IND vs ENG: బూమ్ బూమ్ బుమ్రా.. కళ్లు చెదిరే యార్కర్‌తో గాల్లోకి వికెట్లు.. పోప్ బిక్కమొహం.. వీడియో
విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న 2వ టెస్టు మ్యాచ్‌లో టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరుగుతున్నారు. తనకు మాత్రమే సాధ్యమయ్యే సూపర్ యార్కర్లతో ఇంగ్లండ్ బ్యాటర్లకు పట్ట పగలే చుక్కలు చూపిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా యశస్వి జైస్వాల్ (209) డబుల్ సెంచరీ సహాయంతో 396 పరుగులు చేసింది
విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న 2వ టెస్టు మ్యాచ్‌లో టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరుగుతున్నారు. తనకు మాత్రమే సాధ్యమయ్యే సూపర్ యార్కర్లతో ఇంగ్లండ్ బ్యాటర్లకు పట్ట పగలే చుక్కలు చూపిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా యశస్వి జైస్వాల్ (209) డబుల్ సెంచరీ సహాయంతో 396 పరుగులు చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టుకు భారత బౌలర్లు గట్టి షాక్ ఇచ్చారు. ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ (21) వికెట్ తీసి టీమ్ ఇండియాకు శుభారంభం అందించాడు కుల్‌దీప్ యాదవ్. ఆ తర్వాత జాక్ క్రాలే (76) అక్షర్ పటేల్‌కు వికెట్ అప్పగించాడు. ఆ తర్వాత వచ్చిన హైదరాబాద్ టెస్టు హీరో ఓలీ పోప్.. మరోసారి అద్భుతంగా ఆడాడు. ఓపికగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే ఈ దశలో కెప్టెన్ రోహిత్ శర్మ బంతిని బుమ్రాకు ఇచ్చాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిజం చేస్తూ జో రూట్ (5) వికెట్ తీశాడు బుమ్రా. ఇక దీని తర్వాత హైదరాబాద్ టెస్టులో 196 పరుగులు చేసిన ఓలీ పోప్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. బుమ్రా వేసిన యార్కర్ బంతిని గుర్తించేలోపే రెండు వికెట్లు గాల్లోకి ఎగిరిపోయాయి. పాపం దెబ్బకు పోప్ కూడా బిక్క మొహం వేశాడు. ఇప్పుడు ఈ అద్భుతమైన క్లీన్ బౌల్డ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Timber Striker Alert 🚨
A Jasprit Bumrah special 🎯 🔥
Drop an emoji in the comments below 🔽 to describe that dismissal
Follow the match ▶️ https://t.co/X85JZGt0EV#TeamIndia | #INDvENG | @Jaspritbumrah93 | @IDFCFIRSTBank pic.twitter.com/U9mpYkYp6v
— BCCI (@BCCI) February 3, 2024
Memorable Performance ✅
Special Celebration 🙌
Well bowled, Jasprit Bumrah! 🔥 🔥
Follow the match ▶️ https://t.co/X85JZGt0EV #TeamIndia | #INDvENG | @Jaspritbumrah93 | @IDFCFIRSTBank pic.twitter.com/bRYTf68zMN
— BCCI (@BCCI) February 3, 2024
ఆరు వికెట్లతో..
ఇక కడపటి వార్తలందే సమయానికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. 5 వికెట్లతో బుమ్రా ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. క్రాలే 71 పరుగులు, కెప్టెన్ బెన్ స్టోక్స్ 47 పరుగులు చేసి ఔటయ్యారు. మిగతా బ్యాటర్లు భారత బౌలర్లకు దాసోహమయ్యారు.
భారత్ ప్లేయింగ్ 11:
యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, రజత్ పాటిదార్, శ్రీకర్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ముఖేష్ కుమార్.
ఇంగ్లండ్ ప్లేయింగ్ ఎలెవన్: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్, జేమ్స్ ఆండర్సన్.
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..