AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG, 1st Test: టీమిండియా మోస్ట్ సక్సెస్ ఫుల్ జోడీగా అశ్విన్-జడేజా.. కుంబ్లే-హర్భజన్‌ను అధిగమించిన స్పిన్ ద్వయం..

Ashwin-Jadeja surpasses Kumble-Harbhajan: హైదరాబాద్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి టెస్టు జరుగుతోంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో టాస్ గెలిచిన ఇంగ్లీష్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇరు జట్లు తలో ముగ్గురు స్పిన్నర్లతో ఆడేందుకు వచ్చాయి. తొలిరోజు రెండో సెషన్‌ ఆట కొనసాగుతోంది. దీంతో ఇంగ్లండ్ 4 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది.

IND vs ENG, 1st Test: టీమిండియా మోస్ట్ సక్సెస్ ఫుల్ జోడీగా అశ్విన్-జడేజా.. కుంబ్లే-హర్భజన్‌ను అధిగమించిన స్పిన్ ద్వయం..
Ashwin Jadeja
Venkata Chari
|

Updated on: Jan 25, 2024 | 12:37 PM

Share

Ashwin-Jadeja: గురువారం హైదరాబాద్‌లో భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన తొలి టెస్టులో భారత స్పిన్నర్లు ఆర్. అశ్విన్, రవీంద్ర జడేజా భారత్ తరపున అత్యంత విజయవంతమైన టెస్ట్ బౌలింగ్ జోడీగా నిలిచారు. 54 మ్యాచ్‌ల్లో 501 వికెట్లు తీసిన అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ పేరిట ఉన్న రికార్డును అధిగమించి వీరిద్దరూ తమ 502వ వికెట్‌ను కైవసం చేసుకున్నారు.

138 టెస్టు మ్యాచ్‌లలో 1039 వికెట్లు తీసిన ఇంగ్లిష్ పేస్ బౌలర్లు జేమ్స్ ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ పేరిట అత్యధిక వికెట్లు తీసిన బౌలింగ్ జోడీగా రికార్డు సృష్టించారు.

ప్రస్తుతం ఆడుతోన్న ప్లేయర్లలో మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్ 81 టెస్టుల్లో 643 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నారు.

భారత బౌలింగ్ జోడీల ద్వారా టెస్టుల్లో అత్యధిక వికెట్లు..

అశ్విన్/జడేజా – 503 వికెట్లు*

కుంబ్లే/ హర్భజన్ – 501

జహీర్/ హర్భజన్ – 474

అశ్విన్/ ఉమేష్ – 431

కుంబ్లే/ శ్రీనాథ్ – 412.

ఇరుజట్ల ప్లేయింగ్ 11..

మ్యాచ్ పరిస్థితి..

హైదరాబాద్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి టెస్టు జరుగుతోంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో టాస్ గెలిచిన ఇంగ్లీష్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇరు జట్లు తలో ముగ్గురు స్పిన్నర్లతో ఆడేందుకు వచ్చాయి. తొలిరోజు రెండో సెషన్‌ ఆట కొనసాగుతోంది. దీంతో ఇంగ్లండ్ 4 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. బెన్ స్టోక్స్, జో రూట్ క్రీజులో ఉన్నారు. 37 పరుగుల వద్ద అక్షర్ పటేల్ బౌలింగ్‌లో జానీ బెయిర్‌స్టో అవుట్ అయ్యాడు.

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

ఇంగ్లండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్, రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్, జాక్ లీచ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..