Hardik Pandya: మొనగాడురా బాబూ.! హార్దిక్ పాండ్యాకు మరో గుడ్ న్యూస్.. మొత్తానికి సాధించాడుగా

ఈసారి టీ20 బ్యాట్స్‌మెన్ల జాబితాలో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ అగ్రస్థానంలో ఉండగా.. బౌలర్లలో ఇంగ్లాండ్ ఆటగాడు ఆదిల్ రషీద్ అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా టాప్ ప్లేస్‌ను.. మరి రోహిత్, కోహ్లీ పరిస్థితి ఏంటి.?

Hardik Pandya: మొనగాడురా బాబూ.! హార్దిక్ పాండ్యాకు మరో గుడ్ న్యూస్.. మొత్తానికి సాధించాడుగా
Hardik Pandya
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 03, 2024 | 4:39 PM

టీ20 ప్రపంచకప్ అనంతరం ఐసీసీ కొత్త టీ20ఐ ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఈసారి టీ20 బ్యాట్స్‌మెన్ల జాబితాలో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ అగ్రస్థానంలో ఉండగా.. బౌలర్లలో ఇంగ్లాండ్ ఆటగాడు ఆదిల్ రషీద్ అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా టాప్ ప్లేస్‌ను కైవసం చేసుకున్నారు. ఇక టీ20 బ్యాట్స్‌మెన్ల జాబితాలోని టాప్ 10లో కేవలం ఇద్దరు భారత బ్యాటర్లు మాత్రమే తమ స్థానాన్ని పదిలం చేసుకోగలిగారు. టీ20 వరల్డ్‌కప్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడని ఎడమచేతి వాటం బ్యాటర్ యశ్వసి జైస్వాల్ 7వ స్థానంలో ఉండగా.. సూర్యకుమార్ యాదవ్ రెండోస్థానానికి పడిపోయాడు. అటు రోహిత్ శర్మ 527 పాయింట్లతో 38వ స్థానంలో, విరాట్ కోహ్లీ 499 పాయింట్లతో 47వ స్థానంలో ఉన్నారు.

టీ20 బ్యాటర్‌ల టాప్-10 జాబితా:

  • ట్రావిస్ హెడ్ (ఆస్ట్రేలియా)- 844 రేటింగ్
  • సూర్యకుమార్ యాదవ్ (భారత్)- 838 రేటింగ్
  • ఫిల్ సాల్ట్ (ఇంగ్లాండ్)- 797 రేటింగ్
  • బాబర్ ఆజం (పాకిస్తాన్)- 755 రేటింగ్
  • మహ్మద్ రిజ్వాన్ (పాకిస్తాన్)- 746 రేటింగ్
  • జోస్ బట్లర్ (ఇంగ్లాండ్)- 746 రేటింగ్
  • యశస్వి జైస్వాల్ (భారత్)- 659 రేటింగ్
  • బ్రాండన్ కింగ్ (వెస్టిండీస్)- 656 రేటింగ్
  • జాన్సన్ చార్లెస్ (వెస్టిండీస్)- 655 రేటింగ్
  • ఐడెన్ మార్క్రామ్ (దక్షిణాఫ్రికా)- 646 రేటింగ్

టీ20 బౌలర్ల జాబితా టాప్ 10లో ఇద్దరు భారత బౌలర్లు ఉన్నారు. స్పిన్నర్లు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ టాప్-10 జాబితాలో తమ స్థానాలను పదిలం చేసుకోగా.. టీమిండియా కీలక పేసర్ జస్ప్రీత్ బుమ్రా 12వ స్థానంలో కొనసాగుతున్నాడు.

టీ20 బౌలర్ల టాప్-10 జాబితా:

  1. ఆదిల్ రషీద్ (ఇంగ్లాండ్)- 718 రేటింగ్
  2. హెన్రిక్ నోకియా (దక్షిణాఫ్రికా)- 675 రేటింగ్
  3. వానిందు హసరంగా (శ్రీలంక)- 674 రేటింగ్
  4. రషీద్ ఖాన్ (ఆఫ్ఘనిస్తాన్)- 668 రేటింగ్
  5. జోష్ హాజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా) – 662 రేటింగ్
  6. అకీల్ హొస్సేన్ (వెస్టిండీస్)- 659 రేటింగ్
  7. అక్షర్ పటేల్ (భారతదేశం)- 657 రేటింగ్
  8. ఆడమ్ జంపా (ఆస్ట్రేలియా)- 654 రేటింగ్
  9. కుల్దీప్ యాదవ్ (భారత్)- 654 రేటింగ్
  10. ఫజల్హాక్ ఫరూకీ (ఆఫ్ఘనిస్తాన్)- 645 రేటింగ్

టీ20 ఆల్‌రౌండర్ల జాబితాలో టీమిండియా స్టార్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా అగ్రస్థానంలో నిలిచాడు. ఈ టీ20 ప్రపంచకప్‌లో అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో పాండ్యా అదరగొట్టిన సంగతి తెలిసిందే. అతడి అద్భుత ప్రదర్శనకు గానూ రెండు స్థానాలు ఎగబాకి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు హార్దిక్ పాండ్యా.

టీ20 ఆల్‌రౌండర్ల టాప్-10 జాబితా:

  • హార్దిక్ పాండ్యా (భారతదేశం)- 222 రేటింగ్
  • వానిందు హసరంగా (శ్రీలంక)- 222 రేటింగ్
  • మార్కస్ స్టోయినిస్ (ఆస్ట్రేలియా)- 211 రేటింగ్
  • సికందర్ రజా (జింబాబ్వే)- 210 రేటింగ్
  • షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్)- 206 రేటింగ్
  • మహ్మద్ నబీ (ఆఫ్ఘనిస్తాన్)- 205 రేటింగ్
  • దీపేంద్ర సింగ్ అరీ (నేపాల్)- 199 రేటింగ్
  • లియామ్ లివింగ్‌స్టోన్ (ఇంగ్లాండ్) – 187 రేటింగ్
  • ఐడెన్ మార్క్రామ్ (దక్షిణాఫ్రికా)- 186 రేటింగ్
  • మొయిన్ అలీ (ఇంగ్లా్ండ్)- 174 రేటింగ్

ఇక ఆల్‌రౌండర్ల జాబితాలో భారత్ నుంచి తొలి ఆల్‌రౌండర్‌గా అగ్రస్థానాన్ని దక్కించుకుని రికార్డు నెలకొల్పాడు హార్దిక్. గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, రవి బిష్ణోయ్ తర్వాత టీ20ఐ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్న ఆరో భారతీయ క్రికెటర్‌గా హార్దిక్ పాండ్యా నిలిచాడు. గతంలో గంభీర్, కోహ్లీ, స్కై బ్యాటర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉండగా.. బుమ్రా, బిష్ణోయ్ బౌలర్ల జాబితాలో టాప్ ప్లేస్ దక్కించుకున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..