 😁💙#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/Sgs1gG7rvf
— BCCI (@BCCI) February 5, 2025
భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్. (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా.
ప్రాక్టీస్ లో టీమిండియా ఆటగాళ్లు..
Fielding Drills with a twist 😉
T Dilip, Axar Patel and Abhishek Sharma team up with our partners Campa Cola & Atomberg to give them a glimpse of #TeamIndia’s fielding drill and compete for the coveted fielding medal 🏅@akshar2026 | @IamAbhiSharma4 | @atomberg_tech pic.twitter.com/3HA7GqyCTg
— BCCI (@BCCI) February 4, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








