ODI World Cup 2023: క్రికెట్ అభిమానులకు అద్దిరిపోయే శుభవార్త.. ఆ 9 భాషల్లో టోర్నీ ప్రత్యక్ష ప్రసారం..
ODI World Cup 2023: క్రికెట్ అభిమానులకు అద్దిరిపోయే శుభవార్త శుభవార్త చెప్పింది స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్. అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా జరిగే వరల్డ్ కప్ టోర్నమెంట్ మ్యాచ్‌లను మొత్తం 9 భాషల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లుగా ప్రకటించింది. దీంతో ఇప్పుడు క్రికెట్ అభిమానులు ఇంగ్లీష్‌తో పాటు హిందీ, మరాఠీ, తమిళం, తెలుగు, కన్నడ, బెంగాలీ, గుజరాతీ, మలయాళ భాషల్లో ప్రపంచ కప్ మ్యాచ్‌లను వీక్షించవచ్చు. ఇక ఆయా భాషల్లో వ్యాఖ్యానించేందుకు స్టార్ స్పోర్ట్స్ ఇప్పటికే మొత్తం..
ODI World Cup 2023: క్రికెట్ అభిమానులకు అద్దిరిపోయే శుభవార్త శుభవార్త చెప్పింది స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్. అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా జరిగే వరల్డ్ కప్ టోర్నమెంట్ మ్యాచ్‌లను మొత్తం 9 భాషల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లుగా ప్రకటించింది. దీంతో ఇప్పుడు క్రికెట్ అభిమానులు ఇంగ్లీష్‌తో పాటు హిందీ, మరాఠీ, తమిళం, తెలుగు, కన్నడ, బెంగాలీ, గుజరాతీ, మలయాళ భాషల్లో ప్రపంచ కప్ మ్యాచ్‌లను వీక్షించవచ్చు. ఇక ఆయా భాషల్లో వ్యాఖ్యానించేందుకు స్టార్ స్పోర్ట్స్ ఇప్పటికే మొత్తం 120 మంది వ్యాఖ్యాతలను ఎంపిక చేసింది. వీరిలో రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్, హర్ష భోగ్లే, హర్భజన్ సింగ్, పీయూష్ చావ్లా, ఎస్ శ్రీశాంత్, ఎంఎస్‌కే ప్రసాద్, సందీప్ పాటిల్, సునీల్ జోషి, మిథాలీ రాజ్‌తో పాటు రికీ పాంటింగ్, షేన్ వాట్సన్, ఆరోన్ ఫించ్, మాథ్యూ హేడెన్, ఇయాన్ మోర్గాన్, నాజర్ హుస్సేన్, ఇయాన్ బిషప్, షాన్ పొలాక్ వంటి మాజీ క్రికెటర్ల పేర్లు కూడా ఉన్నాయి.
9 languages 🗣️120+ Starcast ✨1 World Cup 🏆
Elevate your experience of the #GreatestGlory with exclusive insights and commentary all tournament long, in the #WorldCupOnStar! 🤩
Don't miss #CWC2023 on Star Sports Network! pic.twitter.com/e2cCAcArmc
— Star Sports (@StarSportsIndia) October 1, 2023
తెలుగు కామెంటేటర్ల జాబితా:
ఎమ్మెస్కే ప్రసాద్, వేణుగోపాలరావు, మిథాలీరాజ్, ఆర్జే శశి, యాంకర్ రవి, నందు, టి.సుమన్, ఆశిష్ రెడ్డి, కల్యాణ్ కృష్ణ, జ్ఞానేశ్వర రావు, రాకేష్ దేవా, ఎన్ సీ కౌషిక్, వింధ్య
𝕊𝕦𝕡𝕖𝕣 𝕊𝕥𝕒𝕣 ℂ𝕒𝕤𝕥 – 𝕊𝕥𝕒𝕣 𝕊𝕡𝕠𝕣𝕥𝕤 𝕋𝕖𝕝𝕦𝕘𝕦 💥😎
ఈ ఐసీసీ మెన్స్ వరల్డ్ కప్ 🏆 లో మన #StarSportsTelugu స్టార్ కాస్ట్ వీరే.!! 😍
చూడండి 👀ICC Men's Cricket World Cup 2023మీ #StarSportsTelugu & Disney+ Hotstar లో#WorldCupOnStar pic.twitter.com/VngCuabhne
— StarSportsTelugu (@StarSportsTel) September 29, 2023
అంతా ఉచితం..
వరల్డ్ కప్ కోసం వేచి ఉన్న అభిమానులకు మరో శుభవార్త ఏమిటంటే.. వన్డే మెగా టోర్నీ మ్యాచ్‌లను డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ యాప్‌లో ఉచితంగా చూడవచ్చు. అయితే ఈ అవకాశం కేవలం మొబైల్ యాప్‌కే పరిమితం. అంటే హాట్‌స్టార్ వెబ్‌సైట్ ద్వారా చూడాలనుకునేవారు తప్పనిసరిగా సబ్క్స్రిప్షన్ తీసుకోవాలి.
కాగా, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్స్ ఇంగ్లాండ్‌తో న్యూజిలాండ్ తలపడనుంది. ఇక భారత్ తన వరల్డ్ కప్ ప్రచారాన్ని అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ ద్వారా ప్రారంభిస్తుంది.
🚨🚨 Team India's fixtures for ICC Men's Cricket World Cup 2023 👇👇
#CWC23 #TeamIndia pic.twitter.com/LIPUVnJEeu
— BCCI (@BCCI) June 27, 2023