ఐపీఎల్ 2016లో మరోసారి గుజరాత్ లయన్స్‌పై చెలరేగిపోయాడు. 158 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ ఆరంభంలోనే క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ వికెట్లను కోల్పోయింది. తరువాత, తుఫాను బ్యాటింగ్ మొదలుపెట్టిన డివిలియర్స్ 47 బంతుల్లో 79 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు బాదాడు.