- Telugu News Photo Gallery Cricket photos CWC 2023: Indian skipper Rohit Sharma eyes Sachin Tendulkar’s Centuries record in ODI World Cup History
World Cup 2023: సచిన్ రికార్డ్‌కి సెంచరీ దూరంలో రోహిత్.. దిగ్గజాలను దాటేసి దూసుకొస్తున్న వార్నర్ మామ..
ICC ODI World Cup 2023: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రికెట్ కార్నివల్ రానే వచ్చింది. భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ ప్రారంభానికి ఇంకా 4 రోజుల సమయమే మిగిలి అక్టోబర్ 5 నుంచి మొదలయ్యే ఈ టోర్నీపై ఇప్పటికే భారీ అంచనాలతో ఉన్నారు క్రికెట్ అభిమానులు. తమ అభిమాన బ్యాటర్ సెంచరీలతో.. ఫేవరెట్ బౌలర్ హ్యట్రిక్స్‌తో రాణించాలని కోరుకుంటున్నారు. అయితే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కన్ను మాత్రం అటు వరల్డ్ కప్ టైటిల్, ఇటు 12 ఏళ్లుగా సచిన్ టెండూల్కర్ పేరిటనే ఉన్న సెంచరీల రికార్డుపై పడింది.
Updated on: Oct 01, 2023 | 7:01 PM

ICC ODI World Cup 2023: అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీల రికార్డ్ అనగానే టక్కున గుర్తు వచ్చే పేరు సచిన్ టెండూల్కర్. అయితే సచిన్‌కి అంతర్జాతీయ క్రికెట్‌లోనే కాక వన్డే వరల్డ్ కప్‌లో కూడా సెంచరీల రికార్డ్ ఉంది. అవును, వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడు సచినే.

వరల్డ్ కప్ 1992 నుంచి ప్రపంచ కప్ 2011 వరకు జరిగిన 6 టోర్నీల్లోనూ కనిపించిన సచిన్ మొత్తం 44 వన్డే ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో సచిన్ 2278 పరుగులతో పాటు 6 సెంచరీలు చేశాడు. వరల్డ్ కప్ చరిత్రలో ఇదే అత్యధిక సెంచరీల రికార్డు.

అయితే వరల్డ్ కప్ 2019 టోర్నీలో 5 సెంచరీలతో చెలరేగిన రోహిత్ శర్మ.. మొత్తం 6 సెంచరీలతో సచిన్ రికార్డును సమం చేశాడు. కానీ ఈ సారి మరో సెంచరీ బాది.. ఆ రికార్డును పూర్తిగా తన సొంతం చేసుకోవాలనే యోచనలో ఉన్నాడు. విశేషం ఏమిటంటే.. రోహిత్ 6 సెంచరీల కోసం ఇప్పటివరకు 17 వన్డే వరల్డ్ కప్ ఇన్నింగ్స్ మాత్రమే ఆడాడు.

ఇక సచిన్ రికార్డ్‌ని సొంతం చేసుకునేందుకు రోహిత్‌కి పోటీగా ఇప్పటికీ డేవిడ్ వార్నర్ మాత్రమే ఉన్నాడు. వరల్డ్ కప్ టోర్నీల్లో మొత్తం 18 ఇన్నింగ్స్ ఆడిన వార్నర్ మొత్తం 4 సెంచరీలు చేసి.. ఐదో స్థానంలో ఉన్నాడు.

వార్నర్ కంటే ముందు కుమార సంగక్కర(5), రికీ పాంటింగ్(5) ఉన్నప్పటికీ వారు రిటైర్ అయిపోయారు. ఇంకా వార్నర్‌తో సమానంగా ఉన్న సౌరవ్ గంగూలీ(4), ఏబీ డివిలియర్స్(4), మార్క్ వా(4), తిలకరత్నే దిల్షాన్(4), మహేలా జయవర్ధనే(4) కూడా ఆటకు విడ్కోలు పలికారు.





























