Rohit Sharma on Jaspri Bumrah and Sam Konstas Fight: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో, చాలా సందర్భాలలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా ఆటగాళ్ల మధ్య వాగ్వివాదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. కొన్నిసార్లు ట్రావిస్ హెడ్, మహ్మద్ సిరాజ్ ముఖాముఖిగా వాగ్వాదానికి దిగగా.. కొన్నిసార్లు విరాట్ కోహ్లీ, సామ్ కాన్స్టాంట్స్ మధ్య వివాదం వార్తల్లోకి వచ్చింది. సిడ్నీ వేదికగా జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లోనూ ఇదే వాతావరణం నెలకొంది. తొలి రోజు ఆట చివరి ఓవర్‌లో జస్ప్రీత్ బుమ్రా, సామ్ కాన్‌స్టంట్స్ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఇప్పుడు ఈ విషయంపై రోహిత్ శర్మ కీలక ప్రకటన చేశాడు. మా అబ్బాయిలు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు, రెచ్చగొడితే మాత్రం తిరిగి ఘాటుగా రిప్లే ఇస్తారంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
సిడ్నీ టెస్టు తొలిరోజు చివరి ఓవర్‌లో ఆస్ట్రేలియా యువ ఓపెనర్ సామ్ కాన్‌స్టాంట్స్, భారత వెటరన్ ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రెండో రోజు ఆట లంచ్ విరామం తర్వాత స్టార్ స్పోర్ట్స్‌లో మాట్లాడుతూ రోహిత్ శర్మను ఈ విషయం గురించి ఘాటుగా సమాధానం ఇచ్చాడు. ‘మా అబ్బాయిలు నిశ్శబ్దంగా ఉన్నంత కాలం నిశ్శబ్దంగానే ఉంటారు. మీరు వేళ్లు చూపిస్తే మౌనంగా ఉండరు. అందుకు గట్టిగానే ఆన్సర్ చేస్తారు’ అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
ఈ మొత్తం ఘటన తొలిరోజు ఆట చివరి రెండు బంతుల్లో ఓ వాగ్వాదం చోటు చేసుకుంది. బుమ్రా ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో మూడో ఓవర్‌ను, తొలి రోజు ఆటలో చివరి ఓవర్‌ను బౌలింగ్ చేస్తున్నాడు. ఆ ఓవర్‌లోని ఐదో బంతిని వేయడానికి బుమ్రా ముందుకు రాగా, స్ట్రయిక్‌లో ఉన్న ఉస్మాన్ ఖవాజా సిద్ధంగా లేడు. మరోసారి బుమ్రా బంతిని వేయడానికి సిద్ధమయ్యేలోపు కొంచెం ఆందోళన చెందాడు. ఇంతలో, నాన్-స్ట్రైక్‌లో నిలబడి ఉన్న సామ్ కాన్స్టాంట్స్ ఎటువంటి కారణం లేకుండా బుమ్రాతో ఏదో అన్నాడు. బుమ్రా కూడా కాన్స్టాస్ దగ్గరకు వస్తూ ధీటుగా సమాధానం ఇష్తున్నాడు. ఈ క్రమంలో ఇద్దరూ ఒకరికొకరు ఏదో చెప్పుకోవడం కనిపించింది. అనంతరం అంపైర్ జోక్యం చేసుకుని సమస్యను సద్దుమణిగించారు.
వివాదం ఇక్కడితో ఆగలేదు. ఆ తర్వాత బుమ్రా వేసిన బంతి డాట్‌గా మిగిలిపోయింది. ఆ తర్వాత చివరి బంతికి వచ్చిన బుమ్రా ఖవాజా వికెట్ పడగొట్టాడు. బుమ్రా వికెట్ పడగొట్టిన వెంటనే, అతను కోపంగా కాన్‌స్టంట్స్ వైపు నడుచుకుంటూ వెళ్లాడు. ఆపై ఆగి ఏదో మాట్లాడడం కనిపించింది. దీని తర్వాత భారత ఆటగాళ్లు కూడా వికెట్ తీయడంతో సంబరాలు చేసుకున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..