IND vs BAN: 6,2,4,4.. దూకుడు మీదున్న బంగ్లా బౌలర్‌కు బ్రేకులేసిన అశ్విన్.. ఒకే ఓవర్లో 16 రన్స్ కొట్టి..
బంగ్లా స్పిన్నర్ మెహదీ హసన్ మిరాజ్ భారత జట్టు టాపార్డర్‌ను కుప్పకూల్చాడు. పిచ్ బాగా టర్న్ అవుతుండడంతో ఏకంగా ఐదు వికెట్ల తీసి టీమిండియాను కలవరపెట్టాడు. శుభ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, కోహ్లీ, పంత్, అక్షర్ పటేల్‌లను పెవిలియన్ పంపి మ్యాచ్‌పై ఆశలు పెంచాడు

ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా మూడు వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. తద్వారా రెండు టెస్టుల సిరీస్‌ను 2-0 తేడాతో భారత జట్టు కైవసం చేసుకుంది. కాగా 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 74 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. బంగ్లా స్పిన్నర్ మెహదీ హసన్ మిరాజ్ భారత జట్టు టాపార్డర్‌ను కుప్పకూల్చాడు. పిచ్ బాగా టర్న్ అవుతుండడంతో ఏకంగా ఐదు వికెట్ల తీసి టీమిండియాను కలవరపెట్టాడు. శుభ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, కోహ్లీ, పంత్, అక్షర్ పటేల్‌లను పెవిలియన్ పంపి మ్యాచ్‌పై ఆశలు పెంచాడు. అతని బౌలింగ్ ధాటికి ఒకానొకదశలో టీమిండియాకు భంగపాటు తప్పదనిపించింది. అయితే శ్రేయస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్‌లు బంగ్లా జోరుకు బ్రేకులు వేశారు. అలాగే రెచ్చిపోతున్న మెహదీ హసన్‌పై ఎదురుదాడికి దిగారు. ముఖ్యంగా అశ్విన్ మెహదీ హసన్‌పై విరుచుకుపడ్డాడు.
మరో వికెట్ పడకుండా టీమిండియా స్కోరుబోర్డును ముందుకు కదిలించిన ఈ జోడి విజయానికి చేరువ కాగానే రెచ్చిపోయారు. ఇక విజయానికి 16 రన్స్ అవసరమైన దశలో మరోసారి బంతిని అందుకున్నాడు మెహదీ హసన్. ఆ ఓవర్‌లో తొలి బంతినే ఒంటి చేత్తో భారీ సిక్సర్‌గా మలిచాడు అశ్విన్. ఆ తర్వాత రెండు పరుగులు తీశాడు. ఆపై ఐదు, ఆరు బంతులను వరుసగా బౌండరీలకు తరలించి టీమిండియా విజయాన్ని ఖరారు చేశాడు. అలా టీమిండియాకు ముచ్చెమటలు పట్టించిన మెహదీ హసన్ బౌలింగ్‌లో 16 పరుగులు పిండుకున్నాడు అశ్విన్. ఎలాగైనా గెలుద్దామన్న బంగ్లా ఆటగాళ్ల ఆశలపై నీళ్లు పోశాడు.




6,2,0,0,4,4 by Ashwin and won it for India, what an incredible batting by one of the great of Test cricket. pic.twitter.com/iQ6v8EKlXU
— Johns. (@CricCrazyJohns) December 25, 2022
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..
