Virat Kohli: విరాట్ కోహ్లీ ఫామ్ అందుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.. RCB హెడ్ కోచ్ సంజయ్ బంగర్..
ఐపీఎల్ 2022(IPL 2022)లో భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) ఘోరంగా విఫలమవుతున్నాడు. ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ కేవలం 119 పరుగులు మాత్రమే చేశాడు...
ఐపీఎల్ 2022(IPL 2022)లో భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) ఘోరంగా విఫలమవుతున్నాడు. ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ కేవలం 119 పరుగులు మాత్రమే చేశాడు. లక్నో, హైదరాబాద్ జట్లతో జరిగిన మ్యాచ్‌ల్లో విరాట్ డకౌట్ అయ్యాడు. అయితే కోహ్లీ బ్యాటింగ్ తీరుపై బెంగళూరు హెడ్‌కోచ్ సంజయ్ బంగర్(Sanjay Bangar) మాట్లాడారు. విరాట్ కోహ్లీ ఫామ్ అందుకునేందుకు శక్తి మేరకు చాలా ప్రయత్నిస్తున్నాడని చెప్పాడు. త్వరలోనే అతడు ఫామ్‌లోకి వస్తాడనే నమ్మకంతో ఉన్నామని బంగర్ పేర్కొన్నాడు. బెంగళూరు జట్టులో విరాట్ కోహ్లీ నిలకడగా రాణించే ప్లేయర్ అని వివరించాడు. కానీ.. ప్రతి ఆటగాడి కెరీర్‌లో ఇలాంటి చేదు అనుభవాలు మామూలేనని చెప్పుకొచ్చాడు. ఈ సీజన్‌ని కోహ్లీ చాలా బాగా ఆరంభించాడని.. ముంబయితో జరిగిన మ్యాచ్‌లోనూ బెంగళూరు టీమ్‌ని గెలిపించే ఇన్నింగ్స్ ఆడాడని గుర్తు చేశాడు.
కానీ.. ఆ రనౌట్లు కోహ్లీ లయని దెబ్బతీశాయని బంగర్ విశ్లేషించాడు. ఫామ్ అందుకునేందుకు చాలా ట్రై చేస్తున్నాడని.. నిస్సందేహంగా తన శక్తి మేరకు ప్రతిదీ చేస్తున్నాడని చెప్పాడు. ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడంతో పాటు బ్యాటింగ్ టెక్నిక్‌పై దృష్టిసారించాడని బంగర్ వివరించాడు. ఏమాత్రం ఒత్తిడికి గురికావడం లేదని.. కావాల్సినంత విశ్రాంతిని కూడా తీసుకుంటున్నాడని పేర్కొన్నాడు. భవిష్యత్తులో కూడా ఇలానే ఉండనున్నాడని తెలిపాడు. భారత జట్టుకు కీలక ఆటగాడు కావడంతో అంతా కోహ్లీ ఫామ్‌పై ఆందోళన చెందుతున్నారు. త్వరలోనే అతను ఫామ్ అందుకుంటాడని సంజయ్ బంగర్ అన్నాడు. ఈ ఐపీఎల్‌లో కోహ్లీతో పాటు రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, బుమ్రా కూడా రాణించడం లేదు. వీళ్ల ఆటతీరు కూడా టీమిండియాను కలవరపెడుతుంది. అయితే ఐపీఎల్ ఆడనంత మాత్రన.. జాతీయ జట్టులో ఆడరని గ్యారెంటీ లేదని కొందరు వాదిస్తున్నారు.
Read Also.. Sachin Tendulkar: సచిన్‌ను ఎగతాళి చేస్తూ పోస్ట్ చేసిన ‘బార్మీ ఆర్మీ’.. దిమ్మతిరిగే కౌంటరచ్చిన మాజీ బౌలర్..