Video: పుష్కరానికి ఓ మ్యాచ్ పెడితే ఇలాగే ఉంటది మరీ! రద్దీని కంట్రోల్ చేయడానికి ఏకంగా ఫైరింజన్లు వచ్చాయ్
భారత్ vs ఇంగ్లాండ్ రెండో వన్డే కటక్ బారాబతి స్టేడియంలో ఆదివారం జరగనుంది. టికెట్ల కోసం వేలాది మంది అభిమానులు గుమిగూడడంతో తీవ్ర తొక్కిసలాట చోటుచేసుకుంది. పోలీసుల అదుపులో భాగంగా భద్రతను కట్టుదిట్టం చేసి ప్రత్యేక ద్వారాలు ఏర్పాటు చేశారు. మ్యాచ్ రోజున అత్యవసర వైద్య సేవలు, ప్రత్యేక బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు.

భారత్ vs ఇంగ్లాండ్ రెండో వన్డే ఈ ఆదివారం ఒడిశాలోని కటక్‌లోని బారాబతి స్టేడియంలో జరగనుంది. చాలా కాలం తర్వాత కటక్ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వడంతో అభిమానుల ఉత్సాహం తారాస్థాయికి చేరుకుంది. అయితే, టికెట్ల కోసం వేలాది మంది అభిమానులు స్టేడియం వెలుపల గుమిగూడడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. జనసమూహాన్ని నియంత్రించేందుకు పోలీసులు నీటి ఫిరంగులను కూడా ఉపయోగించారు.
మంగళవారం రాత్రి నుంచే స్టేడియం బయట అభిమానులు భారీగా గుమిగూడారు. బుధవారం రాత్రి ఆఫ్‌లైన్ టికెట్ కౌంటర్లు తెరిచిన వెంటనే భారీ తొక్కిసలాట ఏర్పడింది. ఈ పరిస్థితిని అదుపు చేసేందుకు కటక్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ జగ్మోహన్ మీనా నేతృత్వంలో పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు.
మ్యాచ్‌కు ముందు బారాబతి స్టేడియం పరిసర ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు అధికారులు తెలిపారు. క్రికెట్ అభిమానులకు మెరుగైన అనుభవాన్ని అందించేందుకు కటక్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) స్టేడియం పరిసరాల్లో సుందరీకరణ, పారిశుధ్యం, ఫాగింగ్ కార్యకలాపాలు చేపట్టింది.
ఈ ఏర్పాట్లను సమీక్షించేందుకు మంగళవారం ఒక ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశానికి జిల్లా యంత్రాంగం, ఒడిశా క్రికెట్ అసోసియేషన్ (OCA), ఒడిశా ఒలింపిక్ అసోసియేషన్, పోలీసులు, ఆరోగ్య విభాగం, CMC అధికారులు హాజరయ్యారు. ప్రేక్షకుల ప్రవేశం, నిష్క్రమణ కోసం నాలుగు ప్రత్యేక ద్వారాలను ఏర్పాటు చేసినట్లు డీసీపీ జగ్మోహన్ మీనా వెల్లడించారు.
మ్యాచ్ రోజున అత్యవసర ప్రతిస్పందన కోసం ఆరోగ్య శాఖ ప్రత్యేక అంబులెన్స్‌లు, వైద్య బృందాలను మోహరించనుంది. అదే విధంగా, ఆహార భద్రతా అధికారులు స్టేడియం వద్ద ఉండే ఫుడ్ స్టాళ్ల పరిశుభ్రతను పర్యవేక్షిస్తారు.
అభిమానుల రద్దీని తగ్గించేందుకు ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేశారు. కటక్ నేతాజీ బస్ టెర్మినస్, త్రిశూలియా రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేక బస్సులు స్టేడియంకు నడుపుతారని అధికారులు తెలిపారు.
భారత్-ఇంగ్లాండ్ మ్యాచ్‌కి అభిమానులు భారీ స్థాయిలో హాజరయ్యే అవకాశం ఉండడంతో అధికారులు అన్ని ఏర్పాట్లను పక్కాగా అమలు చేస్తున్నారు. కటక్‌లోని ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌కి క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు!
భారత జట్టు: రోహిత్ శర్మ (సి), శుభ్‌మన్ గిల్ (vc), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (wk), రిషబ్ పంత్ (wk), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, అక్సర్ పటేల్, కుల్త్‌దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.
ఇంగ్లాండ్ జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, బెన్ డకెట్, జో రూట్, ఫిలిప్ సాల్ట్(wk), జామీ స్మిత్, జాకబ్ బెథెల్, బ్రైడాన్ కార్స్, లియామ్ లివింగ్‌స్టోన్, జామీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.
Cricket Craze Grips Odisha Again!
Fans spent sleepless night to buy tickets a day before sale of tickets at counters at Barabati Stadium in #Cuttack. @BCCI @cricket_odisha @Cricketracker#INDvsENGODI pic.twitter.com/hIRUt5Y5CZ
— Debasis Barik (@DebasisJourno) February 5, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



