ENG vs NZ: దురదృష్టం వెంటాడితే ఇలాగే ఉంటుందేమో.. ఎవరూ ఊహించని రీతిలో ఔటైన బ్యాటర్‌.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..

|

Jun 24, 2022 | 11:04 AM

England Vs New Zealand: క్రికెట్‌లో అప్పుడప్పుడూ చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. కొన్ని సార్లు ఫీల్డర్లు అద్భుతమైన ఫీట్లు చేస్తూ క్యాచ్‌లు అందుకుని ఫ్యాన్స్‌ను అలరిస్తే.. బ్యాటర్లు చిత్ర విచిత్రకరమైన రీతిలో ఔటై తమ అభిమానులను నిరాశపరుస్తుంటారు..

ENG vs NZ: దురదృష్టం వెంటాడితే ఇలాగే ఉంటుందేమో.. ఎవరూ ఊహించని రీతిలో ఔటైన బ్యాటర్‌.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..
Eng Vs Nz
Follow us on

England Vs New Zealand: క్రికెట్‌లో అప్పుడప్పుడూ చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. కొన్ని సార్లు ఫీల్డర్లు అద్భుతమైన ఫీట్లు చేస్తూ క్యాచ్‌లు అందుకుని ఫ్యాన్స్‌ను అలరిస్తే.. బ్యాటర్లు చిత్ర విచిత్రకరమైన రీతిలో ఔటై తమ అభిమానులను నిరాశపరుస్తుంటారు. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. అయితే ఇక్కడ బ్యాటర్‌కు దురదృష్టం బాగా వెంటాడింది. అందుకే ఊహించని రీతిలో ఔటై పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఆ బాధితుడు మరెవరో కాదు న్యూజిలాండ్‌ స్టార్‌ ఆటగాడు హెన్రీ నికోల్స్‌ (Henry Nicholls). లీడ్స్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతోన్న అఖరి టెస్టులో అతను విచిత్రంగా ఔటయ్యాడు. ఇన్నింగ్స్‌ 55 ఓవర్‌ వేసిన జాక్ లీచ్‌ బౌలింగ్‌లో నికోల్స్ (99 బంతుల్లో 19) నాన్‌ స్ట్రైకర్‌వైపు భారీ షాట్‌ ఆడాడు. అయితే బంతి నేరుగా నాన్‌స్ట్రైకింగ్‌లో ఉన్న మిచెల్‌ బ్యాట్‌కు తగిలి.. నేరుగా మిడ్ ఆఫ్ ఫీల్డర్‌ అలెక్స్ లీస్ చేతుల్లోకి వెళ్లింది. అప్పటివరకు ఆచితూచి ఎంతో సంయమనంతో ఆడుతున్న నికోల్స్‌ ఊహించని విధంగా ఔట్‌ కావడంతో నిరాశగా మైదానాన్ని వీడాల్సి వచ్చింది.

తెల్లమొహం వేసిన బౌలర్‌..

ఇవి కూడా చదవండి

కాగా నికోల్స్‌ నిష్ర్కమణతో ఇంగ్లండ్‌ బౌలర్లు సంబురాల్లో మునిగిపోగా.. బౌలర్‌ లీచ్‌ మాత్రం ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉండిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా నికోల్స్‌ ఔటైన విధానంపై మేరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ స్పందించింది. ‘ నికోల్స్‌ దురదృష్టకరమైన రీతిలోతన వికెట్‌ను కోల్పోయాడు. అయితే ఇది పూర్తిగా చట్టాలకు లోబడి ఉంది. నియమం ​33.2.2.2 ప్రకారం బంతి.. వికెట్‌, అంపైర్‌, ఫీల్డర్, ఇతర బ్యాటర్లను తాకిన తర్వాత క్యాచ్ తీసుకుంటే అది ఔట్‌గానే పరిగణించబడుతుంది’ అని మేరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ ‍ట్విటర్‌ వేదికగా ప్రకటించింది. కాగా మూడో టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే 2-0తో సిరీస్‌ను కోల్పోయింది కివీస్‌. దీంతో మూడో టెస్ట్‌లోనైనా విజయం సాధించి పరువు దక్కించుకోవాలని భాఇస్తోంది. ఈక్రమంలో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ తొలిరోజు ఆట ముగిసేసమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. ఫాస్ట్‌ బౌలర్‌ బ్రాడ్‌ (2/45), స్పిన్నర్‌ లీచ్‌ల (2/75)ల దెబ్బకు 123 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయింది కివీస్‌. అయితే డరైల్‌ మిచెల్‌ (78 బ్యాటింగ్‌; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) మరోసారి ఆదుకున్నాడు. టామ్ బ్లండెల్‌ (45)తో కలిసి అభేద్యమైన ఐదో వికెట్‌కు 102 పరుగుల భాగస్వామ్యం జోడించి పరిస్థితని చక్కదిద్దారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..