IND vs AUS: ప్రపంచకప్‌కు ముందు పరేషాన్‌.. మూడో వన్డేలో తేలిపోయిన టీమిండియా బౌలర్లు.. సెంచరీ దాటేసిన స్పిన్నర్లు

రాజ్‌కోట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు తేలిపోయారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా ఆరంభం నుంచే దూకుడుగా బ్యాటింగ్‌ చేసింది. దీనికి తోడు భారత బౌలర్లు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. చివరకు ప్రపంచకప్‌లో ఎన్నో ఆశలు పెట్టుకున్న స్పిన్నర్లు కూడా పూర్తిగా చేతులెత్తేశారు. రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌, కుల్దీప్‌ యాదవ్‌ ముగ్గురు కలిపి ఏకంగా

IND vs AUS: ప్రపంచకప్‌కు ముందు పరేషాన్‌.. మూడో వన్డేలో తేలిపోయిన టీమిండియా బౌలర్లు.. సెంచరీ దాటేసిన స్పిన్నర్లు
India Vs Australia

Updated on: Sep 27, 2023 | 7:36 PM

రాజ్‌కోట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు తేలిపోయారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా ఆరంభం నుంచే దూకుడుగా బ్యాటింగ్‌ చేసింది. దీనికి తోడు భారత బౌలర్లు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. చివరకు ప్రపంచకప్‌లో ఎన్నో ఆశలు పెట్టుకున్న స్పిన్నర్లు కూడా పూర్తిగా చేతులెత్తేశారు. రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌, కుల్దీప్‌ యాదవ్‌ ముగ్గురు కలిపి ఏకంగా 157 పరుగులు సమర్పించుకున్నారు. అదికూడా 26 ఓవర్లలోనే. కుల్‌ దీప్‌ 2 వికెట్లు తీయగా, జడేజా, సుందర్‌లకు ఒక్క వికెట్ కూడా దక్కలేదు. ఇక స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లు కూడా పడగొట్టినప్పటికీ 10 ఓవర్లలో 81 పరుగులు ఇవ్వడం గమనార్హం.
ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు ఇదే ఆఖరి మ్యాచ్‌. అయితే స్పిన్నర్లతో సహా టీమిండియా బౌలర్లందరూ భారీగా పరుగులు సమర్పించుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 352 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా రవిచంద్రన్ అశ్విన్‌ ఆడలేదు. అతనికి వాషింగ్టన్‌ సుందర్‌ జట్టులోకి వచ్చాడు. అతనితో పాటు జడేజా, కుల్దీప్ యాదవ్ బంతిని పంచుకున్నారు. అయితే ఎవ్వరూ ప్రభావం చూపలేకపోయారు. జడేజా 61 పరుగులు, వాషింగ్టన్ 48 పరుగులు ఇవ్వగా, ఇద్దరికీ ఒక్క వికెట్ కూడా దక్కలేదు, కుల్దీప్ యాదవ్ కూడా 48 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. ఇక ఆసియా కప్ స్టార్‌ మహ్మద్ సిరాజ్ 9 ఓవర్లలో 68 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. అలాగే ప్రసిద్ధ్ కృష్ణ 5 ఓవర్లలో 45 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు.

కాగా ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొలి 10 ఓవర్లలో 90 పరుగులు చేయగా, 27వ ఓవర్లో స్కోరు 200 దాటింది. అయితే చివరి 20 ఓవర్లలో టీమ్ ఇండియా బౌలర్లు కాస్త కట్టుదిట్టంగా బంతులేశారు. దీంతో 370 దాటుతుందనన స్కోరు 350 వద్ద మాత్రమే ఆగిపోయింది. చివరి 10 ఓవర్లలో టీమిండియా బౌలర్లు కేవలం 70 పరుగులు మాత్రమే ఇచ్చారు. రాజ్‌కోట్‌ మైదానంలో జరిగిన వన్డేల్లో ఇదే అత్యధిక స్కోరు. అంతకుముందు ఆస్ట్రేలియాపై భారత్ 340 పరుగుల స్కోరు చేసింది. ఒక వేళ ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే మరో చరిత్ర సృష్టించనట్లే. ఇక 353 పరుగుల లక్ష్య ఛేదనలో కడపటి వార్తలందే సమయానికి టీమిండియా వికెట్‌ నష్టానికి 133 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (74), విరాట్‌ కోహ్లీ (34) ధాటిగా ఆడుతున్నారు.

ఇవి కూడా చదవండి

నిరాశపర్చిన బుమ్రా, సిరాజ్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..