Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్ విక్టరీ.. కానీ ఆస్ట్రేలియాకు ఎఫెక్ట్ పడింది..! ఉత్కంఠ మ్యాచ్‌లో ఓడిన కివీస్..

బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న 5 టీ 20 మ్యాచ్‌ సిరీస్‌లో భాగంగా రెండో టీ 20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ విజయం సాధించింది. మొదటి మ్యాచ్‌లో కూడా

న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్ విక్టరీ.. కానీ ఆస్ట్రేలియాకు ఎఫెక్ట్ పడింది..! ఉత్కంఠ మ్యాచ్‌లో ఓడిన కివీస్..
Ban Vs Nz
Follow us
uppula Raju

|

Updated on: Sep 04, 2021 | 10:03 PM

బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న 5 టీ 20 మ్యాచ్‌ సిరీస్‌లో భాగంగా రెండో టీ 20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ విజయం సాధించింది. మొదటి మ్యాచ్‌లో కూడా బంగ్లాదేశ్ గెలవడంతో సిరీస్‌లో 2-0తో ముందంజలో ఉంది. అయితే రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ గెలవడంతో ఆస్ట్రేలియాకు ఎఫెక్ట్ పడింది. ఐసీసీ టీ 20 ర్యాంకింగ్స్‌లో 6 నుంచి 7కు పడిపోయింది. మరోవైపు బంగ్లాదేశ్ ఆరో స్థానాన్ని ఆక్రమించింది. ఈ లెక్కన ఒకే బాణానికి రెండు పిట్టలు అన్నట్లు బంగ్లాదేశ్ గెలిచి రెండు జట్లపై ప్రతీకారం తీర్చుకుంది.

రెండో టీ 20లోఆతిథ్య బంగ్లాదేశ్ మొదటగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. మొదటి వికెట్‌కు 59 పరుగుల భాగస్వామ్యం లభించింది. కానీ 100 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో కెప్టెన్ మహ్మదుల్లా 32 బంతుల్లో 37 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. మరోవైపు ఓపెనర్ మహ్మద్ నయీమ్ అత్యధికంగా 39 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ బౌలర్లలో రచిన్ రవీంద్ర 22 పరుగులిచ్చి 3 వికెట్లు సాధించాడు.

లాథమ్ కెప్టెన్స్‌ ఇన్నింగ్స్ వృథా.. 142 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ ఆటతీరు పేలవంగా ప్రారంభమైంది.18 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ టామ్ లాథమ్ కెప్టెన్‌ ఇన్నింగ్స్ ఆడాడు. స్కోరు బోర్డును పెంచే పనిని ప్రారంభించాడు. కానీ ఒంటరిగా మిగిలిపోయాడు. లాథమ్ 49 బంతుల్లో 65 నాటౌట్‌గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు 1 సిక్స్ ఉన్నాయి. కానీ ఇవి జట్టును గెలిపించలేకపోయాయి.

చివరి బంతికి సిక్సర్ కొడితే విజయం.. న్యూజిలాండ్ జట్టు విజయానికి చివరి బంతికి సిక్సర్ అవసరం. కెప్టెన్ లాథమ్ స్ట్రైక్‌లో ఉన్నా సిక్సర్‌ సాధించలేకపోయాడు. కేవలం సింగిల్‌రన్‌కే పరిమితమయ్యాడు. ఫలితంగా న్యూజిలాండ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు137 పరుగులు మాత్రమే చేసింది. బంగ్లాదేశ్ కెప్టెన్ మహ్మదుల్లా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

SBI Online: మరి కొద్దిసేపట్లో ఎస్బీఐ కొన్ని ఆన్ లైన్ సేవలు నిలిచిపోనున్నాయి.. ఎందుకో.. ఎప్పటిదాకానో తెలుసుకోండి!

Shankar: స్టార్ డైరెక్టర్‌ను వెంటాడుతున్న వివాదాలు.. ఇప్పుడు మరొకటి కూడా..

Air Taxi: గాల్లో తేలుతూ కారులో వెళ్లినట్టు వెళ్ళిపోతే ఎలా వుంటుంది? గాలిలో వెళ్ళే కారులు రెడీ..మరి మీరు సిద్ధమేనా?