AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS: ఆసీస్‌ పేసర్ల ధాటికి కుప్పకూలిన భారత్‌.. ఆస్ట్రేలియా టార్గెట్ 118..

తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 26 ఓవర్లలోనే 117 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఆస్ట్రేలియా ముందు 118 పరుగుల టార్గెట్‌ను ఉంచింది.

IND vs AUS: ఆసీస్‌ పేసర్ల ధాటికి కుప్పకూలిన భారత్‌.. ఆస్ట్రేలియా టార్గెట్ 118..
Ind Vs Aus 2nd Odi Vizag
Venkata Chari
|

Updated on: Mar 19, 2023 | 4:02 PM

Share

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డే సిరీస్‌లో భారత జట్టు 117 పరుగులకు ఆలౌటైంది. కంగారూలపై సొంతగడ్డపై టీమిండియా సాధించిన అతిచిన్న స్కోరు ఇదే కావడం గమనార్హం. అక్షర్ పటేల్ 29 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. చివరి వికెట్ గా మహ్మద్ సిరాజ్ (0) ఔటయ్యాడు.

విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేడియంలో టాస్ ఓడిన భారత జట్టులో విరాట్ కోహ్లీ అత్యధికంగా 31 పరుగులు చేశాడు. మిగతా బ్యాట్స్‌మెన్‌లు ప్రత్యేకంగా రాణించలేకపోయారు. జట్టులోని నలుగురు బ్యాట్స్‌మెన్స్ ఖాతా కూడా తెరవలేకపోయారు. కెప్టెన్ రోహిత్ శర్మ 13, రవీంద్ర జడేజా 16 పరుగులు చేశారు.

ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ కంగారూల నుంచి అత్యధికంగా 5 వికెట్లు పడగొట్టాడు. సీన్ అబాట్ మూడు వికెట్లు, నాథన్ ఎల్లిస్ రెండు వికెట్లు తీశారు.

ఇవి కూడా చదవండి

భారత ప్లేయింగ్ ఎలెవన్..

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ , మహ్మద్ షమీ.

ఆస్ట్రేలియా ప్లేయింగ్ ఎలెవన్..

ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లాబుషాగ్నే, అలెక్స్ కారీ (కీపర్), కామెరాన్ గ్రీన్, మార్కస్ స్టోయినిస్, సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..