Border Gavaskar Trophy: రేయ్ ఎవర్రా మీరంతా! MCG లో ఆకతాయిల చిల్లర పని..
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో ఆకతాయిల చర్య కలకలం రేపింది. మైదానంలోకి కండోమ్ బెలూన్ ఆడుతూ పాడుతూ వెళ్లి ప్రేక్షకులను నవ్వుల పాలు చేసింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. తెలుగు తేజం తన అద్భుత అర్ధ శతకం పూర్తిచేసుకున్నాడు. భారత్ ఫాలో-ఆన్‌ను తప్పించుకొని 126 పరుగుల వెనుకంజలో ఉంది.

భారత్-ఆస్ట్రేలియా నాలుగో టెస్ట్ మెల్‌బోర్న్ స్టేడియంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఆటను తిలకించడానికి వచ్చిన అభిమానుల్లో కొందరు ఆకతాయిలు కండోమ్ బెలూన్‌ను గాల్లోకి వదిలారు. అది మైదానంలోకి వెళ్లకుండా గ్యాలరీలోనే చక్కర్లు కొట్టడం ఆటకు అంతరాయం కలిగించకపోయినా, అభిమానుల్లో నవ్వులు పూయించింది. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది, నెటిజన్లు రకరకాల ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.
“భారత బ్యాటర్ల కంటే బెలూన్ ఎక్కువ సమయం గాల్లో ఉంది,” అంటూ ఒక నెటిజన్ సెటైర్ వేస్తే, కొందరు అభిమానులు డ్యూరెక్స్ కంపెనీకి ట్యాగ్ చేసి వవ్వులు పూయిస్తున్నారు.
మ్యాచ్ పరంగా చూస్తే, మెల్‌బోర్న్‌లో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో, భారత్ 244/7 స్కోర్‌తో లంచ్ విరామానికి చేరుకుంది. ఆస్ట్రేలియాకు ఇంకా 230 పరుగుల ఆధిక్యం ఉంది. నితీష్ కుమార్ రెడ్డి 87 పరుగుల వద్ద, వాషింగ్టన్ సుందర్ 40 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్ ఫాలో-ఆన్‌ను తప్పించుకొని 146 పరుగుల వెనుకంజలో ఉంది.
Indian fans are busy watching whether the condom balloon will burst
Well played @durex#AUSvIND #MelbourneTest #Condom pic.twitter.com/iTlB0FHmQy
— Kartik Kannan (@kartik_kannan) December 27, 2024



