Ind vs Eng: బంతితో చెలరేగిన హార్దిక్‌.. మాంచెస్టర్‌ వన్డేలో టీమిండియా టార్గెట్‌ ఎంతంటే?

India vs England: టీమిండియా బౌలర్లు సత్తాచాటారు. మాంచెస్టర్‌ వేదికగా జరుగుతోన్న కీలకమైన మూడో వన్డేలో ఇంగ్లండ్‌ జట్టును 259 పరుగులకే కట్టడి చేశారు. హార్దిక్‌ పాండ్యా (4/24), యుజువేంద్ర చాహల్‌ (3/60) ఆతిథ్య జట్టును..

Ind vs Eng: బంతితో చెలరేగిన హార్దిక్‌.. మాంచెస్టర్‌ వన్డేలో టీమిండియా టార్గెట్‌ ఎంతంటే?
India Vs England 3rd Odi
Follow us

|

Updated on: Jul 17, 2022 | 7:45 PM

India vs England: టీమిండియా బౌలర్లు సత్తాచాటారు. మాంచెస్టర్‌ వేదికగా జరుగుతోన్న కీలకమైన మూడో వన్డేలో ఇంగ్లండ్‌ జట్టును 259 పరుగులకే కట్టడి చేశారు. హార్దిక్‌ పాండ్యా (4/24), యుజువేంద్ర చాహల్‌ (3/60) ఆతిథ్య జట్టును భారీస్కోరు చేయకుండా అడ్డుకున్నారు. ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ (60; 80 బంతుల్లో 3×4, 2×6) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌(41; 31 బంతుల్లో 7×4) రాణించాడు. చివర్లో క్రేగ్‌ ఓవర్టన్‌ (32; 33 బంతుల్లో 1×4, 1×6), డేవిడ్‌ విల్లే (18; 15 బంతుల్లో 1×4, 1×6) ఓ మోస్తరు పరుగులు చేశారు. ఎనిమిదో వికెట్‌కు 48 పరుగుల భాగస్వామ్యం అందించడంలో ఇంగ్లండ్‌ జట్టు గౌరవప్రదమైన స్కోరును సాధించింది. కాగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇదే ఆఖరి మ్యాచ్‌ కాగా ఇందులో గెలిచిన జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. తొలి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించగా, రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయం సాధించి సిరీస్‌ను సమం చేసింది.

బట్లర్‌ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌..

ఇవి కూడా చదవండి

ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. అతని నిర్ణయం సరైనదేనంటూ టీమిండియా బౌలర్లు మొదట్లోనే వికెట్లు తీసి ఆతిథ్య జట్టును ఒత్తిడిలోకి నెట్టారు. ముఖ్యంగా బుమ్రా ప్లేస్‌లో జట్టులోకి వచ్చిన సిరాజ్‌ రెండో ఓవర్‌లోనే బెయిర్‌స్టో (0), రూట్‌(0)లను పెవిలియన్‌కు పంపించాడు. అయితే జాసన్‌ రాయ్‌, బెన్‌స్టోక్స్‌ కొద్ది సేపు భారత బౌలర్లను ప్రతిఘటించారు. అయితే హార్దిక్‌ పాండ్యా రాయ్‌, బెన్‌స్టోక్స్‌ను ఔట్‌ చేసి టీమిండియాకు బ్రేక్‌ ఇచ్చాడు. మొయిన్‌ అలీ (34), కెప్టెన్‌ బట్లర్‌ ఐదో వికెట్‌కు 79 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దారు. ఆతర్వాత లివింగ్‌ స్టోన్‌ వేగంగా పరుగులు సాధించినా పాండ్యా బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి జడేజాకు చిక్కాడు. ఆతర్వాత బట్లర్‌ కూడా లివింగ్ స్టోన్‌నే అనుసరించడంతో 199 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది ఇంగ్లండ్‌. అయితే క్రేగ్‌ ఓవర్టన్‌, విల్లే కాసిన్ని పరుగులు సాధించారు. అయితే చివర్లో భారత బౌలర్లు వరుసగా వికెట్లు తీయడంతో 45.5 ఓవర్లలో 259 పరుగులకు ఆలౌటైంది ఆతిథ్య జట్టు.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..