అప్పుడు టీమిండియాను భయపెట్టారు.. ఇప్పుడు ఇద్దరూ కలిసి 72 బంతుల్లో 114 పరుగులు బాదేశారు.. వారెవరంటే?

దుబాయ్‌లో జరుగుతోన్న ఇంటర్నేషనల్ లీగ్ టీ20 టోర్నమెంట్‌లో అద్బుతాలు చోటు చేసుకున్నాయి. ఆదివారం ముంబై ఎమిరేట్స్‌తో..

అప్పుడు టీమిండియాను భయపెట్టారు.. ఇప్పుడు ఇద్దరూ కలిసి 72 బంతుల్లో 114 పరుగులు బాదేశారు.. వారెవరంటే?
Shanaka & Raza
Follow us

|

Updated on: Feb 06, 2023 | 2:03 PM

దుబాయ్‌లో జరుగుతోన్న ఇంటర్నేషనల్ లీగ్ టీ20 టోర్నమెంట్‌లో అద్బుతాలు చోటు చేసుకున్నాయి. ఆదివారం ముంబై ఎమిరేట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దుబాయ్ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. దసున్ షనక(58), సికిందర్ రాజా(56) చక్కటి భాగస్వామ్యంతో తమ జట్టుకు ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచారు.

ఈ మ్యాచ్‌లో దుబాయ్ క్యాపిటల్స్ తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముంబై ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. వసీమ్(31), పూరన్(43), మౌస్లీ(31) ఫర్వాలేదనిపించారు. ఇక క్యాపిటల్స్ బౌలర్లలో బాల్ 3 వికెట్లు, జంపా 2 వికెట్లు, రాజా ఒక వికెట్ తీశారు.

అటు 165 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన దుబాయ్ క్యాపిటల్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. 44 పరుగులకే కీలకమైన 3 వికెట్లు కోల్పోయింది. అయితే మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు దసున్ షనక(58), సికిందర్ రాజా(56) అర్ధ సెంచరీలతో తమ జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించారు. షనక 36 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 58 పరుగులు చేయగా, రాజా 36 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 56 పరుగులు చేశాడు. వీరిరువురూ 4 వికెట్‌కు 122 పరుగులు జోడించారు. అటు ఎమిరేట్స్ బౌలర్లలో జహీర్ ఖాన్ 2 వికెట్లు, ఓవర్టన్ ఒక వికెట్ తీశాడు.