AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వైజాగ్‌లో అభిమానికి షాకిచ్చిన రోహిత్ శర్మ.. గులాబీతో మ్యారేజ్ ప్రపోజల్.. వైరల్ వీడియో..

Rohit Sharma Viral Video: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫన్నీ వీడియో వైరల్ అవుతోంది. తన అభిమానిలో ఒకరికి గులాబీని ఇచ్చి పెళ్లికి ప్రపోజ్ చేశాడు.

Viral Video: వైజాగ్‌లో అభిమానికి షాకిచ్చిన రోహిత్ శర్మ.. గులాబీతో మ్యారేజ్ ప్రపోజల్.. వైరల్ వీడియో..
Rohit Sharma Viral Video
Venkata Chari
|

Updated on: Mar 19, 2023 | 3:33 PM

Share

Rohit Sharma Viral Video: భారత్-ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్‌లో రెండో మ్యాచ్ విశాఖపట్నంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. రెండో వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి టీమిండియాలోకి వచ్చాడు. వ్యక్తిగత కారణాల వల్ల ముంబైలో జరిగిన తొలి మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ ఆడలేకపోయాడు. అయితే, రోహిత్ శర్మకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ అభిమానికి గులాబీ పువ్వు ఇచ్చి పెళ్లికి ప్రపోజ్ చేస్తున్నట్లు చూడొచ్చు.

అభిమానికి ప్రపోజ్ చేసిన రోహిత్..

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో, రోహిత్‌ ఓ అభిమానికి ప్రపోజ్ చేశాడు. ఈ వీడియో విమానాశ్రయానికి సంబంధించినది. రోహిత్ శర్మతోపాటు క్రికెటర్లు విశాఖ చేరుకున్న సమయంలో కొంతమంది అభిమానులు కలవడానికి అక్కడికి చేరుకున్నారు. రోహిత్ శర్మ చేతిలో గులాబీ పువ్వు ఉంది. ఇంతలో, హిట్‌మాన్ ఒక అభిమానికి గులాబీని ఇచ్చి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. రోహిత్‌కి సంబంధించిన ఈ వీడియోను ఇప్పటి వరకు వేల మంది లైక్ చేశారు.

ఇవి కూడా చదవండి

పీకల్లోతు కష్టాల్లో టీమిండియా..

విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లో రెండో మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్ 19.3 ఓవర్లలో ఏడు వికెట్లకు 91 పరుగులు చేసింది. అక్షర్ పటేల్ క్రీజులో ఉన్నాడు.

రవీంద్ర జడేజా 16 పరుగుల వద్ద నాథన్ ఎల్లిస్‌కు బలయ్యాడు. వికెట్ కీపర్ అలెక్స్ కారీ చేతికి చిక్కాడు. ఎల్లిస్‌కు రెండో వికెట్‌ లభించింది. అతను విరాట్ కోహ్లీ (31 పరుగులు)కి ఎల్‌బీడబ్ల్యూ చేశాడు. హార్దిక్ పాండ్యా ఒక్క పరుగు చేసి ఔటయ్యాడు. షాన్ అబాట్ వేసిన బంతికి స్లిప్‌లో కెప్టెన్ స్టీవ్ స్మిత్ అద్భుత క్యాచ్ అందుకున్నాడు.

ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. అతను శుభ్‌మన్ గిల్ (0), కెప్టెన్ రోహిత్ శర్మ (13), సూర్యకుమార్ యాదవ్ (0), కేఎల్ రాహుల్ (9 పరుగులు) వికెట్లు తీశాడు.

కంగారూలతో వన్డేల్లో తొలిసారిగా రోహిత్ శర్మ భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. సిరీస్‌లో భారత జట్టు 1-0తో ముందంజలో నిలిచిన సంగతి తెలిసిందే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..