Tilak Varma: ఐసీసీ ర్యాంకుల్లో దూసుకొచ్చిన తెలుగబ్బాయి.. ఏకంగా సూర్యనే వెనక్కునెట్టిన తిలక్ వర్మ

ఐసీసీ తన తాజా T20 ఆల్-రౌండర్ ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది, ఇందులో ఆల్ రౌండర్ల విభాగంలో హార్దిక్ పాండ్యా మరోసారి అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. ఇక టీమిండియా యంగ్ బ్యాటర్ తిలక్ వర్మ ఏకంగా 69 స్థానాలు ఎగబాకి సూర్యను వెనక్కు నెట్టేశాడు.

Tilak Varma: ఐసీసీ ర్యాంకుల్లో దూసుకొచ్చిన తెలుగబ్బాయి.. ఏకంగా సూర్యనే వెనక్కునెట్టిన తిలక్ వర్మ
Tilak Varma
Follow us
Basha Shek

|

Updated on: Nov 20, 2024 | 7:55 PM

ఐసీసీ బుధవారం (నవంబర్ 21) విడుదల చేసిన కొత్త ఐసీసీ టీ20 ఆల్ రౌండర్ల ర్యాంకింగ్స్ జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అగ్రస్థానంలో నిలిచాడు. టీ20 ప్రపంచకప్ తర్వాత పేలవమైన ఫామ్‌తో బాధపడుతున్న పాండ్యా.. ఆఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో పాండ్యా మళ్లీ నంబర్‌వన్‌ స్థానానికి చేరుకున్నాడు. ఇప్పుడు నంబర్ 1 స్థానంలో ఉన్న హార్దిక్, ఇంగ్లండ్ ఆల్ రౌండర్ లియామ్ లివింగ్‌స్టన్‌ను వెనక్కునెట్టేశాడు. దక్షిణాఫ్రికాతో ఇటీవల ముగిసిన T20 సిరీస్‌లో హార్దిక్ పాండ్యా బ్యాట్, బాల్ రెండింటితోనూ మెరిశాడు. ముఖ్యంగా ఆఫ్రికాతో జరిగిన రెండో టీ20లో క్లిష్ట పరిస్థితుల్లో హార్దిక్ 39 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దీంతోపాటు బౌలింగ్‌లోనూ మంచి ప్రదర్శన చేశాడు. దీంతో పాటు ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా ఛాంపియన్‌గా నిలిచిన హార్దిక్‌ కూడా కీలక పాత్ర పోషించాడు. దీంతో హార్దిక్ ఇప్పుడు టీ20లో ప్రపంచ నంబర్ వన్ ఆల్ రౌండర్ గా నిలిచాడు.

ఇక ఇటీవల ముగిసిన దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌లో వరుసగా రెండు సెంచరీలు బాదిన యువ ఆటగాడు తిలక్ వర్మ కూడా బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టాప్ -5లోకి దూసుకొచ్చాడు. ఆఫ్రికాతో సిరీస్ కు ముందు 72వ ర్యాంక్ లో ఉన్న తిలక్ ఇప్పుడు టాప్ 3వ స్థానానికి దూసుకురావడం విశేషం. సెంచూరియన్‌లో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఆఫ్రికాపై 107 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడిన తిలక్, ఆ తర్వాత జోహన్నెస్‌బర్గ్‌లో కూడా అజేయంగా 120 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో తిలక్ వర్మ 20 సిక్స్‌లు, 21 ఫోర్లతో 140 సగటుతో 280 పరుగులు చేశాడు.

ఇవి కూడా చదవండి

కాగా ఒకప్పుడు టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు తిలక్ వర్మ కంటే దిగువకు పడిపోయాడు. ప్రస్తుతం సూర్య 4వ స్థానంలో ఉన్నాడు. సౌతాఫ్రికా సిరీస్‌లో సూర్య పెద్దగా పరుగులు చేయలేకపోయాడు. 3 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 26 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఫలితంగా T20 ర్యాంకింగ్స్‌లో సూర్య వెనకబడ్డాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గంట కొట్టాలంటే ఒకలా.. గంట కొట్టేయాలంటే మరొకలా..
గంట కొట్టాలంటే ఒకలా.. గంట కొట్టేయాలంటే మరొకలా..
విమానంలో కుదుపులు.. ఎగిరిపడ్డ ప్రయాణికులు.! వీడియో వైరల్..
విమానంలో కుదుపులు.. ఎగిరిపడ్డ ప్రయాణికులు.! వీడియో వైరల్..
అమెరికాలో భారీగా ఉద్యోగాల కోత.. వివేక్ రామస్వామి హింట్.!
అమెరికాలో భారీగా ఉద్యోగాల కోత.. వివేక్ రామస్వామి హింట్.!
భద్రకాళి చెరువు ఖాళీ. అబ్బో.. ఎన్ని రకాల చేపలో! అదిరిపోయే వీడియో
భద్రకాళి చెరువు ఖాళీ. అబ్బో.. ఎన్ని రకాల చేపలో! అదిరిపోయే వీడియో
మందు పార్టీ తరువాత ఘోరం.! రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన శరీరభాగాలు
మందు పార్టీ తరువాత ఘోరం.! రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన శరీరభాగాలు
ఇన్సూరెన్స్ కోసం ఎలుగుబంటి వేషంలో కార్లు నాశనం.! వీడియో..
ఇన్సూరెన్స్ కోసం ఎలుగుబంటి వేషంలో కార్లు నాశనం.! వీడియో..
ఫ్రీ డేటా, నో ఛార్జింగ్‌, టెస్లా.. ఇలాంటి ఫోన్లను తయారుచేస్తోందా?
ఫ్రీ డేటా, నో ఛార్జింగ్‌, టెస్లా.. ఇలాంటి ఫోన్లను తయారుచేస్తోందా?
రంగులు మారే శివలింగం.. ఎక్కడో తెలుసా.? వీడియో వైరల్..
రంగులు మారే శివలింగం.. ఎక్కడో తెలుసా.? వీడియో వైరల్..
భార్య నీతాకు అంబానీ కొత్త గిఫ్ట్.. ఏకంగా రూ.70 వేల కోట్లతో.!
భార్య నీతాకు అంబానీ కొత్త గిఫ్ట్.. ఏకంగా రూ.70 వేల కోట్లతో.!
వీటిని తింటే మీ స్టామినా డబుల్.! రోజు ఉదయం తింటే రాత్రికి..
వీటిని తింటే మీ స్టామినా డబుల్.! రోజు ఉదయం తింటే రాత్రికి..