‘పాక్‌కు అంత సీన్ లేదు.. ఆ నాలుగు జట్లే ప్రపంచకప్‌లో సెమీస్ చేరేవి’..
ప్రపంచకప్ దగ్గర పడుతుండటంతో.. ఇప్పటికే మాజీ క్రికెటర్లు ఈ మెగా టోర్నమెంట్ సెమీస్‌కు ఏయే జట్లు చేరుతాయో జోస్యం చెబుతున్నారు. అటు అభిమానులు సైతం.. సెమీస్ చేరేవి ఈ జట్లేనంటూ ప్రిడిక్షన్లు మొదలెట్టేశారు. మొన్నటికి మొన్న కుమార సంగక్కర ప్రపంచకప్ విజేత భారత్ లేదా ఇంగ్లాండ్ అని చెబితే..
మరో వారం రోజుల్లో వన్డే ప్రపంచకప్ మొదలుకానుంది. భారత్ వేదికగా 10 జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. అక్టోబర్ 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నమెంట్‌లో మొదటి మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరగనుంది ఇక ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19న జరుగుతుంది.
ఇదిలా ఉంటే.. ప్రపంచకప్ దగ్గర పడుతుండటంతో.. ఇప్పటికే మాజీ క్రికెటర్లు ఈ మెగా టోర్నమెంట్ సెమీస్‌కు ఏయే జట్లు చేరుతాయో జోస్యం చెబుతున్నారు. అటు అభిమానులు సైతం.. సెమీస్ చేరేవి ఈ జట్లేనంటూ ప్రిడిక్షన్లు మొదలెట్టేశారు. మొన్నటికి మొన్న శ్రీలంక దిగ్గజ క్రికెటర్ కుమార సంగక్కర ప్రపంచకప్ విజేత భారత్ లేదా ఇంగ్లాండ్ అని చెబితే.. ఇప్పుడు భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ వన్డే ప్రపంచకప్ సెమీస్‌కు చేరేవి ఈ జట్లేనంటూ తన ప్రిడిక్షన్ చెప్పాడు. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లకు అయితే తిరుగుండదని భజ్జీ స్పష్టం చేశాడు.
మరికొందరు మాజీ క్రికెటర్లు కూడా భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లే వన్డే వరల్డ్‌కప్‌కు హాట్ ఫేవరెట్స్ అని అంటున్నారు. పాకిస్తాన్, సౌతాఫ్రికాకు ఛాన్స్ ఉన్నా.. ఈ రెండు జట్లు సెమీస్ చేరడం కష్టం కావొచ్చునని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. అటు ఆసియా కప్ ముందు వరకు పాకిస్తాన్ జట్టు కూడా ఫేవరెట్‌గా ఉంటే.. ఆ టోర్నీ తర్వాత అంచనాలు అన్నీ తలక్రిందులు అయ్యాయి. మరోవైపు శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు ఎప్పుడు గెలుస్తాయో.. ఎప్పుడు ఓడిపోతాయో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఇక చిన్న జట్లైన నెదర్లాండ్స్, ఆఫ్గనిస్తాన్ జట్లపై ఎలాంటి అంచనాలు లేవు. కానీ కొన్ని పెద్ద జట్ల అవకాశాలను మాత్రం ఇవి నీరుగార్చే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు.
అటు వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా జట్టును బీసీసీఐ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇంకా ఫైనల్ స్క్వాడ్‌కు మరో మూడు రోజులు టైం ఉండటంతో.. అశ్విన్ కూడా ప్రపంచకప్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
వన్డే వరల్డ్ కప్‌కు భారత జట్టు ఇదే:
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కెఎల్ రాహుల్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), హార్ధిక్ పాండ్యా(వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ
Here’s the #TeamIndia squad for the ICC Men’s Cricket World Cup 2023 🙌#CWC23 pic.twitter.com/EX7Njg2Tcv
— BCCI (@BCCI) September 5, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..