Watch Video: స్లిప్‌లో డేంజరస్ ఫీల్డింగ్.. గాల్లో డైవ్ చేసి కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన ఆసీస్ సారథి.. వీడియో చూస్తే షాకే..

Steve Smith Catch Viral: విశాఖపట్నంలో జరుగుతున్న రెండో వన్డేలో స్టీవ్ స్మిత్ స్లిప్ వద్ద ప్రమాదకరమైన క్యాచ్ పట్టాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

Watch Video: స్లిప్‌లో డేంజరస్ ఫీల్డింగ్.. గాల్లో డైవ్ చేసి కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన ఆసీస్ సారథి.. వీడియో చూస్తే షాకే..
Smith Viral Catch
Follow us

|

Updated on: Mar 19, 2023 | 4:17 PM

IND vs AUS: విశాఖపట్నంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా బలహీన స్థితిలో కనిపించింది. కేవలం 49 పరుగులకే సగం జట్టు పెవిలియన్‌కు చేరింది. హార్దిక్ పాండ్యా రూపంలో భారత జట్టు ఐదో వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా క్యాచ్‌ను ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ అద్భుతంగా పట్టుకుని పెవిలియన్ చేర్చాడు. స్లిప్‌లో స్మిత్ పట్టుకున్న ఈ క్యాచ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

క్యాచ్ పట్టుకోవడానికి స్మిత్ ఎంత అద్భుతంగా డైవ్ చేసాడో ఈ వీడియోలో చూడొచ్చు. బంతి హార్దిక్ పాండ్యా బ్యాట్ వెలుపలి అంచుని తీసుకొని స్లిప్ వైపు వెళ్లింది. అక్కడ ఉన్న స్టీవ్ స్మిత్ డైవింగ్ చేస్తూ బంతిని క్యాచ్ చేశాడు. స్మిత్ మొదటి స్లిప్ వద్ద ఉన్నాడు. అయితే, బంతి దాదాపు రెండవ స్లిప్‌కు వెళుతున్నప్పటికీ, దానిని క్యాచ్ పట్టేశాడు. తొలి ఇన్నింగ్స్‌ 10వ ఓవర్‌ మూడో బంతికి ఈ క్యాచ్ పట్టాడు. సీన్ అబాట్ ఆస్ట్రేలియాకు మరో వికెట్ అందించాడు.

ఇవి కూడా చదవండి

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా..

ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా బౌలింగ్ చేస్తూ ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ నాలుగు వికెట్లు పడగొట్టి, టీమిండియాకు చుక్కలు చూపించాడు. శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్‌లకు పెవిలియన్ దారి చూపించాడు.

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డే సిరీస్‌లో భారత జట్టు 117 పరుగులకు ఆలౌటైంది. కంగారూలపై సొంతగడ్డపై టీమిండియా సాధించిన అతిచిన్న స్కోరు ఇదే కావడం గమనార్హం. ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ కంగారూల నుంచి అత్యధికంగా 5 వికెట్లు పడగొట్టాడు. సీన్ అబాట్ మూడు వికెట్లు, నాథన్ ఎల్లిస్ రెండు వికెట్లు తీశారు.

భారత ప్లేయింగ్ ఎలెవన్..

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ , మహ్మద్ షమీ.

ఆస్ట్రేలియా ప్లేయింగ్ ఎలెవన్..

ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లాబుషాగ్నే, అలెక్స్ కారీ (కీపర్), కామెరాన్ గ్రీన్, మార్కస్ స్టోయినిస్, సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో