AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 WC 2022: క్రికెట్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌ చెప్పిన ఐసీసీ.. టీమిండియా- పాక్‌ మ్యాచ్‌ కోసం ఏకంగా..

Ind vs Pak, ICC T20 WC 2022: అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అక్టోబర్‌ 23న భారత్- పాక్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌కు సంబంధించి ఫిబ్రవరిలోనే టికెట్లు విడుదల చేయగా.. కేవలం ఐదు నిమిషాల్లోనే టికెట్లన్నీ హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి.

T20 WC 2022: క్రికెట్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌ చెప్పిన ఐసీసీ.. టీమిండియా- పాక్‌ మ్యాచ్‌ కోసం ఏకంగా..
Ind Vs Pak, Icc T20 Wc 2022
Basha Shek
| Edited By: Ravi Kiran|

Updated on: Aug 26, 2022 | 6:42 AM

Share

Ind vs Pak, ICC T20 WC 2022: టీమిండియా-పాకిస్తాన్‌ జట్ల మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ అంటే నరాలు తెగే ఉత్కంఠ ఉంటుంది. అందుకే దాయాదుల పోరును మైదానంలో ప్రత్యక్షంగా చూసేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తారు. ఈనేపథ్యంలో పాక్‌-భారత్‌ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతుంటాయి. ఇక ఐసీసీ టోర్నీలైతే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతేడాది దుబాయి వేదికగా జరిగిన టీ20 ప్రపం‍చకప్‌ భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌కు రికార్డు స్థాయిలో వ్యూయర్‌షిప్‌ వచ్చాయి. అలాగే మ్యాచ్‌ జరిగిన దుబాయ్‌ స్టేడియానికి ప్రేక్షకులు కూడా పోటెత్తారు. ఇక తాజాగా ఆసియా కప్‌లో ఆగస్టు 28న జరగనున్న భారత్‌-పాక్‌ మ్యాచ్‌ కోసం ఇప్పటికే టికెట్లన్నీ అమ్ముడయ్యాయి. కాగా ఆసియా కప్‌ ముగిసిన వెంటనే రెండు నెలల్లోనే మరోసారి చిరకాల ప్రత్యర్థులు తలపడనున్నారు. అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అక్టోబర్‌ 23న భారత్- పాక్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌కు సంబంధించి ఫిబ్రవరిలోనే టికెట్లు విడుదల చేయగా.. కేవలం ఐదు నిమిషాల్లోనే టికెట్లన్నీ హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి.

ఆ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని..

తాజాగా టీ20 ప్రపంచకప్‌లో భారత్‌-పాక్‌ మ్యాచ్‌ చూడాలనుకునే అభిమానులకు శుభవార్త చెప్పింది చెప్పింది. ఈ రసవత్తర మ్యాచ్‌ కోసం మరో నాలుగు వేలకు పైగా స్టాండింగ్‌ రూమ్‌ టికెట్లను విడుదల చేసినట్లు తెలిపింది. ఒక్కో టికెట్‌ ధర 30 ఆస్ట్రేలియన్‌ డాలర్లుగా (మన కరెన్సీలో దాదాపు రూ.1670) పేర్కొంది. ఫస్ట్‌ కమ్‌-ఫస్ట్‌ సర్వ్‌ పద్దతిలో ఈ అదనపు టికెట్లను కేటాయిస్తామని ఐసీసీ పేర్కొంది. ‘భారత్‌, పాక్‌ మ్యాచ్‌ కోసం మరో నాలుగు వేలకు పైగా స్టాండింగ్‌ రూమ్‌ టికెట్లను కేటాయించాం. టీమిండియా-పాక్‌ మ్యాచ్‌కున్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం. వీటితో పాటు ఐసీసీ హాస్పిటాలిటీ, ఐసీసీ ట్రావెల్స్‌ అండ్‌ టూర్స్‌ ప్రోగ్రామ్స్‌ తరపున పరిమిత సంఖ్యలో ప్యాకేజీలను కూడా అందుబాటులోకి తెచ్చాం. నవంబర్‌ 13న జరిగే మెగా టోర్నీ ఫైనల్‌ మ్యాచ్‌ టికెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి’ అని ఐసీసీ తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..