IND vs WI: కొంపముంచిన బౌలర్లు.. భారత్, వెస్టిండీస్ జట్లకు ఫైన్.. తొలి టీ20 మ్యాచ్‌లో అలా ఆడినందుకే..!
IND vs WI 1st T20I: వెస్టిండీస్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓడిన ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా భారత్‌కు ఈ జరిమానా పడింది. ఉండాల్సిన ఓవర్ రేట్ కంటే భారత్ ఒక ఓవర్ తక్కువగా వేసినందున భారత్‌కి 5 శాతం జరిమానా పడింది. అయితే ఈ జరిమానా నుంచి వెస్టిండీస్ కూడా తప్పించుకోలేకపోయింది. భారత్ ఒక ఓవర్ లేట్‌గా వేస్తే.. వెస్టిండీస్ జట్టు రెండు ఓవర్లును ఆలస్యంగా వేసింది. దీంతో కరేబియన్..
IND vs WI 1st T20I: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్‌కి ఆపజయం రూపంలో ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత టీమిండియాకు మరో దెబ్బ తగిలింది. భారత జట్టుకు ఐసీసీ తొలి మ్యాచ్ ఫీజులో 5 శాతం జరిమానా విధించింది. వెస్టిండీస్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓడిన ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా భారత్‌కు ఈ జరిమానా పడింది. ఉండాల్సిన ఓవర్ రేట్ కంటే భారత్ ఒక ఓవర్ తక్కువగా వేసినందున భారత్‌కి 5 శాతం జరిమానా పడింది. అయితే ఈ జరిమానా నుంచి వెస్టిండీస్ కూడా తప్పించుకోలేకపోయింది. భారత్ ఒక ఓవర్ లేట్‌గా వేస్తే.. వెస్టిండీస్ జట్టు రెండు ఓవర్లును ఆలస్యంగా వేసింది. దీంతో కరేబియన్ టీమ్‌కి ఐసీసీ మ్యాచ్ ఫీజులో నుంచి 10 శాతం ఫైన్ వేసింది. ‘ఐసీసీ ఎలైట్ ప్యానల్ ఆఫ్ మ్యాచ్ రీఫరీస్’కి చెందిన రిచీ రిచర్డ్‌సన్ ఈ జరిమానా విధించారు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. కరేబియన్ల జట్టు తరఫున వికెట్ కీపర్ నికోలస్ పూరన్ 41 రన్స్, కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ 48 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో ఆర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ చెరో 2 వికెట్లను పడగొట్టగా.. కెప్టెన్ హార్తిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసుకున్నారు. అనంతరం 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఓపెనర్లు ఇషాన్ కిషన్(6), శుభమాన్ గిల్(3) అనుకున్నంతగా రాణించలేకపోయారు. ఇలా జట్టుకు శుభారంభం లభించలేదు. సూర్యకుమార్ యాదవ్21, హార్దిక్ పాండ్యా 19, సంజూ శామ్సన్ 13 పరుగులతో మెప్పించలేకపోయారు.
Team India and West Indies are to be fined 5% and 10% respectively for maintaining a slow over-rate in the 1st T20I#india #westindies #fine #slow #overrate #t20 #cricket #cricketnews #latestnews #cricketupdates #breaking #cricketgyan pic.twitter.com/vNwkNOYJVP
— Cricket Gyan (@cricketgyann) August 4, 2023
అయితే నాలుగో నెంబర్‌లో వచ్చిన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ తొలి మ్యాచ్‌లోనే మెప్పించాడు. 22 బంతుల్లోనే 2 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టి 39 పరుగులు చేశాడు. అయితే రొమారియో షెఫర్డ్ వేసిన ఓవర్‌లో భారీ షాట్ ఆడబోయి హెట్మేయర్‌కి చిక్కేశాడు. ఇక చివర్లో వచ్చిన ఆర్ష్‌దీప్ 2 ఫోర్లతో మ్యాచ్‌పై ఆశ కల్పించినా రన్‌ఔట్‌గా వెనుదిరిగాడు. దీంతో భారత్ 4 వికెట్లతో తేడాతో తొలి టీ20 మ్యాచ్ ఓడిపోయింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..