ఊహకందని ఊచకోత.. 30 బంతుల్లో సెంచరీ.. 13 ఫోర్లు, 17 సిక్సులతో 175 పరుగులు.. పేరు వింటేనే బౌలర్ల గుండెల్లో దడ

Chris Gayle 175 Runs: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కరీబియన్ దిగ్గజం క్రిస్ గేల్ ఎన్నో మరపురాని ఇన్నింగ్స్‌లు ఆడాడు. 11 ఏళ్ల క్రితం ఇదే రోజున బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో గేల్ చరిత్ర సృష్టించాడు. గేల్ కేవలం 30 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. టీ20 క్రికెట్ చరిత్రలో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ.

ఊహకందని ఊచకోత.. 30 బంతుల్లో సెంచరీ.. 13 ఫోర్లు, 17  సిక్సులతో 175 పరుగులు.. పేరు వింటేనే బౌలర్ల గుండెల్లో దడ
Chris Gayle
Follow us
Venkata Chari

|

Updated on: Apr 23, 2024 | 2:12 PM

Chris Gayle 175 Runs: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో ఏప్రిల్ 23 చాలా ప్రత్యేకమైన రోజు. 11 ఏళ్ల క్రితం అంటే 2013లో ఇదే రోజున కరేబియన్ దిగ్గజం క్రిస్ గేల్ చరిత్ర సృష్టించాడు. బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో గేల్ ఊహకందని తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. గేల్ ఆనాటి రికార్డు ఇప్పటికీ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లకు కూడా చేరుకోలేనిదిగా మారింది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరపున ఆడుతున్న క్రిస్ గేల్ పూణె వారియర్స్ (PWI)పై కేవలం 66 బంతుల్లో అజేయంగా 175 పరుగులు చేశాడు. ఈ సమయంలో, గేల్ 13 ఫోర్లు, 17 సిక్సర్లు కొట్టాడు. అతని స్ట్రైక్ రేట్ 265.15గా నిలిచింది. టీ20 క్రికెట్‌లో ఏ బ్యాట్స్‌మెన్‌కైనా ఇదే అతిపెద్ద ఇన్నింగ్స్. ఈ సమయంలో, క్రిస్ గేల్ తన సెంచరీని కేవలం 30 బంతుల్లో పూర్తి చేశాడు. టీ20 క్రికెట్ చరిత్రలో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. గేల్ ఈ రెండు రికార్డులు ఇప్పటికీ చెక్కుచెదరలేదు.

ఈ తుఫాన్ ఇన్నింగ్స్‌తో బ్రెండన్ మెకల్లమ్ రికార్డును కూడా క్రిస్ గేల్ బద్దలు కొట్టాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తరపున ఆడుతున్నప్పుడు 2008లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుపై 73 బంతుల్లో 158 పరుగులు చేసిన బ్రెండన్ మెకల్లమ్ పేరిట ఐపీఎల్‌లో అత్యధిక స్కోరు రికార్డు ఉంది.

ఇవి కూడా చదవండి

T-20 క్రికెట్‌లో భారీ ఇన్నింగ్స్..

175* పరుగులు- క్రిస్ గేల్ vs పూణే వారియర్స్, బెంగళూరు, 2013

172* పరుగులు- ఆరోన్ ఫించ్ vs జింబాబ్వే, హరారే, 2018

162* పరుగులు- హామిల్టన్ మసకద్జా vs ఈగిల్స్, బులవాయో

162 పరుగులు vs ఐర్లాండ్, డెహ్రాడూన్, 2019

162 పరుగులు- డెవాల్డ్ బ్రీవిస్ vs నైట్స్, పోచెఫ్‌స్ట్రూమ్, 2022

టీ20 క్రికెట్‌లో వేగవంతమైన సెంచరీ..

30 బంతుల్లో క్రిస్ గేల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs పూణే వారియర్స్, 2013

32 బంతుల్లో రిషబ్ పంత్ ఢిల్లీ vs హిమాచల్ ప్రదేశ్, 2018

33 బంతులు విహాన్ లుబ్బే నార్త్ వెస్ట్ vs లింపోపో, 2018

33 బంతుల్లో జాన్ నికోల్ లోఫ్ట్

40 బంతులు ఆండ్రూ సైమండ్స్ కెంట్ vs మిడిల్‌సెక్స్, 2004

34 బంతులు సీన్ అబాట్ సర్రే vs కెంట్, 2023

34 బంతులు కుశాల్ మల్లా నేపాల్ vs మంగోలియా, 2023

ఆ చారిత్రాత్మక మ్యాచ్‌లో పుణె వారియర్స్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. కానీ ఓపెనర్ కు వచ్చిన క్రిస్ గేల్.. ఫించ్ నిర్ణయాన్ని పూర్తిగా తప్పు అని నిరూపించాడు. గేల్ తుఫాన్ బ్యాటింగ్ ముందు పుణె బౌలర్లంతా లొంగిపోయారు. 20 ఓవర్ల గేమ్ సమయంలో, క్రిస్ గేల్ 9వ ఓవర్లోనే సెంచరీ పూర్తి చేశాడు. గేల్ 11 సిక్సర్లు, 8 ఫోర్లతో 100 పరుగులు పూర్తి చేశాడు. అంతకుముందు ఎనిమిదో ఓవర్లో గేల్ నాలుగు సిక్సర్లు, ఒక ఫోర్ బాది 28 పరుగులు చేశాడు.

175 పరుగులతో క్రిస్ గేల్ డేంజరస్ ఇన్నింగ్స్ కారణంగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐదు వికెట్లకు 263 పరుగులు చేసింది. పూణే వారియర్స్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 133 పరుగులు మాత్రమే చేసి 130 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. బ్యాటింగ్ చేసిన గేల్ కూడా బంతితో విధ్వంసం సృష్టించి రెండు వికెట్లు పడగొట్టాడు. అతను ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా ఎంపికయ్యాడు.

T20 క్రికెట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు..

18- క్రిస్ గేల్ vs ఢాకా డైనమైట్స్, మీర్పూర్, 2017

17- క్రిస్ గేల్ vs పూణే వారియర్స్, బెంగళూరు, 2013

17- పునీత్ బిష్త్ vs మిజోరం, చెన్నై, 2021

17- గ్రాహంస్ నేపియర్ vs 2020

16- దాసున్ షనక vs సారాసెన్స్, కొలంబో, 2016

16- హజ్రతుల్లా జజాయ్ vs ఐర్లాండ్, డెహ్రాడూన్, 2019

16- ఫిన్ అలెన్ vs పాకిస్థాన్, డునెడిన్, 2024

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..