WTC Final: 423 పరుగుల తేడాతో ఘన విజయం.. కట్‌చేస్తే.. డబ్ల్యూటీసీలో టీమిండియాకు షాక్?
ICC World Test Championship Points Table: డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడాలన్న టీమిండియా కల కలగానే మిగిలిపోనున్నట్లు తెలుస్తోంది. మూడో టెస్ట్‌లో టీమిండియా ఓటమి దిశగా సాగుతోంది. ఈ క్రమంలో గట్టి పోటీ ఇచ్చిన న్యూజిలాండ్ జట్టు 4వ స్థానంలో సరిపెట్టుకుంది. ఇంగ్లండ్‌పై 423 పరుగుల తేడాతో ఘన విజయం సాధించడంతో పాయింట్ల శాతంలో కొద్దిగా మార్పు వచ్చింది.
Tim Southee Farewell Test Match: ఇంగ్లండ్‌తో జరిగిన హామిల్టన్ టెస్ట్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ క్రికెట్ జట్టు భారీ విజయం సాధించింది. కివీస్ జట్టు 423 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. ఇంగ్లండ్‌కు 658 పరుగుల భారీ విజయ లక్ష్యం ఉండగా, రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 234 పరుగులకే ఆలౌటైంది. ఈ విధంగా కివీస్ జట్టు అద్భుత విజయం సాధించింది. న్యూజిలాండ్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌతీకి ఇదే చివరి టెస్టు మ్యాచ్ కావడంతో అతనికి విజయంతో గ్రాండ్ వీడ్కోలు లభించింది. అయితే తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించడంతో సిరీస్ ఇంగ్లండ్‌కు దక్కింది.
ఇక మ్యాచ్ గురించి చెప్పాలంటే న్యూజిలాండ్ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 347 పరుగులు చేసింది. లోయర్ ఆర్డర్‌లో మిచెల్ సాంట్నర్ అత్యధికంగా 76 పరుగులు చేశాడు. దీంతో పాటు టామ్ లాథమ్ కూడా 63 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తన చివరి మ్యాచ్‌లో ఆడుతున్న టిమ్ సౌతీ 10 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్ల సాయంతో 23 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లండ్ తరపున మాథ్యూ పాట్స్ అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టాడు.
ఇంగ్లండ్‌కు 658 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన న్యూజిలాండ్..
దీనికి సమాధానంగా ఇంగ్లండ్ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 143 పరుగులకే ఆలౌటైంది. జో రూట్ అత్యధిక స్కోరు 32 పరుగులు చేశాడు. కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా 27 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. న్యూజిలాండ్ తరపున మ్యాట్ హెన్రీ అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టాడు. న్యూజిలాండ్ భారీ ఆధిక్యాన్ని పొందింది. ఆ తర్వాత రెండవ ఇన్నింగ్స్‌లో చాలా బాగా బ్యాటింగ్ చేసి 453 పరుగులు చేసింది. కేన్ విలియమ్సన్ 204 బంతుల్లో 20 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 156 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు డారిల్ మిచెల్, విల్ యంగ్ కూడా తలో 60 పరుగులు చేశారు.
టిమ్ సౌతీ కెరీర్..
658 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఆది నుంచి ఇబ్బందులు పడుతూనే ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ జట్టు 234 పరుగులు మాత్రమే చేయగలిగింది. జాకబ్ బెతెల్ అత్యధిక స్కోరు 76 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ తరపున మిచెల్ సాంట్నర్ అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టాడు. టిమ్ సౌతీ కూడా తన చివరి టెస్టు మ్యాచ్‌లో 2 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు అతని టెస్ట్ కెరీర్ ముగిసింది. సౌదీ తన కెరీర్‌లో మొత్తం 107 టెస్టు మ్యాచ్‌ల్లో 391 వికెట్లు తీశాడు.
4వ స్థానంతో డబ్ల్యూటీసీ రేసును ముగించిన న్యూజిలాండ్..
టీమిండియాపై విజయంతో డబ్ల్యూటీసీ రేసులోకి దూసుకొచ్చిన న్యూజిలాండ్.. ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టుపై సిరీస్ కోల్పోవడంతో డబ్ల్యూటీసీ రేసును ముగించింది. ప్రస్తుతం టీమిండియా తర్వాత 4వ స్థానంలో నిలిచింది. కివీస్ 81 పాయింట్లు, 48.21 పాయింట్ల శాతంతో నాలుగో స్థానంలో నిలిచింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..