Asia Cup 2025: హార్దిక్ పాండ్యా వాచ్ ధర ఎంతో తెలుసా? పాకిస్థాన్ ప్లేయర్ల జీతం కలిపినా దానిని కొనలేరు!
సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్ ప్రారంభం కావడానికి ముందే, భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వాచ్ గురించి చర్చలు జరుగుతున్నాయి. ఆ వాచ్ ధర చాలా ఎక్కువగా ఉండడమే అందుకు ప్రధాన కారణం. ఆ వాచ్ ధర.. ఆసియా కప్‌కు ఎంపికైన 17 మంది పాకిస్థాన్ ఆటగాళ్ల వార్షిక జీతాల కంటే ఎక్కువ.

Asia Cup 2025: ఆసియా కప్ సెప్టెంబర్ 9 నుండి ప్రారంభం కానుంది. అయితే, అంతకంటే ముందే భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ధరించిన వాచ్ చర్చనీయాంశంగా మారింది. పాండ్యా వాచ్ చర్చల్లోకి రావడానికి కారణం దాని ధర. ఆసియా కప్ కోసం ఎంపికైన పాకిస్థాన్లోని 17 మంది ఆటగాళ్ల సంవత్సరం జీతం కలిపినా కూడా హార్దిక్ వాచ్ ధర కంటే తక్కువే ఉంటుంది. దుబాయ్‌లో ప్రాక్టీస్ చేయడానికి వచ్చినప్పుడు హార్దిక్ పాండ్యా ధరించిన ఆ ఖరీదైన వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది.
పాక్ ఆటగాళ్ల జీతాల కంటే హార్దిక్ వాచ్ ఖరీదు ఎక్కువ
హార్దిక్ పాండ్యా వాచ్ ధర ఎంత అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆసియా కప్‌కు ఎంపికైన పాకిస్థాన్ ఆటగాళ్ల వార్షిక జీతం ఎంత అనేది కూడా అందరూ ఆసక్తిగా తెలుసుకోవాలని చూస్తున్నారు. దానిపై ఉన్న లెక్కలు ఇలా ఉన్నాయి. ఆసియా కప్ కోసం పాకిస్థాన్ సెలక్ట్ చేసిన 17 మంది ఆటగాళ్లలో, ఏడుగురు ఆటగాళ్లు గ్రేడ్-బిలో ఉన్నారు. ఈ జాబితాలో అబ్రార్ అహ్మద్, ఫఖర్ జమాన్, హారిస్ రౌఫ్, హసన్ అలీ, సామ్ అయూబ్, సల్మాన్ అఘా, షాహీన్ అఫ్రిది ఉన్నారు. వీరందరికీ వార్షిక జీతం ఒక్కొక్కరికి రూ.1,69,02,540. ఈ విధంగా, ఏడుగురు ఆటగాళ్ల వార్షిక జీతం మొత్తం రూ.11,83,17,780లు అవుతుంది.
పాకిస్థాన్‌లోని ఐదుగురు ఆటగాళ్ల వార్షిక జీతం రూ.4.69 కోట్లు
పాకిస్థాన్ నుంచి 5 మంది ఆటగాళ్లు గ్రేడ్ సీలో ఉన్నారు. వీరు ఫహీమ్ అష్రఫ్, హసన్ నవాజ్, మహ్మద్ హారిస్, మహ్మద్ నవాజ్, షాహిబ్జాదా ఫర్హాన్. వీరిలో ఒక్కొక్కరి వార్షిక జీతం భారత కరెన్సీలో రూ.93,90,300. ఈ ఐదుగురి మొత్తం జీతం రూ.4,69,51,500.
మరో ఐదుగురు పాక్ ఆటగాళ్ల వార్షిక జీతం
మిగిలిన 5 మంది ఆటగాళ్లు గ్రేడ్ డీలో ఉన్నారు. వీరికి వార్షికంగా రూ.56,34,180 భారత కరెన్సీలో జీతం లభిస్తుంది. ఈ ఐదుగురి మొత్తం వార్షిక జీతం రూ.2,81,70,900.
హార్దిక్ పాండ్యా వాచ్ ఖరీదు రూ.20 కోట్లు!
ఆసియా కప్‌కు ఎంపికైన మొత్తం 17 మంది పాకిస్థాన్ ఆటగాళ్ల వార్షిక జీతాలను కలిపినా, ఆ మొత్తం భారత కరెన్సీలో రూ.19.34 కోట్లు అవుతుంది. ఈ మొత్తం కూడా హార్దిక్ పాండ్యా వాచ్ ధర కంటే తక్కువ. నివేదిక ప్రకారం, దుబాయ్‌లో ప్రాక్టీస్ సమయంలో హార్దిక్ పాండ్యా ధరించిన రిచర్డ్ మిల్లే RM 27-04 వాచ్ మార్కెట్ ధర దాదాపు రూ.20 కోట్లు అని సమాచారం.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




