IND vs AUS: మొహాలీ వన్డేలో టాస్ గెలిచిన భారత్.. కంగారులకే తొలి బ్యాటింగ్.. ప్లేయింగ్ ఎలెవన్ వివరాలివే..
IND vs AUS 1st ODI: మొహాలీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే మ్యాచ్ మరికొద్ది నిముషాల్లోనే ప్రారంభం కానుంది. వన్డే ప్రపంచ కప్‌కి 2 వారాల ముందు జరుగుతున్న ఈ సిరీస్ తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ ముందుగా బౌలింగ్ చేసేందుకు నిర్ణయించుకున్నాడు. దీంతో తొలి బ్యాటింగ్ చేసేందుకు ఆస్ట్రేలియన్ బ్యాటర్లు మైదానంలోకి రానున్నారు.
IND vs AUS 1st ODI: మొహాలీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే మ్యాచ్ మరికొద్ది నిముషాల్లోనే ప్రారంభం కానుంది. వన్డే ప్రపంచ కప్‌కి 2 వారాల ముందు జరుగుతున్న ఈ సిరీస్ తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ ముందుగా బౌలింగ్ చేసేందుకు నిర్ణయించుకున్నాడు. దీంతో తొలి బ్యాటింగ్ చేసేందుకు ఆస్ట్రేలియన్ బ్యాటర్లు మైదానంలోకి రానున్నారు. అనంతరం ఇరు జట్లు తమ ప్లేయింగ్ ఎలెవన్ వివరాలను వెల్లడించాయి. ఇక తొలి రెండు వన్డేలకు రోహిత్ శర్మ దూరంగా ఉండడంతో టీమిండియాను కేఎల్ రాహుల్ నడిపిస్తున్న సంగతి తెలిసిందే.
ఇక నేటి మ్యాచ్ ద్వారా రుతురాజ్ గైక్వాడ్, రవిచంద్రన్ అశ్విన్ తిరిగి భారత్ జట్టులోకి వచ్చారు. ఆసీస్ జట్టు విషయానికి వస్తే ముందుగా చెప్పినట్లుగానే తొలి వన్డేలో మిచెల్ స్టార్క్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ కనిపించలేదు.
#TeamIndia have won the toss and elect to bowl first in the 1st ODI against Australia.
Live – https://t.co/H6OgLtww4N… #INDvAUS pic.twitter.com/s8Y71dRLMr
— BCCI (@BCCI) September 22, 2023
Toss Update : india won the toss and decide to bowl first !!!#INDvsAUS pic.twitter.com/Beppyjj3AQ
— Harsh Parmar (@HarshPa56785834) September 22, 2023
కాగా, వరల్డ్ కప్‌కి ఇంకా రెండు వారాల సమయమే మిగిలి ఉన్న నేపథ్యంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యాకి భారత సెలెక్టర్లు విశ్రాంతి కల్పించారు. వీరంతా ఆసీస్‌తో సెప్టెంబర్ 27న జరిగే మూడో వన్డే ద్వారా జట్టులోకి తిరిగి వస్తారు. అలాగే ఈ సిరీస్ ద్వారా దాదాపు 21 నెలల తర్వాత రవిచంద్రన్ అశ్విన్ తిరిగి వన్డే జట్టులోకి వచ్చాడు.
ఇరు జట్ల ప్లేయింగ్ ఎలెవన్:
ఆస్ట్రేలియా జట్టు: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లాబుషెన్, కామెరూన్ గ్రీన్, జోష్ ఇంగ్లీస్ (వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, మాథ్యూ షార్ట్, పాట్ కమిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, ఆడమ్ జంపా
భారత జట్టు: శుభమాన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్, కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..