మరికొన్ని గంటల్లో సెమీస్: టీమిండియా బలం, బలహీనతలు

ప్రపంచకప్ సమరంలో భాగంగా జరగనున్న తొలి సెమీస్‌ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. బలమైన జట్లైన భారత్, న్యూజిలాండ్ మధ్య ఈ మ్యాచ్ జరుగుతుండగా.. ఎవరు ఫైనల్‌కు వెళతారా..? అని క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి పెరిగిపోతోంది. అయితే లీగ్ దశల్లో వర్షం కారణంగా ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ రద్దు అవ్వడంతో బలాలు, బలహీనలతపై ఇరు కెప్టెన్లకు అవగాహన పెద్దగా లేదు. ఈ నేపథ్యంలో టీమిండియా బలం, బలహీనతలపై క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బలాలు: […]

మరికొన్ని గంటల్లో సెమీస్: టీమిండియా బలం, బలహీనతలు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 09, 2019 | 10:12 AM

ప్రపంచకప్ సమరంలో భాగంగా జరగనున్న తొలి సెమీస్‌ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. బలమైన జట్లైన భారత్, న్యూజిలాండ్ మధ్య ఈ మ్యాచ్ జరుగుతుండగా.. ఎవరు ఫైనల్‌కు వెళతారా..? అని క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి పెరిగిపోతోంది. అయితే లీగ్ దశల్లో వర్షం కారణంగా ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ రద్దు అవ్వడంతో బలాలు, బలహీనలతపై ఇరు కెప్టెన్లకు అవగాహన పెద్దగా లేదు. ఈ నేపథ్యంలో టీమిండియా బలం, బలహీనతలపై క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

బలాలు: ఈ ప్రపంచకప్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో టీమిండియాలోని అందరూ ఆటగాళ్లు బాగానే రాణిస్తున్నారు. అయితే బ్యాటింగ్‌లో కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరు ముగ్గురు త్వరగా ఔట్ అవ్వకపోతే భారత్‌కు గెలిచే అవకాశాలు ఎక్కువున్నాయి. మరోవైపు బౌలింగ్‌లో బుమ్రా, షమీ చితక్కొట్టేస్తున్నారు. ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తోన్న ఈ బౌలర్లపై క్రికెట్ అభిమానులకు చాలా అంచనాలు ఉన్నాయి. అలాగే లీగ్ దశలో ఇప్పటివరకు ఎమినిది మ్యాచ్‌లో ఆడిన ఇండియా ఏడింటిలో గెలిచి.. పట్టికలో టాప్‌లో ఉంది.

బలహీనతలు: మంచి మంచి ఆటగాళ్లున్నా.. గత రెండు సంవత్సరాలుగా టీమిండియా మిడిల్ ఆర్డర్‌లో విఫలమవుతూ వస్తోంది. ఒక్కసారి టాప్ క్లాస్ ఆటగాడు విఫలైమతే.. ఆ తరువాత ఆడాల్సిన ఆటగాళ్లు చేతులేత్తేస్తున్నారు. భారత్‌కు ఉన్న పెద్ద బలహీనతల్లో ఇదొకటి. దీనిపై ప్రపంచకప్‌కు ముందు కూడా చాలా చర్చలే జరిగాయి. ఇక పలువురి ఫేవరెట్‌గా భావించే కులదీప్ యాదవ్ ప్రస్తుతం ఫామ్‌లో లేకపోవడంతో బుమ్రాపైనే అధిక భారం పడుతోంది. దీంతో పాటు ధోని, పాండ్యా ఫామ్‌లో లేకపోవడం కూడా టీమిండియాకు కాస్త బలహీనతనే చెప్పాలి.

కాగా మరోవైపు కివీస్ జట్టు కూడా ఇప్పుడు మంచి ఫాంలో ఉంది. లీగ్ దశల్లో మూడు జట్లతో ఓడిపోయినప్పటికీ.. ఆ టీమ్‌లో టీమిండియాను ఢీకొట్టే బౌలర్లు, పేసర్లు ఉన్నారు. న్యూజిలాండ్ టీమ్‌లో ఉన్న గుప్తిల్, హెన్రీ నికోలస్, మున్నో, విలయమ్సన్, రాస్ టేలర్, లాథమ్, నీషమ్, గ్రాంథోమ్, సాంట్నర్, హెన్నీ, ఫెర్గ్యూసన్, బౌల్ట్ తదితరులు మంచి ఫాంలో ఉన్నారు. దానికి తోడు లీగ్ దశల్లో టీమిండియాను ఎలాగైనా ఓడించాలనుకున్న కివీస్‌కు అప్పుడు అవకాశం లేకపోవడంతో.. సెమీస్‌లో తమ ప్రతాపాన్ని చూపించాలనుకుంటోంది. ఇలా రెండు జట్ల మధ్య నువ్వా నేనా అంటూ సాగుతున్న ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో తెలియాలంటే ఇంకొన్ని గంటలు వేచి చూడాల్సిందే.