AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Deepak Chahar : భార్య పుట్టిన రోజు మరచిపోయిన స్టార్ ప్లేయర్.. తర్వాత ఆమె రియాక్షన్ ఎలా ఉందంటే ?

భారత క్రికెటర్ దీపక్ చాహర్ తన వైవాహిక జీవితంలో ఒక పెద్ద నేరం చేసి కూడా ఎలాగైతే తప్పించుకున్నాడో అది ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అదేంటంటే, తన భార్య పుట్టినరోజును మర్చిపోయాడు. చాహర్ సోషల్ మీడియాలో ఒక ఫన్నీ పోస్ట్ పంచుకుంటూ, తన భార్య జయ పుట్టినరోజును మర్చిపోయానని ఒప్పుకున్నాడు.

Deepak Chahar : భార్య పుట్టిన రోజు మరచిపోయిన స్టార్ ప్లేయర్.. తర్వాత ఆమె రియాక్షన్ ఎలా ఉందంటే ?
Deepak Chahar
Rakesh
|

Updated on: Sep 07, 2025 | 4:55 PM

Share

Deepak Chahar : భారత క్రికెటర్ దీపక్ చాహర్ తన జీవితంలో ఒక పెద్ద తప్పు చేశాడు. అదేంటంటే.. తన భార్య పుట్టినరోజును మర్చిపోయాడు. అయితే, దీపక్ చాహర్ తన భార్య జయ పుట్టినరోజును మర్చిపోయానని అంగీకరిస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్‌లో తన భార్య చాలా మంచిదని, ఆమె అతన్ని క్షమించిందని చెప్పాడు. చాహర్ పోస్ట్ చూసిన అభిమానులు అతని భార్య జయను దేవి అని పిలుస్తున్నారు.

దీపక్ చాహర్ పోస్ట్​లో ఏముందంటే..

“హ్యాపీ బర్త్‌డే లవ్ @jayab05. నా భార్య ఎంత మంచిదో అందరికీ చెప్పాలనుకుంటున్నా. నేను ఆమె పుట్టినరోజును మర్చిపోయినా, ఆమె నన్ను క్షమించింది. ఎందుకంటే, 90 ఓవర్ల ఫీల్డింగ్ తర్వాత ఇలా జరగడం సహజమేనని ఆమె అర్థం చేసుకుంది. జయ.. వచ్చేసారి గుర్తుంచుకుంటాను” అని దీపక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ తర్వాత, చాహర్ మరో పోస్ట్ షేర్ చేశాడు. అందులో వారిద్దరూ కలిసి పుట్టినరోజు కేక్ కట్ చేశారు.

దీపక్ చాహర్ క్రికెట్ కెరీర్..

దీపక్ చాహర్ చివరిసారిగా 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20ఐ మ్యాచ్‌లో టీమ్ ఇండియా తరఫున ఆడాడు. గత 4-5 సంవత్సరాలుగా ఈ పేసర్ అనేక గాయాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. అందుకే జట్టులో అతన్ని భర్తీ చేయడానికి ఇతర పేసర్లకు అవకాశం లభించింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో గత ఏడాది మెగా వేలంలో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజ్ చాహర్‌ను రూ.9.25 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. చాహర్ మాజీ ఫ్రాంచైజ్ అయిన చెన్నై సూపర్ కింగ్స్‌తో ముంబై ఇండియన్స్ భారీ బిడ్డింగ్​లో పోరాడి అతన్ని దక్కించుకుంది. కొత్త బంతిని అద్భుతంగా స్వింగ్ చేయగల సామర్థ్యం ఉన్నప్పటికీ, చాహర్ ఇంకా టెస్ట్ అరంగేట్రం చేయలేదు. ప్రస్తుతం, అతను భారత జట్టులో ఏ అంతర్జాతీయ ఫార్మాట్‌లో కూడా ఆడడం లేదు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..