T20 WC Prize Money: విజేతపై కాసుల వర్షం.. ఐపీఎల్ కంటే ఎక్కువే.. ప్రతీ జట్టు ఖాతాలో కోట్ల వర్షం..
T20 World Cup 2024 Prize Money: ICC ఈ T20 ప్రపంచ కప్ ప్రైజ్ మనీ మొత్తాన్ని ప్రకటించింది. ఈ ప్రకారం ఐసీసీ ఈసారి దాదాపు రూ.93.50 కోట్లను ప్రైజ్ మనీగా ఉంచినట్లు తెలుస్తోంది. ఈ మొత్తంలో విజేత జట్టుకు ప్రైజ్ మనీగా రూ.20 కోట్లు అందుతాయి.

T20 World Cup 2024 Prize Money: 9వ ఎడిషన్ T20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) నిన్నటి నుంచి అంటే జూన్ 2 నుంచి అమెరికా, వెస్టిండీస్ సంయుక్త ఆతిథ్యంలో ప్రారంభమైంది. అనేక కారణాల వల్ల ఈ టీ20 ప్రపంచకప్ చాలా ప్రత్యేకమైనది. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ టోర్నీలో 20 జట్లు పాల్గొనడం ఇదే తొలిసారి. దీంతో ఈ లీగ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా, ఈ ఎడిషన్‌కు సంబంధించిన ప్రైజ్ మనీని ఐసీసీ ప్రకటించింది. ఐసీసీ ప్రకారం, ఈ టీ20 ప్రపంచ కప్ ప్రైజ్ మనీ 11.25 మిలియన్ యూఎస్ డాలర్లుగా ఉంచింది. అంటే, భారత కరెన్సీలో దాదాపు రూ.93.50 కోట్లు ప్రైజ్ మనీగా ఉంచారు. ఈ మొత్తంలో ఛాంపియన్ జట్టుకు 2.45 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 20 కోట్లు) బహుమతి లభిస్తుంది.
ఛాంపియన్ జట్టుకు 20 కోట్లు..!
టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఛాంపియన్ జట్టుకు ఇంత పెద్ద మొత్తంలో పారితోషికం అందజేయడం ఇదే తొలిసారి. ఛాంపియన్ జట్టుకు 20 కోట్లు ప్రైజ్ మనీ దక్కనుండగా.. రన్నరప్ జట్టు, అంటే ఫైనల్‌లో ఓడిన జట్టుకు 1.28 మిలియన్ డాలర్లు, అంటే భారత రూపాయల్లో 10.64 కోట్లు దక్కనున్నాయి. దీంతో పాటు సెమీఫైనల్‌లో ఓడిన జట్లకు కూడా భారీ బహుమతులు అందుతాయి.
మిగిలిన జట్లకు ప్రైజ్ మనీ వివరాలు..
టోర్నీలో పాల్గొనే జట్టుకు కనీసం రూ.2 కోట్లు అందజేస్తారు . సెమీ ఫైనల్స్‌లో ఓడిన జట్లకు రూ.6.54 కోట్లు లభిస్తాయి. సూపర్-8 దశ నుంచి నిష్క్రమించిన 4 జట్లకు రూ.3.17 కోట్లు ఇవ్వనున్నారు.
ICC reveal historic prize money for the Men’s #T20WorldCup 🤩
Details ⬇️https://t.co/jRhdAaIkmc
— ICC (@ICC) June 3, 2024
9, 10, 11, 12 స్థానాల్లో ఉన్న జట్లకు రూ.2 కోట్లు అందజేస్తారు. 13 నుంచి 20వ ర్యాంక్‌లో నిలిచిన జట్లకు రూ.1.87 కోట్లు ఇస్తారు. సెమీ ఫైనల్స్, ఫైనల్స్ మినహా తమ మ్యాచ్‌లలో గెలిచిన జట్లకు దాదాపు రూ.26 లక్షలు అదనంగా ఇవ్వనున్నారు.
తొలిసారిగా టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టు ఐపీఎల్ ఛాంపియన్ కంటే ఎక్కువ డబ్బును అందుకుంటుంది. గతవారం ఛాంపియన్‌గా నిలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు రూ.20 కోట్ల ప్రైజ్‌మనీ లభించింది. గతసారి ప్రపంచ ఛాంపియన్‌కు రూ.12 కోట్లు వచ్చాయి.
గతసారి కంటే రెట్టింపు..
నిజానికి గతసారి కంటే ఈసారి రెట్టింపు ప్రైజ్ మనీని ఐసీసీ కేటాయించింది. గత ఎడిషన్‌లో, మొత్తం బహుమతి పరిమాణం 5.6 మిలియన్ డాలర్లు. అంటే ఈసారి ప్రైజ్ మనీలో సగం అన్నమాట. అంటే, గతేడాది ఛాంపియన్‌గా నిలిచిన ఇంగ్లండ్ జట్టుకు రూ.13 కోట్లు, రన్నరప్‌గా నిలిచిన పాకిస్థాన్ జట్టుకు రూ.6.44 కోట్లు బహుమతిగా అందించారు. అయితే, ఈసారి ఫైనల్స్‌కు చేరే జట్ల ఖజానాకు భారీగా డబ్బు చేరనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




