IND vs AUS: ఏంటయ్యా రాహుల్‌ ! సులభమైన రనౌట్‌ను అలా మిస్ చేశావ్.. ఫ్యాన్స్‌ ఫైర్‌.. వైరల్ వీడియో

మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా టాస్‌ గెలిచి ముందుగా బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అంతా బాగానే ఉంది కానీ మ్యాచ్ మధ్యలో రాహుల్‌ ఓ సులభమైన రనౌట్‌ను చేతులారా నేలపాలు చేశాడు. దీతో మార్నస్‌ లబుషేన్‌కు మంచి లైఫ్‌ లభించినట్లయింది. ఈ మ్యాచ్‌లో లబుషన్‌ 39 పరుగులు చేసి అశ్విన్‌ బౌలింగ్‌లో స్టంపౌట్‌ అయ్యాడు.

IND vs AUS: ఏంటయ్యా రాహుల్‌ ! సులభమైన రనౌట్‌ను అలా మిస్ చేశావ్.. ఫ్యాన్స్‌ ఫైర్‌.. వైరల్ వీడియో
Team India
Follow us
Basha Shek

|

Updated on: Sep 22, 2023 | 5:53 PM

మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా టాస్‌ గెలిచి ముందుగా బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అంతా బాగానే ఉంది కానీ మ్యాచ్ మధ్యలో రాహుల్‌ ఓ సులభమైన రనౌట్‌ను చేతులారా నేలపాలు చేశాడు. దీతో మార్నస్‌ లబుషేన్‌కు మంచి లైఫ్‌ లభించినట్లయింది. ఈ మ్యాచ్‌లో లబుషన్‌ 39 పరుగులు చేసి అశ్విన్‌ బౌలింగ్‌లో స్టంపౌట్‌ అయ్యాడు. అయితే అంతకుముందే ముందే అతను పెవిలియన్‌ చేరాల్సి వచ్చేంది. అయితే కీపర్‌ రాహుల్‌ పొరపాటుతో అతనికి జీవనాదానం లభించింది. వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ రవీంద్ర జడేజా వేసిన 23వ ఓవర్ తొలి బంతిని మార్నస్‌ లబుషేన్‌ కవర్‌ మీదుగా ఆడాడు. సింగిల్‌ తీసేందుకు ప్రయత్నించాడు. అయితే సూర్యకుమార్‌ వెంటనే బంతిని కీపర్‌ వైపు త్రో చేశాడు. అప్పటికే లబుషన్‌ క్రీజు దాటి పిచ్‌ మధ్యలో ఉన్నాడు. అయితే సూర్య విసిరిన బంతిని రాహుల్‌ అందుకోలేకపోయాడు. దీంతో లబుషన్‌కు మంచి లైఫ్‌ దొరికినట్లయ్యింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. రాహుల్‌ కీపింగ్‌ వైఫల్యంపై క్రికెట్‌ అభిమానులు మండిపడుతున్నారు. కాగా ఈ సందర్భంలోనే కాద మ్యాచ్‌లో కీపింగ్‌ చేస్తున్నప్పుడు చాలా సార్లు రాహుల్‌ అసౌకర్యంగా కనిపించాడు. పైగా ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌ కూడా రాహులే.

కాగా జట్టులో ఇషాన్ కిషన్ రూపంలో స్పెషలిస్ట్ కీపర్ ఉన్నాప్పటికీ, కేఎల్‌ రాహుల్‌తో ఎందుక కీపింగ్‌ చేయిస్తున్నారని కొందరు క్రికెట్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇది టీ 20 కాదని, వన్డేల్లో స్పెషలిస్ట్‌ కీపర్లు అవసరమని అభిప్రాయపడుతున్నారు. ఇందుకు ఇషాన్‌ కిషాన్‌ మంచి ఛాయిస్‌అంటూ పోస్టులు షేర్‌ చేస్తున్నారు. ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. 40 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్‌ 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. మార్ష్‌ (4), వార్నర్‌ (52), స్మిత్‌ (41), లబుషేన్‌ (39), గ్రీన్‌ (30) పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో జోష్‌ ఇంగ్లిష్‌ (13), మార్కస్ స్టొయినిస్‌ (0) ఉన్నారు. టీమిండియా బౌలర్లలో షమీ 2 వికెట్లు తీసుకోగా, జడేజా, అశ్విన్‌ తలా ఒక వికెట్ పడగొట్టారు.

ఇవి కూడా చదవండి

భారత్ ప్లేయింగ్-XI:

శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ.

ఆస్ట్రేలియాప్లేయింగ్-XI:

పాట్ కమ్మిన్స్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, కామెరాన్ గ్రీన్, జోష్ ఇంగ్లిస్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ షార్ట్, షాన్ అబాట్ ,  ఆడమ్ జంపా.

కేఎల్ రాహుల్ కీపింగ్ పై విమర్శలు..

క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..