IND vs AUS: ఇండోర్ టెస్ట్‌లోనూ ‘రవీంద్ర’జాలం.. భారీ రికార్డుకు ఒక్కడుగు దూరంలో.. అదేంటంటే?

IND vs AUS 3rd Test: ఇండోర్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న మూడో మ్యాచ్‌లో రవీంద్ర జడేజా ప్రత్యేక రికార్డు సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాడు.

IND vs AUS: ఇండోర్ టెస్ట్‌లోనూ 'రవీంద్ర'జాలం.. భారీ రికార్డుకు ఒక్కడుగు దూరంలో.. అదేంటంటే?
Ravindra Jadeja
Follow us
Venkata Chari

|

Updated on: Feb 28, 2023 | 8:06 PM

Indore Test, Ravindra Jadeja: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్‌లో మూడో మ్యాచ్ ఇండోర్‌లో జరగనుంది. ఈ మ్యాచ్ మార్చి 1 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా భారీ రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమయ్యాడు. కేవలం ఒక వికెట్ తీస్తే.. అతిపెద్ద రికార్డును సృష్టించి, ఈ ఘనత సాధించిన రెండో భారత ఆటగాడిగా నిలుస్తాడు. నిజానికి జడేజా తన అంతర్జాతీయ కెరీర్‌లో ఇప్పటివరకు మొత్తం 499 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో ఇప్పటివరకు మొత్తం 5523 పరుగులు కూడా చేశాడు.

ఇండోర్‌లో జరగనున్న మూడో టెస్టు మ్యాచ్‌లో జడేజా ఒక వికెట్ తీయడంతో.. బ్యాటింగ్‌లో 5000 పరుగులు, బౌలింగ్‌లో 500 వికెట్లు సాధించిన రెండో భారత ఆటగాడిగా నిలుస్తాడు. బ్యాటింగ్‌లో ఇప్పటికే 5000 పరుగులు దాటేశాడు. ఇక బౌలింగ్‌లో ఇప్పటి వరకు మొత్తం 499 వికెట్లు తీశాడు. దీంతో ఇండోర్‌లో ఒక్క వికెట్ పడగొడితే భారీ రికార్డ్ సొంతం కానుంది. ఈ ఘనత సాధించిన తొలి భారత ఆటగాడిగా కపిల్ దేవ్ నిలిచాడు. అతను తన అంతర్జాతీయ కెరీర్‌లో బ్యాటింగ్ చేస్తూ మొత్తం 9031 పరుగులు పూర్తి చేశాడు. బౌలింగ్‌లో మొత్తం 687 వికెట్లు పడగొట్టాడు.

అద్భుతమైన ఫామ్‌లో జడేజా..

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో, రవీంద్ర జడేజా ఇప్పటివరకు అద్భుతమైన ఫామ్‌లో కనిపించాడు. రెండు టెస్ట్ మ్యాచ్‌లలో 11.24 సగటుతో 17 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో, బ్యాటింగ్‌లో 48 సగటుతో మొత్తం 96 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా జడేజా నిలిచాడు.

ఇవి కూడా చదవండి

ఇంటర్నేషనల్ కెరీర్..

జడేజా తన అంతర్జాతీయ కెరీర్‌లో ఇప్పటివరకు మొత్తం 62 టెస్టులు, 171 వన్డేలు, 64 టీ20 ఇంటర్నేషనల్‌లు ఆడాడు. ఇందులో అతను 36.88 సగటుతో 2619 పరుగులు, 32.62 సగటుతో 2447 పరుగులు, 24.05 సగటుతో 457 పరుగులు చేశాడు. ఇందులో 175* జడేజా కెరీర్‌లో అత్యధిక స్కోరుగా నిలిచింది. ఇది కాకుండా బౌలింగ్‌లో టెస్టుల్లో 259, వన్డేల్లో 189, టీ20 ఇంటర్నేషనల్స్‌లో మొత్తం 51 వికెట్లు పడగొట్టాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ