AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG 1st ODI: దిగ్గజాల సరసన చేరనున్న రోహిత్, ధావన్ జోడీ.. రికార్డుకు 6 పరుగుల దూరంలోనే..

టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఐదు నెలల తర్వాత మళ్లీ వన్డేల్లో ఆడుతున్నాడు.తన కెరీర్‌లో 150వ వన్డే మ్యాచ్ ఆడుతున్న ధావన్.. రోహిత్‌తో కలిసి ఓ రికార్డు నెలకొల్పేందుకు సిద్ధమయ్యాడు.

IND vs ENG 1st ODI: దిగ్గజాల సరసన చేరనున్న రోహిత్, ధావన్ జోడీ.. రికార్డుకు 6 పరుగుల దూరంలోనే..
Rohit Sharma Dhawan
Venkata Chari
|

Updated on: Jul 12, 2022 | 4:24 PM

Share

ప్రస్తుతం టీమిండియాలో అత్యుత్తమ ఓపెనింగ్ జోడీ మళ్లీ నేడు మైదానంలోకి దిగనుంది. శిఖర్ ధావన్(shikhar dhawan), రోహిత్ శర్మ(Rohit Sharma)ల జోడీ.. గత ఐదు నెలల తర్వాత ధావన్ టీమిండియాకు తిరిగి వస్తున్నారు. ఇంగ్లండ్‌తో(IND vs ENG 1st ODI) జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు ధావన్ తొలి మ్యాచ్‌లో అడుగుపెట్టనున్నాడు. కెరీర్‌లో 150వ వన్డే కావడంతో ధావన్‌కి ఇది ప్రత్యేక మ్యాచ్‌. దీంతో ధావన్ ఈ మ్యాచ్‌ని మరింత ప్రత్యేకంగా మార్చే అవకాశం ఉంది. లెజెండ్ సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీల క్లబ్‌లో ధావన్, రోహిత్ జోడీ చేరే అవకాశం ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ధావన్-రోహిత్ జోడీ రికార్డుకు మరో 6 పరుగుల దూరం..

ఇప్పటివరకు వన్డే కెరీర్‌లో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ జోడీ 111 మ్యాచ్‌ల్లో మొత్తం 4994 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌తో వన్డేల్లో ఈ జోడీ మరో 6 పరుగులు సాధిస్తే 5 వేల పరుగుల క్లబ్‌లో చేరనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓపెనింగ్‌గా ఐదు వేల పరుగులు చేసిన రెండో భారత జోడీగా ధావన్-రోహిత్ రికార్డులకెక్కనున్నారు.

ఓవరాల్‌గా ఈ విషయంలో ఓపెనింగ్ జోడీ సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ అగ్రస్థానంలో ఉన్నారు. వీరిద్దరూ కలిసి 136 వన్డేల్లో మొత్తం 6609 పరుగులు చేశారు. మొత్తం జాబితాలో రోహిత్-ధావన్ జోడీ నాలుగో స్థానంలో నిలిచింది.

ఐదు నెలల తర్వాత ధావన్ తిరిగి జట్టులోకి..

ఇంగ్లండ్ తర్వాత టీమిండియా వెస్టిండీస్ టూర్‌కు కూడా వెళ్లాల్సి ఉందని తెలిసిందే. అక్కడ వన్డే సిరీస్‌లో ధావన్‌ను టీమిండియా కెప్టెన్‌గా నియమించారు. ఐదు నెలల తర్వాత ధావన్ టీమ్ ఇండియాకు తిరిగి వస్తున్నాడు. ఇటువంటి పరిస్థితిలో, ఇంగ్లాండ్ సిరీస్ అతనికి చాలా కీలకమైనది. ఎందుకంటే అతను ఫిబ్రవరి 11న అహ్మదాబాద్‌లో వెస్టిండీస్‌తో తన చివరి వన్డే ఆడాడు.

ఇరు జట్ల ప్లేయింగ్ XI ఎలా ఉండొచ్చంటే..

టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ / ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ / రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, ప్రణంద్ కృష్ణ మరియు యుజ్వేంద్ర చాహల్.

ఇంగ్లండ్: జాసన్ రాయ్, జానీ బెయిర్‌స్టో, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్ (కెప్టెన్ & కీపర్), లియామ్ లివింగ్‌స్టోన్, మోయిన్ అలీ, సామ్ కర్రాన్, డేవిడ్ విల్లీ, రీస్ టోప్లీ, మాట్ పార్కిన్సన్.