IND vs ENG: హిట్‌మ్యాన్ కెప్టెన్ ఇన్నింగ్స్.. ఆకట్టుకున్న సూర్య.. ఇంగ్లండ్ టార్గెట్ 230
India vs England, 29th Match 1st Innings: లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో భారత్, డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ మధ్య ప్రపంచకప్ 2023లో 29వ మ్యాచ్ జరుగుతోంది. ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 229 పరుగులు సాధించింది. దీంతో ఇంగ్లండ్ ముందు 230 పరుగుల టార్గెట్ నిలిచింది.

18 వేల పరుగులు పూర్తి చేసిన రోహిత్ శర్మ..
భారత కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో 18 వేల పరుగులు పూర్తి చేశాడు. రోహిత్ తన 457వ ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించాడు. రోహిత్ భారతదేశం తరపున అత్యధిక పరుగులు చేసిన టాప్-5 క్లబ్‌లో చేరాడు. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ పేర్లు ఈ క్లబ్‌లో ఉన్నాయి.
పవర్‌ప్లేలో పెవిలియన్ చేరిన గిల్-కోహ్లీ..
టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్‌కు వచ్చిన భారత జట్టుకు ఆరంభం బాగోలేదు. తొలి 10 ఓవర్లలో 35 పరుగుల వద్ద శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి వికెట్లను కోల్పోయింది. గిల్ 9, కోహ్లి సున్నాతో ఔటయ్యారు. 27 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ బౌలర్లు భారత జట్టుపై ఒత్తిడి పెంచారు.
ఇరు జట్లు:
View this post on Instagram
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్(కీపర్/కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లీ, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..