IND vs ENG: టీమిండియా కెప్టెన్ గోల్డెన్ డక్ పెద్ద విషయం కాదు.. బలంగా తిరిగొచ్చి బదులిస్తాడు: మాజీ పాకిస్తాన్ కెప్టెన్
భారత్- ఇంగ్లాండ్ టీంల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మొదటి మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇరు జట్లు పాయింట్లను పంచుకోవాల్సి వచ్చింది.
IND vs ENG: ఇటీవలి కాలంలో భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాట్ నుంచి పెద్దగా పరుగులు రాలడం లేదు. నవంబర్ 2019 నుంచి విరాట్ సెంచరీ చేయలేదు. స్వదేశంలో ఆడిన టెస్ట్ సిరీస్‌లో బాగానే పరుగులు చేశాడు. కానీ, విదేశాల్లో మాత్రం విరాట్ బ్యాట్ మౌనాన్ని పాటిస్తుంది. ఇటీవల, ట్రెంట్ బ్రిడ్జ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో కోహ్లీ ఒక గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ విరాట్‌ని ఖాతా తెరవకుండానే మొదటి బంతికే పెవిలియన్‌కు పంపాడు. ఈ టెస్ట్ మ్యాచ్ వర్షంతో నిలిచిపోవడంతో డ్రాగా ముగిసింది. దీంతో కోహ్లీకి రెండోసారి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు.
ప్రస్తుతం అంతా రెండో టెస్ట్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు. కోహ్లీ బ్యాట్ నుంచి పరుగులు రాలుతాయా.. లేదా మరోసారి అండర్సన్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరుతాడా అనేది ఆసక్తిగా మారింది. ఆండర్సన్‌పై ఆధిపత్యం చెలాయించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కూడా కోహ్లీ బ్యాట్ నుంచి ఎక్కువ పరుగులు రాలేదు. ఆ టెస్టులో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. అయితే, పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ రెండో టెస్ట్ మ్యాచ్‌లో కోహ్లీ బలమైన పునరాగమనం చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.
సల్మాన్ భట్ తన యూట్యూబ్ ఛానెల్‌లో కోహ్లీ గురించి మాట్లాడుతూ, ప్రతీ ఆటగాడు తన కెరీర్‌లో ఇలాంటి ఓ దశను ఎదుర్కొంటాడని తెలిపాడు. ఇది క్రికెట్‌లో సర్వసాధారణమని పేర్కొన్నాడు. అతను చెప్పాడు, “విరాట్ కోహ్లీ ఒక మనిషి అని, ప్రతీ క్రీడాకారుడు తన కెరీర్‌లో ఏదో ఒక సమయంలో పేలవమైన ఫామ్‌తో పోరాడుతాడు. కోహ్లీ క్లాస్ ప్లేయర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అతను ప్రపంచవ్యాప్తంగా పరుగులు సాధించాడు. అతని పేరు మీద 70 అంతర్జాతీయ సెంచరీలు ఉన్నాయి. అయితే, అతను రెండేళ్లుగా తన ఆటలో అగ్రస్థానంలో కొనసాగలేకపోతున్నాడు. ఇప్పటికీ కోహ్లీ టాప్ -5 లోనే ఉన్నాడు. ఈ సిరీస్‌లో కోహ్లీ తిరిగి ఫామ్‌లోకి వస్తాడు” అని భట్ తెలిపాడు.
మొదటి బంతికే ఔట్ కావడం.. “మొదటి బంతిని ఔట్ కావడం పెద్ద విషయమేమీ కాదు. కోహ్లీ చాలా ఆందోళన చెందాడు. అభిమానులు కూడా కోహ్లీ బ్యాట్ నుంచి పరుగులు రావాలనే ఆశిస్తుంటారు. కోహ్లీ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాలని కోరుకుంటారు. ప్రస్తుతం తన కెరీర్‌లో చెడ్డ దశను ఎదుర్కొంటున్నాడు. కానీ అతను బలంగా తిరిగి వస్తాడు. కాకపోతే కొద్దిగా సమయం పడుతుందని” వెల్లడించాడు.
Also Read: 32 బంతుల్లో సెంచరీ.. 7ఫోర్లు.. 11 సిక్సర్లు.. టీ10లో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన ‘ఇండియన్’ బ్యాట్స్‌మెన్
Paris Olympics 2024: పారిస్ చేరిన ఒలింపిక్ జెండా.. శరవేగంగా పనులు: పారిస్ మేయర్ హిడాల్గో