AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: సచిన్ రికార్డ్‌ను బ్రేక్ చేసిన ఇంగ్లండ్ దిగ్గజం.. టాప్ 5 లిస్టులో ముగ్గురు మనోళ్లే..

Joe Root surpasses Sachin Tendulkar: హైదరాబాద్ వేదికగా భారత్ వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి టెస్ట్ నేటి నుంచి ప్రారంభమైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేస్తోంది. ప్రస్తుతం వార్తలు రాసే సమయానికి ఇంగ్లండ్ జట్టు 3 వికెట్లు కోల్పోయి 100 పరుగులు దాటింది. అయితే, టీమిండియా స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ తొలి వికెట్ పడగొట్టి, భారత్‌కు శుభారంభం అందించాడు. ఆ వెంటనే ఇంగ్లండ్ జట్టు వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. ఇందులో అశ్విన్ 2 వికెట్లు, జడేజా 1 వికెట్ పడగొట్టారు.

IND vs ENG: సచిన్ రికార్డ్‌ను బ్రేక్ చేసిన ఇంగ్లండ్ దిగ్గజం.. టాప్ 5 లిస్టులో ముగ్గురు మనోళ్లే..
Joe Toot Records Ind Vs Eng
Venkata Chari
|

Updated on: Jan 25, 2024 | 12:19 PM

Share

India vs England, 1st Test: హైదరాబాద్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి టెస్టు జరుగుతోంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో టాస్ గెలిచిన ఇంగ్లీష్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇరు జట్లు తలో ముగ్గురు స్పిన్నర్లతో ఆడేందుకు వచ్చాయి. కాగా, మొదటి రోజు మొదటి సెషన్ ముగిసే సరికి ఇంగ్లండ్ 3 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. జానీ బెయిర్‌స్టో, జో రూట్ నాటౌట్‌గా నిలిచారు. వీరిద్దరి మధ్య 48 పరుగుల భాగస్వామ్యం ఉంది.

ఈ క్రమంలో జోరూట్ తన అనుభవంతో ఉప్పల్ మైదానంలో భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలో జో రూట్ అజేయంగా 18 (35) పరుగులతో నిలిచాడు. మొదటి మ్యాచ్ ప్రారంభానికి ముందు, సచిన్ 32 టెస్టుల్లో 2535 పరుగులతో భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్‌లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

అయితే, మాస్టర్ బ్లాస్టర్ ఫీట్‌ను అధిగమించడానికి రూట్‌కు కేవలం పది పరుగులు మాత్రమే అవసరం కాగా, ప్రస్తుతం జో రూట్ అజేయంగా 18 పరుగులతో నిలిచాడు. ఈ క్రమంలో రూట్ ఇప్పుడు కేవలం 45 ఇన్నింగ్స్‌లలో 2544 పరుగులతో సచిన్ రికార్డ్‌ను బ్రేక్ చేశాడు. 21వ ఓవర్ నాలుగో బంతికి అక్షర్ పటేల్ బౌండరీ బాదిన రూట్ ఈ మైలురాయిని అందుకున్నాడు.

భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్‌లలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితా..

జో రూట్ – 2544

సచిన్ టెండూల్కర్- 2535

సునీల్ గవాస్కర్ – 2483

అలైస్టర్ కుక్ – 2431

విరాట్ కోహ్లీ – 1991

రాహుల్ ద్రవిడ్ – 1950.

ఇరుజట్ల ప్లేయింగ్ 11..

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

ఇంగ్లండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్, రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్, జాక్ లీచ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..