IND vs AUS: ఇలా కదా ఆడాల్సింది.. 6 ఏళ్ల పెర్త్‌లో ఇచ్చిపడేసిన భారత్.. కట్‌చేస్తే.. 136 ఏళ్ల రికార్డ్ బ్రేక్

India beat Australia in Perth Test: పెర్త్ టెస్టులో భారత్ విజయం సాధించింది. దీంతో 5 టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఆస్ట్రేలియాకు భారత్ నిర్దేశించిన 534 పరుగుల లక్ష్యాన్ని సాధించలేకపోయింది.

IND vs AUS: ఇలా కదా ఆడాల్సింది.. 6 ఏళ్ల పెర్త్‌లో ఇచ్చిపడేసిన భారత్.. కట్‌చేస్తే.. 136 ఏళ్ల రికార్డ్ బ్రేక్
Ind Vs Aus 1st Test
Follow us
Venkata Chari

|

Updated on: Nov 25, 2024 | 1:59 PM

IND vs AUS: పెర్త్ టెస్టులో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించిన భారత్.. సరికొత్త చరిత్ర నెలకొల్పింది. అందరి అంచనాలను మించి పెర్త్‌లో టీమిండియా ఈ అద్భుతం చేసింది. ఆస్ట్రేలియాపై విజయంతో భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పెర్త్ టెస్టులో భారత్ 295 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. ఇది విదేశాల్లో అతిపెద్ద విజయంగా నమోదైంది. 5 టెస్టుల సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో గెలిచిన టీమ్ ఇండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది.

పెర్త్‌లో ప్రతీకారం తీర్చుకున్న భారత్..

పెర్త్ టెస్టులో భారత్ విజయం సాధించేందుకు ఆస్ట్రేలియాకు 534 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కానీ, ఊహించినట్లుగానే భారత్ అందించిన టార్గ్‌ట్‌ను అధిరోహించడంలో విఫలమైంది. ఇందులో భారత్ ఫాస్ట్ బౌలింగ్ పాత్ర నిర్ణయాత్మకమైంది. కెప్టెన్ బుమ్రా నేతృత్వంలోని భారత పేస్ అటాక్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్స్‌ను చిత్తు చేసింది. దీని ప్రభావంతో పెర్త్‌లో భారత్ భారీ విజయం సాధించింది. అలాగే, ప్రతీకారం కూడా పూర్తయింది.

2018లో ఓటమి.. 2024లో ప్రతీకారం..

ఈ పగ ఏమిటని ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారా? పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో జరిగిన చివరి మ్యాచ్‌కు అనుసంధానించబడి ఉందన్నమాట. ఆప్టస్ స్టేడియంలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య చివరి మ్యాచ్ 2018 సంవత్సరంలో జరిగింది. ఇది ఈ మైదానంలో ఆడిన మొదటి టెస్ట్. ఆ టెస్టులో భారత్‌పై ఆస్ట్రేలియా 146 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.

ఇవి కూడా చదవండి

6 ఏళ్ల తర్వాత పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియాలు మళ్లీ ముఖాముఖి తలపడ్డాయి. ఈసారి భారత్ తొలి ఎన్‌కౌంటర్‌లో ఆస్ట్రేలియాను దాదాపు రెట్టింపు తేడాతో ఓడించి, విదేశాల్లో తన అతిపెద్ద టెస్ట్ విజయానికి స్క్రిప్ట్‌ను కూడా రాసింది. పెర్త్ టెస్టులో భారత్ 295 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది.

బద్దలైన 136 ఏళ్ల రికార్డు..

పెర్త్ టెస్టులో ఆస్ట్రేలియాకు 534 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దానిని ఛేదించడంలో కేవలం 29 పరుగులకే తమ టాప్ 4 వికెట్లను కోల్పోయింది. ఫలితంగా ఈ 136 ఏళ్ల రికార్డు బద్దలైంది. అంతకుముందు, 1888లో మాంచెస్టర్‌లో జరిగిన టెస్టులో ఆస్ట్రేలియా టాప్ బ్యాట్స్‌మెన్‌లలో నలుగురు 38 పరుగులకే అవుట్ అయ్యారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..