AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: చివరి బంతికి సిక్స్ బాదిన రింకూ సింగ్.. స్కోరు బోర్డులో చేరని పరుగులు.. ఎందుకో తెలుసా?

Rinku Singh, IND vs AUS: తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ విజయానికి చివరి ఓవర్‌లో ఏడు పరుగులు చేయాల్సి ఉంది. 20వ ఓవర్ తొలి బంతికి రింకూ బౌండరీ కొట్టి జట్టును విజయానికి చేరువ చేశాడు. అయితే, ఆ తర్వాత భారత్ తర్వాతి నాలుగు బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేసి మూడు వికెట్లు కోల్పోయింది. విజయానికి కేవలం ఒక పరుగు అవసరమైన సమయంలో రింకూ చివరి బంతికి అద్భుతమైన సిక్సర్ కొట్టాడు. కానీ, రింకూ కొట్టిన సిక్స్ మాత్రం లెక్కలోకి రాలేదు. దీంతో అభిమానుల్లో తీవ్ర దుమారం రేగింది.

Video: చివరి బంతికి సిక్స్ బాదిన రింకూ సింగ్.. స్కోరు బోర్డులో చేరని పరుగులు..  ఎందుకో తెలుసా?
Rinku Singh Six Video
Venkata Chari
|

Updated on: Nov 24, 2023 | 3:52 PM

Share

వన్డే ప్రపంచ కప్ 2023 (ODI World Cup 2023) ఫైనల్‌లో ఓటమి నుంచి కోలుకోవడం అంత సులభం కాదు. కానీ, ఆస్ట్రేలియా (India vs Australia)తో జరిగిన T20 సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా టీమ్ ఇండియా ఆ నిరాశను తగ్గించడానికి ప్రయత్నించింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా విశాఖపట్నంలో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో శుభారంభం చేసింది. ఆసీస్ నిర్దేశించిన 209 పరుగుల లక్ష్యాన్ని భారత్ 19.5 ఓవర్లలోనే సాధించింది. జట్టు తరపున కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 80 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడగా, ఇషాన్ కిషన్ కూడా 58 పరుగులు చేశాడు. అతడితో పాటు రింకూ సింగ్ (Rinku Singh) కూడా 14 బంతుల్లో 22 పరుగులతో అజేయ ఇన్నింగ్స్‌తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో రింకూ చివరి బంతికి సిక్సర్ కొట్టి జట్టు విజయాన్ని ఖాయం చేశాడు. అయితే రింకూ బాదిన ఆ సిక్స్ స్కోరు బోర్డులోకి రాకపోవడం గమనార్హం.

చివరి బంతి నో బాల్‌..

తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ విజయానికి చివరి ఓవర్‌లో ఏడు పరుగులు చేయాల్సి ఉంది. 20వ ఓవర్ తొలి బంతికి రింకూ బౌండరీ కొట్టి జట్టును విజయానికి చేరువ చేశాడు. అయితే, ఆ తర్వాత భారత్ తర్వాతి నాలుగు బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేసి మూడు వికెట్లు కోల్పోయింది. విజయానికి కేవలం ఒక పరుగు అవసరమైన సమయంలో రింకూ చివరి బంతికి అద్భుతమైన సిక్సర్ కొట్టాడు. కానీ, రింకూ కొట్టిన సిక్స్ మాత్రం లెక్కలోకి రాలేదు. దీంతో అభిమానుల్లో తీవ్ర దుమారం రేగింది.

ఇవి కూడా చదవండి

నిజానికి, 20వ ఓవర్ చివరి బంతిని రింకూ సిక్సర్ కొట్టగా అది నో బాల్‌గా థర్డ్ అంపైర్ ప్రకటించారు. దీంతో ఐసీసీ నిబంధనల ప్రకారం టీమిండియాను విజేతగా ప్రకటించారు. రింకూ సిక్సర్ కొట్టే ముందు బౌలర్ నో బాల్ వేయడంతో ఆ సిక్స్ ను పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో భారత్ 19.5 ఓవర్లలో విజయాన్ని అందుకుంది.

తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగిన సూర్య- కిషన్..

ఈ మ్యాచ్‌లో భారత్ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్స్ ఇద్దరూ టీం స్కోర్ 22 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి మూడో వికెట్‌కు 60 బంతుల్లో 112 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇషాన్ ఔటైన తర్వాత రింకూ సింగ్ కెప్టెన్ సూర్యకు మంచి సపోర్ట్ ఇచ్చాడు. వీరిద్దరి మధ్య ఐదో వికెట్‌కు 17 బంతుల్లో 40 పరుగుల భాగస్వామ్యం ఏర్పడింది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయాన్ని పూర్తిగా ఖాయం చేసింది. టీ20 సిరీస్‌లో ఇరు జట్ల మధ్య రెండో మ్యాచ్ నవంబర్ 26న తిరువనంతపురం మైదానంలో జరగనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..