Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: ‘తూచ్.. ఇది చాలా అన్యాయం’.. కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా రాణా ఎంపికపై ఇంగ్లండ్ క్రికెటర్ల గరం గరం

ఇంగ్లండ్ తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో టీమిండియా 15 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 181 పరుగులు చేయగా, ఇంగ్లండ్ 19.4 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటైంది. దీంతో టీమిండియా మ్యాచ్ తో పాటు సిరీస్ ను కైవసం చేసుకుంది.

IND vs ENG: 'తూచ్.. ఇది చాలా అన్యాయం'.. కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా రాణా ఎంపికపై ఇంగ్లండ్ క్రికెటర్ల గరం గరం
IND vs ENG
Follow us
Basha Shek

|

Updated on: Feb 01, 2025 | 10:09 AM

పుణెలోని ఎంసీఏ స్టేడియంలో శుక్రవారం (జనవరి 29) ఇంగ్లండ్‌తో జరిగిన 4వ టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. తద్వారా 5 మ్యాచ్ ల సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా కైవసం చేసుకుంది. అయితే ఈ విజయం తర్వాత ఓ కొత్త వివాదం తలెత్తింది. ఆ వివాదానికి ప్రధాన కారణం కంకషన్ సబ్ స్టిట్యూట్. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో చివరి ఓవర్‌లో బంతి శివమ్ దూబే హెల్మెట్‌కు తగిలింది. దీంతో అతను ఫీల్డింగ్‌కు దిగలేదు. దీంతో టీమ్ ఇండియాను కంకషన్ సబ్‌ ఆప్షన్ ను ఉపయోగించుకుంది. కంకషన్ సబ్ ఆప్షన్ అంటే గాయం లేదా ఇతర కారణాల వల్ల ఆడలేని ప్లేయర్ కు ప్రత్యామ్నాయ ఆటగాడిని ఎంచుకోవడం. 2019లో ఐసీసీ ప్రవేశపెట్టిన ఈ నిబంధన ప్రకారం శివమ్ దూబే స్థానంలో హర్షిత్ రాణాను టీమ్ ఇండియా రంగంలోకి దించింది. అయితే ఈ నియమం ప్రకారం లైక్ టు రీప్లేస్ మెంట్ ఆటగాళ్లనే తీసుకోవాలి. అంటే బ్యాటర్ గాయపడి అవుట్ అయితే, బ్యాటరే ఫీల్డింగ్ చేయాలి. లేదా ఒక బౌలర్ గాయపడినట్లయితే, ప్రత్యామ్నాయం బౌలర్ అయి ఉండాలి. అలాగే ఆల్ రౌండర్ గాయపడితే ఆల్ రౌండర్ మాత్రమే ఆడాలనే నిబంధన ఉంది.

ఈ క్రమంలోనే టీమిండియా ఆల్ రౌండర్ శివమ్ దూబే స్థానంలో కంకషన్ సబ్ స్టిట్యూట్ గా హర్షిత్ రాణాను రంగంలోకి దింపింది. సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన హర్షిత్ రాణా 4 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి భారత జట్టుకు విజయాన్ని అందించాడు. ఇప్పుడిదే వివాదానికి కారణమైంది. హర్షిత్ రాణా ఎంపిక లైక్ టు రీప్లేస్ మెంట్ కాదని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ అభిప్రాయపడ్డాడు. దూబే ఆల్ రౌండర్ అయినప్పటికీ టీమ్ ఇండియా ఇలా పర్ఫెక్ట్ బౌలర్ ను ఎంపిక చేయడం సరైంది కాదంటున్నాడు ఇంగ్లండ్ కెప్టెన్.

‘శివమ్ దూబే వేగంతోనే బౌలింగ్ చేయగలడు. అదే సమయంలో, హర్షిత్ రానా బ్యాటింగ్ చేయగలడని నేను అంగీకరించలేను. కాబట్టి కంకషన్ సబ్‌ని అనుమతించే ముందు మ్యాచ్ రిఫరీకి మరింత స్పష్టత ఉండాలి’ అని జోస్ బట్లర్ చెప్పాడు. దీనిపై ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ కూడా స్పందించాడు. శివమ్ దూబేకు బదులుగా ఆల్ రౌండర్‌ను రంగంలోకి దించాల్సి ఉంది. బదులుగా బౌలర్‌కు అవకాశం ఇవ్వడం సరైన చర్య కాదని పీటర్సన్ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ పార్ట్ టైమ్ బౌలర్‌కు బదులుగా పర్ఫెక్ట్ బౌలర్‌ను ఎలా భర్తీ చేశారని అడిగాడు. ఇంగ్లండ్  మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ కూడా, “శివమ్ దూబే స్థానంలో హర్షిత్ రాణాను కంకషన్ రీప్లేస్‌మెంట్‌గా ఎలా అనుమతించారో నాకు అర్థం కావడం లేదు” అని ప్రశ్నించాడు.

ఇవి కూడా చదవండి

శివమ్ దూబే స్థానంలో మరో ఆల్ రౌండర్ రమణదీప్ సింగ్‌ను బరిలోకి దించే అవకాశం ఉన్నప్పటికీ, టీమ్ ఇండియా పర్ఫెక్ట్ బౌలర్ హర్షిత్ రాణాను కంకషన్ సబ్‌లో ఆడించిందటూ ఇంగ్లండ్ క్రికెటర్లు టీమిండియా తీరుపై గరం గరం అవుతున్నారు. మరి దీనిపై ఐసీసీ, బీసీసీఐ ఎలా స్పందిస్తుందో చూడాలి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మంటలు రేపనున్న మార్చినెల.. ఎండలతో జాగ్రత్త జర వీడియో
మంటలు రేపనున్న మార్చినెల.. ఎండలతో జాగ్రత్త జర వీడియో
గంగానది మధ్యలో వంద మంది యాత్రికులు.. ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో
గంగానది మధ్యలో వంద మంది యాత్రికులు.. ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో
హల్దీ ఫంక్షన్‌లో కోతి హల్‌చల్‌.. ఏం చేసిందో చూడండి
హల్దీ ఫంక్షన్‌లో కోతి హల్‌చల్‌.. ఏం చేసిందో చూడండి
92 ఏళ్ల వృద్ధురాలి సాహసం.. శివుడి కోసం.. కాగుతున్న నూనెలో చేతితో
92 ఏళ్ల వృద్ధురాలి సాహసం.. శివుడి కోసం.. కాగుతున్న నూనెలో చేతితో
అయ్యో.. నీళ్ల కోసం వచ్చి బావిలో పడి.. చివరికి?
అయ్యో.. నీళ్ల కోసం వచ్చి బావిలో పడి.. చివరికి?
గోవా కొంపముంచిన ఇడ్లీ సాంబార్‌.. ఎమ్మెల్యే ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు
గోవా కొంపముంచిన ఇడ్లీ సాంబార్‌.. ఎమ్మెల్యే ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు
"గోల్డ్‌ కార్డు'' కావాలా నాయనా..? కండిషన్స్ అప్లయ్‌.!
ఐదుగురు మహిళలతో కలిసి అంతరిక్షంలోకి జెఫ్‌ బెజోస్‌ ప్రియురాలు
ఐదుగురు మహిళలతో కలిసి అంతరిక్షంలోకి జెఫ్‌ బెజోస్‌ ప్రియురాలు
గ్రహశకలం భూమిని ఢీ కొంటే.. నాశనమయ్యే నగరాలు ఏంటో తెలుసా?
గ్రహశకలం భూమిని ఢీ కొంటే.. నాశనమయ్యే నగరాలు ఏంటో తెలుసా?
తల్లి ప్రేమ రేంజ్ ఇదీ.. కుక్క దాడి నుంచి తల్లి రక్షణ కవచం ఏర్పాటు
తల్లి ప్రేమ రేంజ్ ఇదీ.. కుక్క దాడి నుంచి తల్లి రక్షణ కవచం ఏర్పాటు