AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AFG: భారత్‌తో టీ20 సిరీస్‌.. అఫ్గాన్‌ టీమ్‌ ఇదే.. జట్టులో రషీద్‌ ఖాన్‌కు స్థానం.. కానీ..

జనవరి 11 నుంచి భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. సిరీస్ ప్రారంభానికి ఐదు రోజుల ముందు ఆఫ్ఘనిస్థాన్ శనివారం ( 19 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్ టీమ్ టీ20 సిరీస్ కోసం తొలిసారిగా భారత్‌కు రానుండగా, ఆ జట్టు కెప్టెన్సీ బాధ్యతలను ఇబ్రహీం జద్రాన్ కు అప్పగించారు

IND vs AFG: భారత్‌తో టీ20 సిరీస్‌.. అఫ్గాన్‌ టీమ్‌ ఇదే.. జట్టులో రషీద్‌ ఖాన్‌కు స్థానం.. కానీ..
Ind Vs Afg T20 Series
Basha Shek
|

Updated on: Jan 06, 2024 | 7:50 PM

Share

జనవరి 11 నుంచి భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. సిరీస్ ప్రారంభానికి ఐదు రోజుల ముందు ఆఫ్ఘనిస్థాన్ శనివారం ( 19 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్ టీమ్ టీ20 సిరీస్ కోసం తొలిసారిగా భారత్‌కు రానుండగా, ఆ జట్టు కెప్టెన్సీ బాధ్యతలను ఇబ్రహీం జద్రాన్ కు అప్పగించారు. టీ20 ప్రపంచకప్ 2024 ఈ ఏడాది జూన్‌లో జరగనున్నందున ఈ సిరీస్ రెండు జట్లకు చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా టీ20 ప్రపంచకప్‌కు ముందు టీమిండియా సన్నద్ధత కోసం ఇదే చివరి టీ20 సిరీస్‌ కావడంతో ఈ సిరీస్‌ను టీమ్‌ఇండియా సీరియస్‌గా తీసుకుంది. ఈ సిరీస్‌కు టీమ్‌ఇండియాను ప్రకటించనప్పటికీ, బీసీసీఐ ఈరోజు జట్టును ప్రకటించే అవకాశం ఉంది. భారత్‌తో జరిగే టీ20 సిరీస్‌కు అఫ్గానిస్థాన్ రెగ్యులర్ టీ20 కెప్టెన్ రషీద్ ఖాన్ జట్టులోకి ఎంపికయ్యాడు. కానీ అతను సిరీస్‌లోని మూడు మ్యాచ్‌ల్లోనూ ఆడడం అనుమానమే. వాస్తవానికి, రషీద్ ఇటీవల వెన్నులో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ప్రస్తుతం దీని నుంచి క్రమంగా కోలుకుంటున్నాడు. షార్జాలో యూఏఈపై 2-1తో అఫ్ఘానిస్థాన్‌ను గెలిపించిన ఇబ్రహీం జద్రాన్ భారత్‌తో సిరీస్‌కు ఆఫ్ఘనిస్థాన్‌కు నాయకత్వం వహించనున్నాడు. ఇక స్టార్ స్పిన్నర్‌ ముజీబ్ ఉర్ రెహమాన్ మళ్లీ జట్టులోకి వచ్చాడు.

త్వరలోనే టీమిండియా సెలెక్షన్..

మరోవైపు ఆఫ్గాన్‌తో టీ 20 సిరీస్‌కు త్వరలోనే టీమిండియా జట్టును ప్రకటించనుంది బీసీసీఐ. కెప్టెన్‌గా మళ్లీ రోహిత్‌ శర్మనే ఎంపిక చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. హార్దిక్‌, సూర్యకుమార్‌ యాదవ్‌లు గాయాల బారిన పడడంతో హిట్‌ మ్యాన్‌కే మళ్లీ భారత జట్టు పగ్గాలు అప్పగించనున్నారని తెలుస్తోంది. విరాట్ కోహ్లీ కూడా పొట్టి ఫార్మాట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు.

ఇవి కూడా చదవండి

భారత్‌తో టీ20 సిరీస్‌కు ఆఫ్ఘనిస్థాన్ జట్టు:

బ్రహీం జద్రాన్‌ (కెప్టెన్‌), రెహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్‌ కీపర్‌)‌, ఇబ్రహీం అలిఖిల్‌ (వికెట్‌ కీపర్‌), హజ్రతుల్లా జజాయ్‌, రెహ్మత్‌ షా, నజీబుల్లా జద్రాన్‌, మహ్మద్‌ నబీ, కరిమ్‌ జనా, అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌, సహ్రఫుద్దీన్‌ అష్రఫ్‌, ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌, ఫజల్‌ హక్‌ ఫరూఖీ, ఫరీద్‌ అహ్మద్‌, నవీన్‌ ఉల్‌ హక్‌, నూర్‌ అహ్మద్‌, మహ్మద్‌ సలీమ్‌, ఖాయిస్‌ అహ్మద్‌, గుల్బాదిన్‌ నయీబ్‌, రషీద్‌ ఖాన్‌

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..