IND vs BAN: రోహిత్‌తో పాటు ఆ స్టార్‌ బౌలర్‌ కూడా ఔట్‌.. బంగ్లాతో రెండో టెస్టుకు భారత జట్టు ఇదే

ఈ కీలక మ్యాచ్‌కు రోహిత్‌ శర్మ అందుబాటులో ఉండడం లేదు. గాయం కారణంగా అతను మొదటి టెస్టుకు కూడా దూరమైన సంగతి తెలిసిందే. అయితే గాయం తగ్గకపోవడంతో చివరి టెస్టులో కూడా హిట్‌ మ్యాన్‌ ఆడడని బీసీసీఐ ప్రకటించింది. రోహిత్ మాత్రమే కాదు, ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీ కూడా గాయం కారణంగా టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు.

IND vs BAN: రోహిత్‌తో పాటు ఆ స్టార్‌ బౌలర్‌ కూడా ఔట్‌.. బంగ్లాతో రెండో టెస్టుకు భారత జట్టు ఇదే
Team India
Follow us

|

Updated on: Dec 20, 2022 | 3:02 PM

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో ఉంది. రెండో టెస్టు గురువారం (డిసెంబర్‌22) నుంచి ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి వన్డే సిరీస్‌లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత జట్టు భావిస్తోంది. అదే సమయంలో వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్‌ రేసులో నిలవాలంటే ఈ టెస్టులో విజయం సాధించడం టీమిండియాకు తప్పనిసరి. కాగా ఈ కీలక మ్యాచ్‌కు రోహిత్‌ శర్మ అందుబాటులో ఉండడం లేదు. గాయం కారణంగా అతను మొదటి టెస్టుకు కూడా దూరమైన సంగతి తెలిసిందే. అయితే గాయం తగ్గకపోవడంతో చివరి టెస్టులో కూడా హిట్‌ మ్యాన్‌ ఆడడని బీసీసీఐ ప్రకటించింది. రోహిత్ మాత్రమే కాదు, ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీ కూడా గాయం కారణంగా టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. ఇక నవదీప్‌ సైనీ పొట్ట కండరాల నొప్పితో బాధపడుతున్నాడని, అతను తిరిగి జాతీయ క్రికెట్‌ అకాడమీకి వెళ్లనున్నట్లు బీసీసీఐ తెలిపింది.

బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌ సందర్భంగా రోహిత్‌ శర్మ గాయపడ్డ విషయం తెలిసిందే. ఎడమచేతి బొటనవేలికి గాయమైనప్పటికీ బ్యాటింగ్‌ చేసిన హిట్‌మ్యాన్‌.. నొప్పి తీవ్రతరం కావడంతో స్వదేశానికి తిరిగివచ్చాడు. ఆతర్వాత చికిత్స తీసుకున్నాడు. ఈ క్రమంలో మొదటి టెస్టుకు దూరమైన రోహిత్‌.. రెండో మ్యాచ్‌ నాటికి అందుబాటులోకి వస్తాడనుకున్నా అలా జరుగలేదు. దీంతో రెండో టెస్టుకు కూడా కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మొదటి మ్యాచ్‌లో టీమ్ ఇండియా బౌలర్లు, బ్యాటర్లు సమష్ఠిగా రాణించడంతో ప్లేయింగ్ ఎలెవన్‌లో పెద్దగా మార్పులుండవని తెలుస్తోంది. 12 ఏళ్ల తర్వాత జట్టులో చోటు దక్కించుకున్న లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ రెండో టెస్టులో కూడా ఆడే అవకాశం లేదు.

ఇవి కూడా చదవండి

బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకు భారత జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్, ఛతేశ్వర్ పుజారా (వైస్‌ కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్‌ కీపర్‌), కెఎస్ భరత్ (వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, అభిమన్యు ఈశ్వరన్, సౌరభ్ కుమార్, జయదేవ్ ఉనద్కత్.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..