IND vs ENG: తొలుత 196 పరుగులు.. ఆపై 2 కళ్లు చెదిరే క్యాచ్‌లు.. భారత ఆటగాళ్లను ‘పోప్’ పెట్టేసిన ఇంగ్లండ్ ప్లేయర్
India vs England 1st Test: రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో మూడో స్థానంలో వచ్చిన పోప్ బాధ్యతాయుతమైన బ్యాటింగ్ ప్రదర్శించాడు. 163 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ జట్టుకు ఆసరాగా నిలిచిన పోప్ 3వ రోజు 154 బంతుల్లో సెంచరీ సాధించాడు. నాలుగో రోజు జాగ్రత్తగా బ్యాటింగ్‌కు దిగిన ఒల్లీ పోప్ 278 బంతుల్లో 196 పరుగులు చేసి వికెట్ కోల్పోయాడు.

India vs England 1st Test: హైదరాబాద్‌లో భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఓలీ పోప్ అద్భుత బ్యాటింగ్‌ను ప్రదర్శించాడు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో మూడో స్థానంలో వచ్చిన పోప్ బాధ్యతాయుతమైన బ్యాటింగ్ ప్రదర్శించాడు. 163 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ జట్టుకు ఆసరాగా నిలిచిన పోప్ 3వ రోజు 154 బంతుల్లో సెంచరీ సాధించాడు. నాలుగో రోజు జాగ్రత్తగా బ్యాటింగ్‌కు దిగిన ఒల్లీ పోప్ 278 బంతుల్లో 196 పరుగులు చేసి వికెట్ కోల్పోయాడు.
కేవలం 4 పరుగుల తేడాతో డబుల్ సెంచరీకి దూరమైనా.. ఈ మ్యాచ్ ద్వారా ఒల్లీ పోప్ ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. ఇంగ్లండ్‌కు చెందిన టెస్ట్ స్పెషలిస్ట్ అలెస్టర్ కుక్ రికార్డును బద్దలు కొట్టడం కూడా విశేషం.
ఈ మ్యాచ్‌లో 196 పరుగులు చేయడంతో, ఓలీ పోప్ భారత్‌లో టీమిండియాపై టెస్టు క్రికెట్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇంతకు ముందు ఈ రికార్డు కుక్ పేరిట ఉండేది.
2012లో అహ్మదాబాద్‌లో టీమిండియాతో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ అలిస్టర్ కుక్ 176 పరుగులు చేసి ఇప్పటి వరకు రికార్డు సృష్టించాడు. ఈ రికార్డును ఇప్పుడు ఆలీ పోప్ బద్దలు కొట్టాడు.
ఆతిథ్య భారత జట్టుపై టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్రపంచంలో నాలుగో బ్యాట్స్‌మెన్‌గా కూడా ఓలీ పోప్ నిలిచాడు. ఈ జాబితాలో జింబాబ్వేకు చెందిన ఆండీ ఫ్లవర్ అగ్రస్థానంలో నిలవడం విశేషం.
ఆండీ ఫ్లవర్ 2000లో నాగ్‌పూర్‌లో భారత్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 2వ ఇన్నింగ్స్‌లో 232 పరుగులతో అజేయంగా ఇన్నింగ్స్ ఆడాడు. దీని ద్వారా భారత్‌లో టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా ఆండీ ఫ్లవర్ రికార్డు సృష్టించాడు.
Ollie Pope gets a lot of appreciation from team mates and fans for brilliant 148 from 208 balls.#INDvENG #ENGvsIND #INDvsENG #ENGvIND #OlliePope #TestCricket #Bazball #WTC25 pic.twitter.com/j5Bebg3LGP
— sdn (@sdn7_) January 27, 2024
ఆండీ ఫ్లవర్ (232), బ్రెండన్ మెకల్లమ్ (225), గ్యారీ సోబర్స్ (198)లు భారత్‌లో అద్భుత ప్రదర్శన చేశారు. ఇప్పుడు 196 పరుగులు చేయడం ద్వారా, ఆతిథ్య జట్టు భారత్‌పై టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్రపంచంలో నాల్గవ బ్యాట్స్‌మెన్‌గా ఆలీ పోప్ నిలిచాడు.
రెండు క్యాచ్‌లతో టీమిండియాకు భారీ షాక్..
అలాగే, 231 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియాకు తన అద్భుత ఫీల్డింగ్‌తోనూ షాక్ ఇచ్చాడు. జైస్వాల్(13), గిల్(0)లను వెంట వెంటనే తన సూపర్బ్ టైమింగ్‌తో క్యాచ్‌లు అందుకుని పెవిలియన్ చేర్చాడు. మరోవైపు రోహిత్ (39) పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. దీంతో ప్రస్తుతం టీమిండియా ఛేజింగ్‌లో వరుసగా వికెట్లు కోల్పోతూ ప్రమాదంలో చిక్కుకుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




