AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG 4th Test: బ్యాడ్ లైట్ ఎఫెక్ట్.. మూడో రోజు నిలిచిపోయిన ఆట.. భారత్ స్కోర్ 270/3..

IND vs ENG 4th Test Day 3 Highlights: బ్యా్డ్ లైట్ ఎఫెక్ట్ కారణంగా భారత్ - ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో రోజు ఆట నిలిచిపోయింది. లైటింగ్ సరిగ్గా లేకపోవడంతో మ్యాచ్‌‌ని నిలిపివేస్తున్నట్లు

IND vs ENG 4th Test: బ్యాడ్ లైట్ ఎఫెక్ట్.. మూడో రోజు నిలిచిపోయిన ఆట.. భారత్ స్కోర్ 270/3..
Ind Vs Eng Match
Shiva Prajapati
|

Updated on: Sep 04, 2021 | 11:25 PM

Share

IND vs ENG 4th Test Day 3 Highlights: బ్యా్డ్ లైట్ ఎఫెక్ట్ కారణంగా భారత్ – ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో రోజు ఆట నిలిచిపోయింది. లైటింగ్ సరిగ్గా లేకపోవడంతో మ్యాచ్‌‌ని నిలిపివేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. మ్యాచ్ ముగియడానికి ఇంకా 45 నిమిషాలు ఉండగా.. స్పిన్ బౌలింగ్ వేయడానికి అనుమతిస్తూ మ్యాచ్‌ను కొనసాగించాలని ప్రయత్నించారు. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు లేకపోవడంతో.. మ్యాచ్‌ను ఆపేశారు. మూడో రోజు సెకండ్ ఇన్నింగ్స్ కంటిన్యూ చేసిన టీమిండియా 3 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసి ఇంగ్లండ్‌పై 171 పరుగుల లీడ్‌లో ఉంది. ఓపెనర్ రోహిత్ శర్మ అత్యధికంగా 127 పరుగులు(14 ఫోర్లు, 1 సిక్స్) చేయగా.. చటేశ్వర్ పుజారా 61 పరుగులు, కేఎల్ రాహుల్ 46 పరుగులు చేసి ఔట్ అయ్యారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ(22*), రవీంద్ర జడేజా(9*) రేపు నాలుగో రోజు ఆటను కొనసాగించనున్నారు. కాగా, సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బౌలర్లు ఓలీ రాబిన్సన్ 2 వికెట్లు పడగొట్టగా.. జేమ్స్ అండర్సన్ 1 వికెట్ తీసుకున్నాడు. ఇక ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులు చేసింది.

ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్.. తొలి రోజు మూడవ సెషన్ సమయానికి టీమిండియా ఆలౌట్ అవడంతో.. ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. అయితే, భారత బౌలర్ల రాణించడంతో కొద్ది సేపట్లోనే 3 వికెట్లు సమర్పించుకుంది ఇంగ్లండ్ టీమ్. తొలిరోజు ఆట ముగిసే సమయానికి రోరీ బర్న్స్, జో రూట్, హసీబ్ హమీద్ వికెట్లు కోల్పోగా.. 53 పరుగులు చేశారు. రెండో రోజు డేవిడ్ మలన్, క్రెయిగ్ ఓవర్టన్ మ్యాచ్‌ను కొనసాగించగా.. మూడవ సెషన్ సమయానికి ఆలౌట్ అయ్యారు. ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్‌లో 290 పరుగులు చేసి 99 పరుగుల లీడ్‌లో నిలిచింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో పోప్ అద్భుతంగా రాణించాడు. కేవలం 159 బంతుల్లోనే 81 పరుగులు చేసి టెస్ట్ మ్యాచ్‌ను కాస్తా వన్డే మ్యాచ్‌ను తలపించేలా చేశాడు. ఆ తరువాత క్రిస్ వోక్ అంతటిస్థాయిలో ఆడాడు. 50 పరగులు చేసి జట్టు స్కోర్ పెంచేందుకు కృషి చేశాడు. కెప్టెన్ జో రూట్ 21 పరుగులు చేయగా.. మలన్ 31, బెయిర్‌స్టో 37, మోయిన్ 35, పరుగులు చేశారు. ఇక భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్ అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు. బూమ్రా, జడేజా చెరి 2 వికెట్లు తీసుకోగా.. ఠాకూర్, శిరాజ్ చెరో వికెట్ తీశారు.

Also read:

Ritu Varma : వరుస ఆఫర్లు అందుకుంటున్న తెలుగమ్మాయి.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న అందాల రీతూ వర్మకు

Covid-19 vaccination: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. విద్యా సంస్థల్లో100 శాతం వ్యాక్సినేష‌న్‌కు మార్గదర్శకాలు..

న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్ విక్టరీ.. కానీ ఆస్ట్రేలియాకు ఎఫెక్ట్ పడింది..! ఉత్కంఠ మ్యాచ్‌లో ఓడిన కివీస్..

కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌